PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hairff77db8e-c7a9-46cb-a011-178d79d01153-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hairff77db8e-c7a9-46cb-a011-178d79d01153-415x250-IndiaHerald.jpgఆరోగ్యకరమైన తిండి తింటే ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతమవుతుంది. ఒక్కోసారి సడన్ గా మీ జుట్టు ఊడటం మొదలుకావచ్చు. దానికి కారణం మీరు తింటున్న తిండిలో కొన్ని పోషకాలు లేకపోవటమే. రుచితో పాటు న్యూట్రిషిన్స్ ఉన్న ఆహారం చాలా ముఖ్యం కనుక బలమైన తిండి తినండి. మీరు తినే తిండిలో ఏముంది, ఏం లేదు ఒకసారి చెక్ చేసుకోండి.hair;egg;vitamin;heart;cheque;stree;protein;insulin;chris lynnఉన్నట్టుండి మీ జుట్టు రాలిపోతుందా.. అవి తినకండి..!?ఉన్నట్టుండి మీ జుట్టు రాలిపోతుందా.. అవి తినకండి..!?hair;egg;vitamin;heart;cheque;stree;protein;insulin;chris lynnFri, 08 Jan 2021 06:00:00 GMTచెక్ చేసుకోండి.

ఇన్సులిన్ రెసిస్టన్స్ వల్ల స్థూలకాయం, డయాబెట్స్, స్త్రీ, పురుషుల్లో బట్ట తల వంటి అనేక సమస్యలు వస్తాయి. అయితే.. ఆ ఇన్సులిన్ రెసిస్టన్స్ కు ప్రధాన కారణం మనం తినే ఆహారంలో ఉన్న చక్కెర, రీఫైన్డ్ కార్బోహైడ్రేట్లే. కాబట్టి.. ఇప్పటికే మీకు జుట్టు రాలే సమస్య ఉంటే చక్కెర పదార్థాలు తీసుకోవడం తగ్గించండి. హై గ్లైసమిక్ ఇండెక్స్: గ్లైసమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ ఉన్న ఆహారంతో జుట్టు రాలుతుంది. రీఫైన్డ్ ఫ్లోర్, బ్రెడ్, చక్కెర వంటి వాటిలో గ్లైసమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి హార్మోనల్ ఇంబాలెన్స్ కు దారి తీసి, ఇన్సులిన్ స్థాయిలను విపరీతంగా పెంచి, జుట్టు రాలేలా చేస్తాయి. కాబట్టి జీఐ ఎక్కువ ఉన్న ఆహారం తినకండి.

మద్యపాన సేవనంతో జుట్టు కూడా రాలుతుంది. కెరాటిన్ అనే ప్రొటీన్ తో తయారయ్యే జుట్టుకు ఆల్కహాల్ అత్యంత ప్రమాదకారి. ఆల్కహాల్ ప్రొటీన్లను బలహీనపరుస్తుంది కనుక జుట్టు కూడా విపరీతంగా రాలుతుంది. డైట్ సోడా : అస్పర్టేమ్ అనే కృత్రిమ స్వీట్నర్ వేసి తయారు చేసే డైట్ సోడా వెంట్రుకలను బలహీనపరుస్తుంది. కుదుళ్లను బలహీనపరచి జుట్టు రాలేలా చేసే సైడ్ ఎఫెక్ట్ డైట్ సోడాతో ఉంటుంది. మీకు జుట్టు రాలుతుంటే డైట్ సోడాలు తాగటం ఆపేయండి.

జంక్ ఫుడ్ లో ఉన్న శాచురేటెడ్ వంటి రకాల ఫ్యాట్ లతో ఊబకాయం రావటమే కాదు గుండె జబ్బుల ప్రమాదాలకు దారితీస్తుంది. ఇందులో భాగంగా జుట్టు కూడా రాలిపోతుంది. నూనెలు ఎక్కువ ఉన్న పదార్థాలు రోజూ తినటం వంటి వాటి వల్ల కూడా మీ జుట్టు ఊడిపోతుంది. గుడ్లలో ఉన్న ప్రొటీన్ వెంట్రుకలకు చాలా మంచిది. కానీ పచ్చి ఎగ్ వైట్స్ తీసుకోవటం వల్ల బయోటిన్ లోపం ఏర్పడుతుంది. కెరాటిన్ ను ఉత్పత్తి చేయటంలో ఈ బయోటిన్ అనే విటమిన్ సహకరిస్తుంది. పచ్చి గుడ్ల సొన తాగటంతో బయోటిన్ లోపం తలెత్తి.. జుట్టుకు పోషణ తగ్గి రాలటం పెరుగుతుంది.

చేపల్లో అత్యధికంగా ఉన్న పాదరసం నిల్వలకారణంగా చేపలు ఎక్కువగా తినేవారిలో కొందరికి ఉన్నట్టుండి జుట్టు ఊడిపోతుంది. వాతావరణంలో వస్తున్న భారీ మార్పుల కారణంగా మిథైల్ మెర్క్యురీ నిల్వలు చేపల్లో విపరీతంగా పెరుగుతున్నాయి. సముద్ర చేపలైనా టూనా ఫిష్ వంటివాటిలో మెర్క్యురీ చాలా ఎక్కువ. చేపలతో వెంట్రుకలు బాగా పెరుగుతాయి కానీ మీరు ఎలాంటి చేపలు తింటున్నారనే దానిపైనే ఇదంతా ఆధారపడి ఉంటుంది.


జ‌న‌వ‌రి 7వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. విశేషాలేంటో తెలుసా..?

సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?

తెరాస పార్టీ బీజేపీ ని కాకుండా బండి ని టార్గెట్ చేయడంలో మర్మం ఏంటి..?

ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్దరించండి

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>