PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-harsha-kumar7b5dc07c-f6cd-4738-8124-0082d8eb4b17-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-harsha-kumar7b5dc07c-f6cd-4738-8124-0082d8eb4b17-415x250-IndiaHerald.jpgదేవాలయాలు, దేవతామూర్తుల విగ్రహాలపై దాడులు ఓ పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని మాజీ ఎంపి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జివి హర్ష కుమార్ ఆరోపించారు. 135 చోట్ల దాడులు జరిగాయని, ఇవి అన్నీ పకడ్భందీగా కుట్ర పూరితంగా జరుగుతున్నాయని విమర్శించారు. గతంలో ఎన్నడూ ఇటువంటి ఘటనలు చూడలేదన్న ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోషులను పట్టుకోవాల్సింది పోయి ఓటు బ్యాంకు రాజకీయ చేస్తున్నారని ఆరోపించారు. మత విధ్వంస పధక రచన చేసి హైదరాబాద్ లో గెలిచిన బిజేపితో ఎంఐఎం లోపాయకారి ఒప్పందం ఉందని అన్నారు. విగ్రహాల ధ్వంసం ఘటనలోtelangana;amala akkineni;kumaar;rachana;swetha;tiru;hyderabad;jagan;congress;mp;scheduled caste;tirupati;bank;husband;murder.;central government;partyవిగ్రహాల ధ్వంసం.. హర్షకుమార్ సంచలన ఆరోపణలువిగ్రహాల ధ్వంసం.. హర్షకుమార్ సంచలన ఆరోపణలుtelangana;amala akkineni;kumaar;rachana;swetha;tiru;hyderabad;jagan;congress;mp;scheduled caste;tirupati;bank;husband;murder.;central government;partyFri, 08 Jan 2021 17:15:05 GMTదేవాలయాలు, దేవతామూర్తుల విగ్రహాలపై దాడులు ఓ పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని మాజీ ఎంపి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జివి హర్ష కుమార్ ఆరోపించారు. 135 చోట్ల దాడులు జరిగాయని, ఇవి అన్నీ పకడ్భందీగా కుట్ర పూరితంగా జరుగుతున్నాయని విమర్శించారు. గతంలో ఎన్నడూ ఇటువంటి ఘటనలు చూడలేదన్న ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోషులను పట్టుకోవాల్సింది పోయి ఓటు బ్యాంకు రాజకీయ చేస్తున్నారని ఆరోపించారు. మత విధ్వంస పధక రచన చేసి హైదరాబాద్ లో గెలిచిన బిజేపితో ఎంఐఎం లోపాయకారి ఒప్పందం ఉందని  అన్నారు. విగ్రహాల ధ్వంసం ఘటనలో ఇప్పటి వరకు ఒక్క దోషిని పట్టుకోలేకపోయారంటే ఏం అనుకోవాలని  ప్రశ్నించారు. 

జగన్ ఓటు బ్యాంక్ కి చిల్లుపడిందని, మైనారిటీలు.. వెనుకబడిన వర్గాలు పార్టీకి దూరమయ్యారని వ్యాఖ్యానించారు. తిరుపతి ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని విగ్రహాలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. దోషులను పట్టుకోవడమేనది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్దేశంగా కనిపించడం లేదన్న ఆయన మత సంబంధిత విద్వేషాలు రెచ్చగొట్టేందుకేనని అన్నారు. ప్రభుత్వాలు తలచుకుంటే దోషులను పట్టుకోవడం ఎంత సేపు అని ఆయన ప్రశ్నించారు. 

సుప్రీం కోర్ట్ లేదా హై కోర్ట్ సిట్టింగ్ జడ్జ్ ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ అమలు చేస్తామని  చేయలేదని, ఇప్బటి వరకు సబ్ ప్లాన్ నిధుల పై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ విద్యార్ధులకు ఇచ్చే స్కాలర్ షిప్పు ఎందుకు నిలిపివేశారు ? ఎస్సీలంటే ఎందుకు వివక్ష అని ప్రశ్నించారు. ఎంత మంది ఎస్సీలను హత్య చేశారో త్వరలోనే వివరాలు వెల్లడిస్తానని హర్షకుమార్ ప్రకటించారు. రాజకీయాల్లో బైబిలు, భగవధ్గీతాకు ఓటేస్తారా అన్న మాటలు నేనేప్పుడు వినలేదని ఆయన అన్నారు.




మా అక్కను వేధిస్తున్నారు... అఖిల ప్రియ తమ్ముడు సంచలన వ్యాఖ్యలు

నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?

ఇకపై ప్రతీ పరీక్ష ఆన్ లైన్ లోనే..!

ఫోన్‌కు వచ్చిన లింక్ ఓపెన్ చేశాడు.. ఐదు నిమిషాల తర్వాత ఒక్కసారిగా షాక్!

రికార్డులను కొల్లగొడుతున్న రాకింగ్ స్టార్ యష్

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తరువాతే పీసీసీ చీఫ్ నియామకం

కీలక విషయాన్ని బయటపెట్టిన పవన్ కల్యాణ్ భార్య




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>