PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-minister-anil-have-tough-fight-in-nellore-city-2191f118-17d5-4548-a96f-41a28a498c58-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-minister-anil-have-tough-fight-in-nellore-city-2191f118-17d5-4548-a96f-41a28a498c58-415x250-IndiaHerald.jpgజగన్ కేబినెట్‌లో ఫైర్‌బ్రాండ్ మంత్రులకు ఎలాంటి కొదవ లేదు. తమ శాఖలపై పట్టు తెచ్చుకుని, మంచిగా పనిచేసుకుంటూనే, తమ ప్రభుత్వంపై విమర్శలు చేసే ప్రతిపక్షాలపై విరుచుకుపడటం చేస్తారు. అలా ప్రతిపక్షాలపై విరుచుకుపడేవారిలో మంత్రి అనిల్ కూడా ఒకరు. అనిల్ రెండోసారి నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అసలు అనిల్ ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. anil kumar;anil music;tiru;jagan;కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి;government;minister;fort;war;cheque;tdp;reddy;dookudu;mantraనెల్లూరు వార్: ఇక మంత్రి అనిల్‌కు టఫ్ ఫైట్ తప్పదా!నెల్లూరు వార్: ఇక మంత్రి అనిల్‌కు టఫ్ ఫైట్ తప్పదా!anil kumar;anil music;tiru;jagan;కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి;government;minister;fort;war;cheque;tdp;reddy;dookudu;mantraFri, 08 Jan 2021 04:00:00 GMTజగన్ కేబినెట్‌లో ఫైర్‌బ్రాండ్ మంత్రులకు ఎలాంటి కొదవ లేదు. తమ శాఖలపై పట్టు తెచ్చుకుని, మంచిగా పనిచేసుకుంటూనే, తమ ప్రభుత్వంపై విమర్శలు చేసే ప్రతిపక్షాలపై విరుచుకుపడటం చేస్తారు. అలా ప్రతిపక్షాలపై విరుచుకుపడేవారిలో మంత్రి అనిల్ కూడా ఒకరు. అనిల్ రెండోసారి నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అసలు అనిల్ ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు.

నారాయణ టీడీపీ నుంచి బరిలో ఉండటంతో, ఇక అనిల్ పని అయిపోయిందని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా లాస్ట్ రౌండ్లలో ఆధిక్యంలోకి వచ్చేసి దాదాపు 2 వేల పైనే మెజారిటీతో గెలిచేశారు. ఇక ఆ తర్వాత జగన్ కేబినెట్‌లో బెర్త్ దక్కించుకుని దూసుకెళుతున్నారు. అటు నియోజకవర్గంలో కూడా మంచిగా పనులు చేస్తున్నారు. పైగా నారాయణ కూడా రాజకీయాలకు దూరంగా ఉండటంతో అనిల్‌కు తిరుగుండదని అనుకున్నారు.

కానీ సడన్‌గా టీడీపీ నుంచి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నెల్లూరు సిటీ బాధ్యతలు తీసుకున్నారు. ఇన్‌చార్జ్‌గా వచ్చిన దగ్గర నుంచి కోటంరెడ్డి దూకుడుగా పనిచేస్తున్నారు. నియోజకవర్గంలో టీడీపీని బలోపేతం చేస్తూనే, అక్కడి సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ వైఫల్యాలపై కూడా పోరాటం చేస్తున్నారు. టీడీపీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. నెల్లూరు టీడీపీ నుంచి గట్టిగా వాయిస్ వినబడుతుందంటే అది కోటంరెడ్డి వల్లే అని చెప్పొచ్చు.

మాజీ మంత్రి సోమిరెడ్డి లాంటి వారు సైతం ఇంత దూకుడుగా వెళ్ళడం లేదు. నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా అనిల్‌కు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కోటంరెడ్డి పనిచేస్తున్నారు. కానీ నెల్లూరు సిటీ వైసీపీకి కంచుకోట, అక్కడ అనిల్ ఇంకా బలంగా ఉన్నారు. ఇప్పుడు మంత్రిగా దూసుకెళుతున్నారు. అలాంటి ఆయనకు చెక్ పెట్టడం అంత సులువు కాదు. కానీ కోటంరెడ్డి తనకు సాధ్యమైన మేర పని చేసుకుని వెళుతున్నారు. అనిల్‌కు టఫ్ ఫైట్ ఇవ్వాలనే ఉద్దేశంతో దూసుకెళుతున్నారు. మరి చూడాలి నెక్స్ట్ ఎన్నికల్లో అనిల్‌కు టఫ్ ఫైట్ ఎదురవుతుందో లేదో.




సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?

తెరాస పార్టీ బీజేపీ ని కాకుండా బండి ని టార్గెట్ చేయడంలో మర్మం ఏంటి..?

ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్దరించండి

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?

ఎమ్మెల్యేలను పిలుస్తున్న జగన్... షాక్ ఇస్తారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>