Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/syam-singh-roydbeb1092-183c-4938-a587-3e3ea054d67b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/syam-singh-roydbeb1092-183c-4938-a587-3e3ea054d67b-415x250-IndiaHerald.jpgపిరియాడిక్‌ మూవీగా రూపొందనున్న శ్యాం సింగరాయ్ సినిమా పాన్ ఇండియా సినిమాగా మారనుందా..? అందుకోసం ఖర్చుకు కూడా దర్శక నిర్మాతలు వెనుకాడడం లేదా..? అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్‌లో అనేకమంది స్టార్ హీరోలు పాన్ ఇండియాలోకి..syam singh roy;venkatesh;nani;murli sharma;shiva;anil music;anil ravipudi;niharika konidela;rahul new;rahul;siva nirvana;k l rahul;india;kudumu;cinema;telugu;lord siva;rahul sipligunj;heroine;yuva;shiva nirvana;venky kudumula;calcutta;chitramనాని సినిమా కోసం కోట్లు ఖర్చు చేసి భారీ సెట్.. మరో పాన్ ఇండియా సినిమా రెడీ అవుతోందా..?నాని సినిమా కోసం కోట్లు ఖర్చు చేసి భారీ సెట్.. మరో పాన్ ఇండియా సినిమా రెడీ అవుతోందా..?syam singh roy;venkatesh;nani;murli sharma;shiva;anil music;anil ravipudi;niharika konidela;rahul new;rahul;siva nirvana;k l rahul;india;kudumu;cinema;telugu;lord siva;rahul sipligunj;heroine;yuva;shiva nirvana;venky kudumula;calcutta;chitramFri, 08 Jan 2021 20:55:05 GMTఇంటర్నెట్ డెస్క్: పిరియాడిక్‌ మూవీగా రూపొందనున్న శ్యాం సింగరాయ్ సినిమా పాన్ ఇండియా సినిమాగా మారనుందా..? అందుకోసం ఖర్చుకు కూడా దర్శక నిర్మాతలు వెనుకాడడం లేదా..? అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్‌లో అనేకమంది స్టార్ హీరోలు పాన్ ఇండియాలోకి అడుగుపెడుతున్నారు. ప్రభాస్‌తో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు మిగతా హీరోలు కూడా ఫాలో అయిపోతున్నారు. అయితే ఇప్పుడు ఆ జాబితాలో న్యాచురల్ స్టార్ నాని కూడా చేరబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. లాక్‌డౌన్ తరువాత మొదలైన సినిమా షూటింగ్ సెట్లు కూడా ఆ విషయాన్ని రుజువు చేస్తున్నాయి.

శ్యాం సింగరాయ్ సినిమా పూర్తిగా కలకత్తా నేపథ్యంలో తెరకెక్కనున్న కథగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం హైదరాబాద్‌లోనే కలకత్తా సెట్ వేస్తున్నారట. అది కూడా దాదాపు 15 ఎకరాల్లో భారీ స్థాయిలో ఈ సెట్ ఉండబోతోందట. ఈ సెట్ కోసం ఇప్పటికే రూ.6 కోట్ల వరకు ఖర్చు అయిందట. అంటే ఓ చిన్న సినిమాకు అయ్యే ఖర్చుతో దాదాపు సమానం. ఇంతలా ఖర్చు చేస్తున్నారంటే సినిమాను ఒక్క తెలుగుకే కాకుండా మిగతా భాషలలో విడుదల చేయబోతున్నారా..? అనే టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే చిత్రంలో నాని విలక్షణ పాత్రలో కనిపిస్తాడని, ఇంతకుముందు ఎన్నడూ అతడిని అలాంటి పాత్రలో చూసి ఉండరని దర్శకనిర్మాతలు చెబుతూ వస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే శ్యాం సింగరాయ్ మరో పాన్ ఇండియా మువీగా మారే అవకాశం కనిపిస్తోంది. అయిత దీనిపై ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇదిలా ఉంటే నాని శ్యాం సింగరాయ్‌ చిత్రానికి యువ దర్శకులు శివ నిర్వాణ, వెంకీ కుడుముల స్క్రిప్ట్ అందించగా.. అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహిచనున్నారు. వెంకట్‌ బోయినపల్లి నిర్మాతగా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. నాని సరసన సాయి పల్లవితో పాటు మరో హీరోయిన్ ఉండనున్నారట. మెలోడీ స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించనున్నారు. మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, అభినవ్ గోమాతమ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


వెనక్కు తగ్గని నిమ్మగడ్డ.. ఎన్నికలు జరపాల్సిందే అంటూ మరో లేఖ !

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా

దేవాలయాల మీద దాడులు వెనక కుట్ర కోణం...?

నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>