Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/if-that-happened-then-jakkanna-would-be-watching-rrr-today63d4c9cf-972e-45f2-a43e-babf0afe2088-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/if-that-happened-then-jakkanna-would-be-watching-rrr-today63d4c9cf-972e-45f2-a43e-babf0afe2088-415x250-IndiaHerald.jpgదర్శక ధీరుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేప్పటిన భారీ ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ మూవీని చాలా గ్యాప్ తర్వాత ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. సుమారుగా బాహుబలి తర్వాత గ్యాప్ తీసుకున్న తర్వాత జక్కన్న తెరకెక్కిస్తున్న చిత్రం ఈ మూవీనే. అందుకే ఈ మూవీపై భారీ అంచనాలే పెట్టుకున్నారు జక్కన్న అభిమానులు. ఈ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా రామ్ చరణ్ లు కలిసి నటిస్తున్నారు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో, రామ్ చరణ్ మన్నెం దొర అల్లూరి సీతారామరాజు గా కనిపించనున్నారు. ఈ హీరోల సరసన అలియా భట్, ఒలివియా మోరీస్rajamouli;ntr;ram charan teja;alia bhatt;ram pothineni;rajamouli;alluri sitarama raju;rrr movie;cinema;bahubali;january;success;nandamuri taraka rama raoవామ్మో ఆర్ఆర్ఆర్ మూవీపై ఇన్నీ మీమ్స్ అండ్ కామెంట్సా... కారణం అందుకోసమేనా ?వామ్మో ఆర్ఆర్ఆర్ మూవీపై ఇన్నీ మీమ్స్ అండ్ కామెంట్సా... కారణం అందుకోసమేనా ?rajamouli;ntr;ram charan teja;alia bhatt;ram pothineni;rajamouli;alluri sitarama raju;rrr movie;cinema;bahubali;january;success;nandamuri taraka rama raoFri, 08 Jan 2021 10:50:01 GMTబాహుబలి తర్వాత గ్యాప్ తీసుకున్న తర్వాత జక్కన్న తెరకెక్కిస్తున్న చిత్రం ఈ మూవీనే. అందుకే ఈ మూవీపై భారీ అంచనాలే పెట్టుకున్నారు జక్కన్న అభిమానులు. ఈ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా రామ్ చరణ్ లు కలిసి నటిస్తున్నారు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో, రామ్ చరణ్ మన్నెం దొర అల్లూరి సీతారామరాజు గా కనిపించనున్నారు. ఈ హీరోల సరసన అలియా భట్, ఒలివియా మోరీస్ లు నటించనున్నారు. ఈ మల్టీస్టారర్ సినిమాకు డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే  వచ్చిన ఈ సినిమా పోస్టర్లు, ప్రోమోలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.


అందులో యంగ్ టైగర్ ఎంట్రీ ప్రోమో అయితే రికార్డులే క్రియేట్ చేసింది. ఈ భారీ సినిమా కోసం సినీ ప్రేక్షకులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాను ఇదివరకే విడుదల చేస్తామని మూడు సార్లు ప్రకటించారు.. మళ్లీ విరమించుకున్నారు. అయితే చివరి సారిగా మాత్రం 2021 జనవరి 8 వ తేదీన పక్కాగా ‘ఆర్ఆర్ఆర్’మూవీని విడుదల చేస్తామని ప్రకటించింది ఈ చిత్ర యూనిట్. అయితే కరోనా విలయ తాండవం అడటం మూలంగా ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది. దాంతో షూటింగ్ కంప్లీట్ కావడానికి లేట్ అవుతూ వస్తోంది. అయితే జనవరి 8 న పక్కాగా రిలీజ్ చేస్తామని ఆ చిత్ర యూనిట్ చెప్పిన మాటను ప్రేక్షకులు ఇంకా మర్చిపోలేదు. అందుకే ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

ఇవే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. రకరకాల మీమ్స్ తో ఆర్ఆర్ఆర్ సినిమా  గురించి మీమ్స్ ను పెడుతున్నారు. అందులో ఎప్పుడు రిలీజ్ చేస్తారు.. ఇప్పట్లో ఈ సినిమా రిలీజ్ అవుతుందా.. లేదా, థియేటర్లలో సినిమాను చూస్తున్నట్టు ఈ సినిమాకు రివ్యూలు ఇస్తున్నట్లుగా ఉండే మీమ్స్ పెడుతున్నారు. మరికొంతమందైతే 2031 లో రిలీజ్ అవుతుందేమోనని పోస్టులు పెడుతున్నారు.  ఇంకొందరైతే అంతా అనుకున్నట్టే సవ్యంగా జరిగుంటే ఇప్పటికల్లా రిలీజై సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేసుకునే వారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వీలైనంత తొందరలో షూటింగ్ ను కంప్లీట్ చేసి థియేటర్లలో సందడి చేయడానికి ఏర్పట్లు చేస్తున్నారట జక్కన్న. ఇప్పటికే రిలీజైన హీరోల ఇంట్రో వీడియోలు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకులకు అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 


శాకుంతలం’ కోసం భారీ సెట్ ప్లాన్ చేస్తున్న డైరెక్టర్..!?

రెండు రాష్ట్రాల్లో దిగిన ఆ నలుగురు ఎవరు...?

బాహుబలి మేనియా గుర్తు చేస్తున్న K.G.F చాప్టర్ 2..!

తెలంగాణకు ఎక్కువ డోసులు !

సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>