MoviesHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/yasha46e5e76-0e9f-4010-9843-6e533b47e86d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/yasha46e5e76-0e9f-4010-9843-6e533b47e86d-415x250-IndiaHerald.jpgరాకింగ్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ చిత్రం తెలుగు నాట ఏ విధంగా చరిత్ర సృష్టించిందో తెలిసిన విషయమే. ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 2 కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఒక కన్నడ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఇంతలా ఎదురుచూస్తున్నారంటే ఈ సినిమాపై అంచనాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.yash;auto;view;yash;india;cinema;history;kannada;letter;kgfరికార్డులను కొల్లగొడుతున్న రాకింగ్ స్టార్ యష్రికార్డులను కొల్లగొడుతున్న రాకింగ్ స్టార్ యష్yash;auto;view;yash;india;cinema;history;kannada;letter;kgfFri, 08 Jan 2021 17:40:00 GMTరాకింగ్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ చిత్రం తెలుగు నాట ఏ విధంగా చరిత్ర సృష్టించిందో తెలిసిన విషయమే. ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 2 కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఒక కన్నడ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఇంతలా ఎదురుచూస్తున్నారంటే ఈ సినిమాపై అంచనాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్ర టీజర్‌ను యష్ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం విడుదల చేయాలని చిత్ర దర్శక నిర్మాతలు ముందుగా అనుకున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటల 18 నిమిషాలకు టీజర్ విడుదలవ్వాలి.
కానీ.. వివిధ కారణాల వల్ల అనుకున్న సమయం కంటే 12 గంటల ముందే కేజీఎఫ్ చాప్టర్ 2 టీజర్ బయటకు వచ్చేసింది. ఇక ఈ టీజర్ విడుదలైన విడుదలైన 79 నిమిషాల్లోనే 1 మిలియన్ లైక్స్ సంపాదించి సరికొత్త రికార్డును నెలకొల్పింది. కేవలం పది గంటల వ్యవధిలోనే 15 మిలియన్స్ వ్యూస్‌ను సంపాదించుకుంది. టీజర్ రిలీజ్ అయ్యి ఒకరోజు కూడా గడవక ముందే 5 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పటివరకు 30 లక్షలకు పైగా లైక్స్‌ను సంపాదించింది. సహజంగా పాన్ ఇండియా చిత్రం అంటే ఒక్కో భాషలో ఒక్కో టీజర్‌ను విడుదల చేస్తుంటారు. కేజీఎఫ్ 2 టీజర్‌ విషయానికి వస్తే అన్ని భాషల్లో ఒకే రకమైన టీజర్‌ను వదిలారు. టీజర్‌లో మొత్తం ఇంగ్లీషు డైలాగ్స్ ఉండటంతో భాషతో సంబంధం లేకుండా టీజర్ ఉంది. నిజానికి ఈ చిత్రం ఈ పాటికే విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా చిత్ర షూటింగ్‌కు అంతరాయం కలిగింది. 2021లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర యూనిట్ గతంలో తెలిపింది. అయితే ఇప్పుడు చిత్ర టీజర్‌లో సినిమా రిలీజ్ ఎప్పుడన్నది మాత్రం దర్శక నిర్మాతలు వెల్లడించలేదు.


మా అక్కను వేధిస్తున్నారు... అఖిల ప్రియ తమ్ముడు సంచలన వ్యాఖ్యలు

నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?

ఇకపై ప్రతీ పరీక్ష ఆన్ లైన్ లోనే..!

ఫోన్‌కు వచ్చిన లింక్ ఓపెన్ చేశాడు.. ఐదు నిమిషాల తర్వాత ఒక్కసారిగా షాక్!

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తరువాతే పీసీసీ చీఫ్ నియామకం

కీలక విషయాన్ని బయటపెట్టిన పవన్ కల్యాణ్ భార్య

ఒకేరోజు 9 ఆలయాలకు సీఎం జగన్ భూమి పూజ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>