PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coivd-vaccine-transport-started-in-indiaa39635bf-dfe5-4bd5-af08-516a06fd1331-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coivd-vaccine-transport-started-in-indiaa39635bf-dfe5-4bd5-af08-516a06fd1331-415x250-IndiaHerald.jpgకరోనా వ్యాక్సినేషన్ కు భారత్ సిద్ధమవుతోంది. దేశంలో కరోనా టీకా సరఫరా ప్రారంభమైంది. మహారాష్ట్రలోని పుణెలో ఉన్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా నుంచి తొలి దశ కొవిషీల్డ్‌ టీకా డోసులు గురువారం రాత్రి 9 గంటలకు ఢిల్లీకి చేరాయి. ఈ డోసులను ఢిల్లీలోని రాజీవ్‌ గాంధీ ఆస్పత్రిలో నిల్వ చేయనున్నారు. దేశంలో టీకా రవాణాకు 41 విమానాశ్రయాలను గమ్యస్థానా లుగా కేంద్రం ప్రభుత్వం ఖరారు చేసింది. coivd19 vaccine;mini;india;mohandas karamchand gandhi;chennai;central governmentభారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరాభారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరాcoivd19 vaccine;mini;india;mohandas karamchand gandhi;chennai;central governmentFri, 08 Jan 2021 08:42:23 GMTభారత్ సిద్ధమవుతోంది. దేశంలో కరోనా టీకా సరఫరా ప్రారంభమైంది. మహారాష్ట్రలోని పుణెలో ఉన్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా  నుంచి తొలి దశ కొవిషీల్డ్‌ టీకా డోసులు గురువారం రాత్రి 9 గంటలకు ఢిల్లీకి చేరాయి. ఈ డోసులను ఢిల్లీలోని రాజీవ్‌ గాంధీ ఆస్పత్రిలో నిల్వ చేయనున్నారు. దేశంలో టీకా రవాణాకు 41 విమానాశ్రయాలను గమ్యస్థానా లుగా కేంద్రం ప్రభుత్వం ఖరారు చేసింది. అక్కడినుంచి.. నిర్దేశించిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాంతాలకు సరఫరా చేస్తారు.పుణె సెంట్రల్‌ హబ్‌గా టీకా చేరవేత మొదలుకానుంది. దక్షిణాదికి హైదరాబాద్‌, చెన్నై మినీ హబ్‌లుగా నిలవనున్నాయి.


  దేశవ్యాప్తంగా ఇవాళ రెండో విడుత కరోనా వ్యాక్సిన్‌ డ్రైరన్‌ నిర్వహిస్తున్నారు.  వ్యాక్సిన్‌ పంపిణీలో తలెత్తే లోటుపాట్లు గుర్తిచేందుకు డ్రైరన్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా దేశంలోని 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 736 జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగనుంది. ఇప్పటికే కోల్డ్‌ చైన్‌ విధానాన్ని మరింత పటిష్టం చేసినట్లు కేంద్రం వెల్లడించింది. వ్యాక్సినేషన్‌ కోసం మానవ వనరులు సిద్ధం చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. తొలి డ్రైరన్‌లో గుర్తించిన లోపాలను సరిదిద్దుకోవాలని, వ్యాక్సిన్‌పై ప్రజల్లో అపోహలను తొలగించాలని పిలుపునిచ్చింది.

   దేశవ్యాప్త కరోనా డ్రైరన్‌లో భాగంగా  తెలంగాణలోని 12 వందల కేంద్రాల్లో డమ్మీ వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. ఒక్కొ కేంద్రంలో 25 మందికి నమూనా ప్రక్రియ నిర్వహించనున్నారు. దీనిద్వారా కోవిడ్ యాప్‌లో లోపాలను పరిశీలించడంతోపాటు, వ్యాక్సిన్‌ పంపిణీలో సమస్యలపై దృష్టిసారించనున్నారు. వాటిని గుర్తించి పరిష్కరించనున్నారు. డమ్మీ వ్యాక్సినేషన్‌ కోసం ఇప్పటికే అధికారులు ఏర్పాట్లను సిద్ధం చేశారు.

  మరోవైపు కొవాగ్జిన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు 25,800 మంది నమోదు చేసుకున్నారని భారత్‌ బయోటెక్‌ సంస్థ  తెలిపింది. దేశవ్యాప్తంగా 26 వేల మందిపై ట్రయల్స్‌ నిర్వహణ లక్ష్యంతో నవంబరు నెల మధ్య నుంచి నమోదు ప్రారంభించారు. ఈ లక్ష్యాన్ని దాదాపు చేరుకున్నట్లైంది.డిసెంబరు చివరి వరకు హైదరారాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రిలో 1,400 మందిపై ఫేజ్‌-3 ట్రయల్స్‌ నిర్వహించారు.




సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?

తెరాస పార్టీ బీజేపీ ని కాకుండా బండి ని టార్గెట్ చేయడంలో మర్మం ఏంటి..?

ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్దరించండి

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?

ఎమ్మెల్యేలను పిలుస్తున్న జగన్... షాక్ ఇస్తారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>