HealthSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-strain-like-water-under-the-matb10a7807-0b4a-4385-8918-bca4083219e7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-strain-like-water-under-the-matb10a7807-0b4a-4385-8918-bca4083219e7-415x250-IndiaHerald.jpg స్ట్రైయిన్‌ ఇప్పుడు ఇది అందర్నీ తెగ టెన్షన్ పెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కొన్ని దేశాలు మళ్లీ లాక్‌డౌన్‌లు ప్రకటిస్తుండగా మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాలు రాత్రిళ్లు కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. ఇక ఇటు ఏపీ రాష్ట్రంలో కూడా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తం అయ్యింది.. దీని నియంత్రణ నిమిత్తం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం ఆదేశించింది. corona strein;view;amala akkineni;kranthi;kranti;makar sakranti;andhra pradesh;sankranthi;survey;arogyasri;coronavirusకరోనా స్ట్రెయిన్ ను నియంత్రించేందుకు మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వంకరోనా స్ట్రెయిన్ ను నియంత్రించేందుకు మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వంcorona strein;view;amala akkineni;kranthi;kranti;makar sakranti;andhra pradesh;sankranthi;survey;arogyasri;coronavirusFri, 08 Jan 2021 14:15:00 GMTదాదాపు గత పది నెలలుగా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలను ముప్పతిప్పలకు గురి చేసిన కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఇప్పటికీ ఉంది. దీని కారణంగా సాదారణ జేవితం గడపటానికి ఇప్పటికీ వీలు కావటం లేదు. ఇప్పుడిప్పుడే ఈ కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించేందుకు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈలోగా మరొక భయంకరమైన వార్త ప్రజలందరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అదే కరోనా కొత్తరకం దాన్ని  స్ట్రైయిన్‌ అని పిలుస్తున్నారు. ఇప్పుడు ఇది అందర్నీ తెగ టెన్షన్ పెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కొన్ని దేశాలు మళ్లీ లాక్‌డౌన్‌లు ప్రకటిస్తుండగా మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాలు రాత్రిళ్లు కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. ఇక ఇటు ఏపీ రాష్ట్రంలో కూడా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తం అయ్యింది.. దీని నియంత్రణ నిమిత్తం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం ఆదేశించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మాస్క్‌ ధరించేలా చూడాలని, కంటైన్‌మెంట్ వ్యూహాలను అనుసరించాలని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.


 


సంక్రాంతి దృష్ట్యా భారీ జనసమూహాలు గుమిగూడకుండా చూడాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న 1,519 నమూనా సేకరణ కేంద్రాలను వికేంద్రీకరించాలని.. కరోనా టోల్‌ ఫ్రీ నంబర్‌ 104ను కొనసాగించాలని.. కంటైన్‌మెంట్‌ జోన్లను నోటిఫై చేయడంతో పాటు ఫీవర్ క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, ఇంటింటి సర్వే చేపట్టాలని కోవిడ్‌తో చనిపోయిన వారి అంత్యక్రియలకు రూ.15వేలు ఆర్ధిక సాయం అందించాలని ఆదేశించింది. రాష్ట్రంలోని ప్రతి కోవిడ్ ఆస్పత్రికి నోడల్ అధికారిని నియమించాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫైర్ ఆడిట్ నిర్వహించాలని.. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స అందేలా చూడాలని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశించింది.


వైసీపీలో అవినాష్ రేంజ్ పెరిగిపోతోందా... మ‌రో కీల‌క ప‌ద‌వి...?

జీవ‌తా రాజ‌శేఖ‌ర్ ఎమ్మెల్యేగా పోటీ... ఆ సీటుపైనే గురి పెట్టారా..!

విచార‌ణ‌లో షాకింగ్ విష‌యాలు చెప్పిన అఖిల‌ప్రియ‌

తెలంగాణ‌ను క‌బ‌ళిస్తోన్న బ‌ర్డ్ ఫ్లూ... కోళ్ల బిజినెస్ కుదేలు.. ఏపీలోనూ ఇంత డేంజ‌రా..?

కేజీఎఫ్ 2 టీజ‌ర్ తుస్సుమందే... యూ ట్యూబ్‌లో పేల‌లేదు...!

బాల‌య్య ఇదేం గోల‌య్యా... వైసీపీకి ఎంత లాభం చేశావో చూడు...!

కేంద్రంతో కేటీఆర్ యుద్ధం.. దేనికి సంకేతం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>