PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-politics1783f9e4-c126-49e4-805c-64e01b133540-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-politics1783f9e4-c126-49e4-805c-64e01b133540-415x250-IndiaHerald.jpgపోలీస్ కమిషనర్ అంటే నాకు గౌరవం ఉంది. ఇప్పటికైనా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇటువంటి అన్యాయాలు జరగకుండా చూడండి... అంతేకానీ రాజకీయ నాయకులపై కామెంట్స్ చేయటం కాదు.. అంటూ మండిపడ్డారు. ముందు అక్రమంగా గోవులను తరలిస్తోన్న వారిపై చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించండి. telangana politics;raja;bharatiya janata party;pithe;smart phone;police;chief minister;mla;police station;cheque;murder.;cow slaughter;traffic police;local language;maha;party;choutuppal;redసీపీ సజ్జనార్ కు సవాల్ విసిరిన బిజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ...!సీపీ సజ్జనార్ కు సవాల్ విసిరిన బిజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ...!telangana politics;raja;bharatiya janata party;pithe;smart phone;police;chief minister;mla;police station;cheque;murder.;cow slaughter;traffic police;local language;maha;party;choutuppal;redFri, 08 Jan 2021 09:00:00 GMT" style="height: 238px;">
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్  గోమాతల  విషయంలో అన్యాయం జరుగుతుందంటూ అధికార పార్టీ పై మండిపడ్డ విషయం తెలిసిందే. ఉన్నట్టుండి ఉదయం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో.... గోమాత అక్రమ రవాణాకు సంబంధించి చౌటుప్పల్ చెక్ పోస్టు దగ్గర ఆవుల్ని తరలిస్తున్నారని ఫోన్ కాల్ రావడంతో హుటాహుటిన బయలుదేరి ఆ బండిని వెంబడించి మరీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు రాజా సింగ్. ఆవులను తరలిస్తున్న ట్రక్ ని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించి ఫిర్యాదు చేశారు.. ఆ వీడియో సోషల్ మీడియాలో ఎంత వైరల్ గా మారిందో అందరికీ తెలిసిందే. రాజకీయంగానూ అంతే చర్చకు దారితీసింది.

గో వధ నిషేధం.. ఉన్న వీటిని ఎలా తరలిస్తున్నారు... పోలీసులు, కమిషనర్ తమ బాధ్యత నిర్వహించకుండా ఏం చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఆవులను చంపితే మహా పాపం అన్నారు రాజా సింగ్. ఆ పాపం ముఖ్యమంత్రి కి కూడా తగులుతుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అదే ఈ విషయంపై తన అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్. సైబరాబాద్ సీపీ సజ్జనార్ కు  మరోసారి సవాల్ విసురుతూ ఆగ్రహం తో ఊగిపోయారు. గోవుల అక్రమ రవాణా విషయాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నట్లు అనిపించడం లేదని మండిపడ్డారు. ఐదు రోజుల్లోగా గోవుల అక్రమ తరలింపును అడ్డుకోకుంటే తానే నేరుగా రంగంలోకి దిగి ఆ అక్రమ రవాణా దారుల ఆట కట్టిస్తానని హెచ్చరించారు.

 బహుదూర్ పుర పోలీస్ స్టేషన్ ముందు నుంచి ఆవులను అక్రమంగా తరలిస్తున్న వీడియోలను బయట పెట్టిన రాజా సింగ్.... ఈ దారుణానికి అడ్డుకట్ట వేయాలని సూచిస్తూ.... ఈ మేరకు ఓ వీడియోని విడుదల చేశారు. పోలీస్ కమిషనర్ అంటే నాకు గౌరవం ఉంది. ఇప్పటికైనా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇటువంటి అన్యాయాలు జరగకుండా చూడండి... అంతేకానీ రాజకీయ నాయకులపై కామెంట్స్ చేయటం కాదు.. అంటూ మండిపడ్డారు. ముందు అక్రమంగా గోవులను తరలిస్తోన్న వారిపై చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించండి. అంటూ నేరుగా సీపీ సజ్జనార్ కే బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్ ఇవ్వడం తో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మరి రాజా సింగ్ చాలెంజ్ కు సజ్జనార్ ఎలా స్పందించనున్నారో చూడాలి...


అఖిలప్రియ రిమాండ్ రిపోర్టులో సంచలనాలు!

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా

సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?

తెరాస పార్టీ బీజేపీ ని కాకుండా బండి ని టార్గెట్ చేయడంలో మర్మం ఏంటి..?

ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్దరించండి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>