Businessyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/home-loans806c1e35-5ad7-4935-9d6f-7be649fac092-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/home-loans806c1e35-5ad7-4935-9d6f-7be649fac092-415x250-IndiaHerald.jpgసొంతిల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరూ కల కంటుంటారు. అయితే ఆ కల నెరవేర్చుకోవాలంటే బోలెడు ఖర్చవుతుంది. ఈ ఖర్చుకు బ్యాంకుల ద్వారా హోం లోన్స్ తీసుకన్నా.. ఆ వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతో అనేకమంది హోం లోన్ తీసుకునేందుకు ..home loans;amala akkineni;india;rbi;sbi;reserve bank of india;kanna lakshminarayana;bank;good news;customer;house;lie;good newwzగుడ్ న్యూస్.. హోం లోన్ వడ్డీ రేట్లపై ఎస్‌బీఐ భారీ తగ్గింపుగుడ్ న్యూస్.. హోం లోన్ వడ్డీ రేట్లపై ఎస్‌బీఐ భారీ తగ్గింపుhome loans;amala akkineni;india;rbi;sbi;reserve bank of india;kanna lakshminarayana;bank;good news;customer;house;lie;good newwzFri, 08 Jan 2021 21:25:38 GMTఇంటర్నెట్ డెస్క్: సొంతిల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరూ కల కంటుంటారు. అయితే ఆ కల నెరవేర్చుకోవాలంటే బోలెడు ఖర్చవుతుంది. ఈ ఖర్చుకు బ్యాంకుల ద్వారా హోం లోన్స్ తీసుకన్నా.. ఆ వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతో అనేకమంది హోం లోన్ తీసుకునేందుకు వెనుకాడుతూ ఉంటారు. అలాంటి వారికి దేశీయ అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. హోం లోన్స్‌పై వడ్డీ రేట్లను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా హోం లోన్స్ ప్రాసెసింగ్ ఫీజును కూడా భారీగా తగ్గించినట్లు వెల్లడించింది.

ఖాతాదారుల సొంతింటి కలను నిజం చేసుకునేందుకే కొత్త ఏడాది సరికొత్త ఆఫర్‌ను ప్రకటించినట్లు ఎస్‌బీఐ తెలిపింది. గృహ రుణాల వడ్డీరేటుపై 30 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) రాయితీ ఇవ్వనున్నట్లు తాజాగా ప్రకటించింది. దీనితో పాటు ప్రాసెసింగ్ ఫీజును కూడా పూర్తిగా రద్దు చేస్తున్నామని, వినియోగదారులకు ఇదో గొప్ప అవకాశమని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.

జూలై 1 నుంచే కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయి. గత నెలలో ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లింక్డ్ లెండింగ్ రేట్‌(ఈబీఆర్), రెపో లింక్డ్ లెండింగ్ రేట్-(ఆర్ఎల్ఎల్ఆర్)ను ఎస్‌బీఐ 40 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. ఎస్‌బీఐలో ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ ఈబీఆర్ 7.05 శాతం నుంచి 6.65 శాతానికి, ఆర్ఎల్ఎల్ఆర్ 6.65 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గాయి. దీంతో హోమ్ లోన్ వడ్డీ రేట్లు అత్యంత దిగువకు చేరాయి.

వినియోగదారుడి ఆర్థిక స్థాయి, లోన్ తీసుకోబోతున్న మొత్తం విలువపై వడ్డీ రేటు ఆధారపడి ఉంటుంది. దీని ప్రకారం.. శాలరీ ఎంప్లాయీస్‌కు 7 శాతం వడ్డీకి రూ.30 లక్షల వరకు లోన్ లభిస్తుంది. ఇక ఆ పైన లోన్ కావాలంటే మాత్రం ఆర్థిక స్థితిని బట్టి అప్రూవల్ లభిస్తుంది. అయితే వడ్డీ రేటు కూడా పెరుగుతుంది. రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు లోన్ తీసుకోవాలంటే 7.25 శాతం వడ్డీ చెల్లించాలి. రూ.75 లక్షలు దాటితే 7.35 శాతం వడ్డీ చెల్లించాలి. అయితే మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న మహిళా ఎంప్లాయీలకు 6.95 శాతం వడ్డీకే హోమ్ లోన్ లభిస్తంది.

ఇదిలా ఉంటే ఒకప్పుడు హోమ్ లోన్ తీసుకోవాలంటే 9 శాతం కంటే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉండేది. కానీ bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించడంతో వడ్డీ రేటు 7 శాతం కన్నా తక్కువకు దిగొచ్చింది. ఇది గృహ రుణాల కోసం ప్రయత్నించేవారికి ఎంతగానో ఉపయోగపడుతోంది. ప్రస్తుతం ఎస్‌బీఐ 6.95 శాతం వడ్డీకి గృహ రుణాలను అందిస్తోంది. ఎస్‌బీఐతో పాటు ఇతర బ్యాంకులు కూడా పోటాపోటీగా తక్కువ వడ్డీ రేట్లకు హోం లోన్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటివరకు అత్యంత తక్కువకు హోం లోన్స్ ఇచ్చే ఏకైక బ్యాంకుగా బ్యాంక్ ఆఫ్ బరోడా నిలుస్తోంది. ఈ బ్యాంక్ కేవలం 6.85 శాతం వడ్డీకే హోం లోన్స్ ఇస్తోంది. దీని తరువాత బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండో స్థానంలో ఉంది


విద్యార్ధులకు జగన్ గుడ్ న్యూస్

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా

దేవాలయాల మీద దాడులు వెనక కుట్ర కోణం...?

నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>