PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nandamuri-balakrishnaf114152c-fcb3-4bbf-b700-d1766766352e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nandamuri-balakrishnaf114152c-fcb3-4bbf-b700-d1766766352e-415x250-IndiaHerald.jpgఏపీ ప్రభుత్వం హిందూపురాన్ని జిల్లాగా మార్చాలంటూ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు. హిందూపురాన్ని జిల్లా చేసే విషయానికి సంబంధించి అవసరమైతే సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా కలుస్తానని ఆయన అన్నారు. గత కొద్ది రోజులుగా బాలకృష్ణ హిందూపురంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడి రైతుల కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఇక ఏపీలో నెలకొన్న పరిస్థితులపై కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు.nandamuri balakrishna;auto;nani;balakrishna;kodali nani;manu;amarnath cave temple;andhra pradesh;district;nandamuri balakrishna;cm;village;hindupuram;mla;pistachio;minister;letter;ycp;nandamuri taraka rama raoహిందూపురాన్ని జిల్లాగా మార్చాలి.. అవసరమైతే సీఎంను కలుస్తా: నందమూరి బాలకృష్ణహిందూపురాన్ని జిల్లాగా మార్చాలి.. అవసరమైతే సీఎంను కలుస్తా: నందమూరి బాలకృష్ణnandamuri balakrishna;auto;nani;balakrishna;kodali nani;manu;amarnath cave temple;andhra pradesh;district;nandamuri balakrishna;cm;village;hindupuram;mla;pistachio;minister;letter;ycp;nandamuri taraka rama raoFri, 08 Jan 2021 17:14:50 GMTఅనంతపురం: ఏపీ ప్రభుత్వం హిందూపురాన్ని జిల్లాగా మార్చాలంటూ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు. హిందూపురాన్ని జిల్లా చేసే విషయానికి సంబంధించి అవసరమైతే సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా కలుస్తానని ఆయన అన్నారు. గత కొద్ది రోజులుగా బాలకృష్ణ హిందూపురంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడి రైతుల కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఇక ఏపీలో నెలకొన్న పరిస్థితులపై కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. ముఖ్యంగా దేవాలయాలపై దాడులు, పేకాట క్లబ్‌లకు సంబంధించి ఆయన అధికార పార్టీకి చెందిన నేతలపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం అసలు ఏ మాత్రం స్పందించడం లేదని ఆయన అన్నారు.
ప్రభుత్వానికి కన్నుమిన్ను ఆనడం లేదని పేర్కొన్నారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ విషయంలో అన్యాయం జరిగిందని ఆరోపించారు. వైసీపీ బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని విస్మరిస్తోందని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పేకాట క్లబ్‌లకు సంబంధించి మంత్రి కొడాలి నానిపై పరోక్షంగా సెటైర్లు వేశారు.పేకాట క్లబ్‌లపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేయగా.. ఈ వ్యాఖ్యలకు బాలకృష్ణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘రెచ్చగొట్టకండి. రెచ్చగొడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. న్యాయం, చట్టం అంటే లెక్కలేనితనం. ఎవడికైనా చెబుతున్నా.. మా సహనాన్ని పరీక్షించొద్దు. ఉత్తుత్తినే నోరు పారేసుకోవద్దు. మేము మాటల మనుషులంకాదు. అవసరమైతే చేతలను కూడా చూపిస్తాం. జాగ్రత్త.. తస్మాత్!’’ అని బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. మంత్రి కొడాలి నాని ఇలా ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకోవడం సరికాదంటూ చెప్పుకొచ్చారు. కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోవాలి హెచ్చరించారు. కాగా.. గుడివాడ నియోజకవర్గ పరిధిలోని తమిరశ గ్రామంలో గత ఆదివారం రాత్రి ఎస్‌ఈబీ దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో 30 మంది పేకాట రాయుళ్లను, 28 కార్లు, కోట్ల కొద్దీ నగదును ఎస్‌ఈబీ పట్టుకుంది.


మా అక్కను వేధిస్తున్నారు... అఖిల ప్రియ తమ్ముడు సంచలన వ్యాఖ్యలు

నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?

ఇకపై ప్రతీ పరీక్ష ఆన్ లైన్ లోనే..!

ఫోన్‌కు వచ్చిన లింక్ ఓపెన్ చేశాడు.. ఐదు నిమిషాల తర్వాత ఒక్కసారిగా షాక్!

రికార్డులను కొల్లగొడుతున్న రాకింగ్ స్టార్ యష్

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తరువాతే పీసీసీ చీఫ్ నియామకం

కీలక విషయాన్ని బయటపెట్టిన పవన్ కల్యాణ్ భార్య




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>