MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/talk-about-that-set-in-acharya-movie7cb00323-30e7-414e-9384-e1323b2570c0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/talk-about-that-set-in-acharya-movie7cb00323-30e7-414e-9384-e1323b2570c0-415x250-IndiaHerald.jpgఅప్పుడెప్పుడో ఒక్కడులో చార్మినార్‌ సెట్‌ గురించి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అర్జున్‌లో 'మధురై మధుర మీనాక్షి' టెంపుల్‌.. గత ఏడాది కొండారెడ్డి బురుజు సెట్‌ పాపురల్‌ అయ్యాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాట్లాడుకుంటోంది మాత్రం ఆచార్యలోని టెంపుల్‌ సెట్‌ గురించే. 20 కోట్లతో సెట్‌ వేశారు? సినిమాకే హైలైట్‌ అంటూ.. వస్తున్న వార్తలను చిరంజీవి లీక్‌ చేసి... సెట్‌లో ఓ చిన్న పార్ట్ చూపించేశాడు మెగాస్టార్‌. talk about that set in acharya movie;chiranjeevi;meenakshi;koratala siva;madhura sridhar reddy;tiru;cinema;temple;assembly;charminar;rama tirtha;petta;okkaduఆచార్యలో ఆ సెట్ గురించే టాక్..!ఆచార్యలో ఆ సెట్ గురించే టాక్..!talk about that set in acharya movie;chiranjeevi;meenakshi;koratala siva;madhura sridhar reddy;tiru;cinema;temple;assembly;charminar;rama tirtha;petta;okkaduThu, 07 Jan 2021 22:00:00 GMTచార్మినార్‌ సెట్‌ గురించి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అర్జున్‌లో 'మధురై మధుర మీనాక్షి' టెంపుల్‌.. గత ఏడాది కొండారెడ్డి బురుజు సెట్‌ పాపురల్‌ అయ్యాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాట్లాడుకుంటోంది మాత్రం ఆచార్యలోని టెంపుల్‌ సెట్‌ గురించే. 20 కోట్లతో సెట్‌ వేశారు? సినిమాకే హైలైట్‌ అంటూ.. వస్తున్న వార్తలను చిరంజీవి లీక్‌ చేసి... సెట్‌లో ఓ చిన్న పార్ట్ చూపించేశాడు మెగాస్టార్‌.

ఆచార్యలో టెంపుల్‌ టౌన్‌ సెట్ చూసి ముగ్దుడైన చిరంజీవి... అందరితో పంచుకోవాలనుకున్నాడు. తన కెమెరాలో బంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసి సెట్‌కు సంబంధించిన విశేషాలు తెలియజేశాడు. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్యలో చిరంజీవి ఎండోమెంట్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. తన గత చిత్రాల్లో మెసేజ్‌ ఇచ్చినట్టే.. ఈ సారి దేవాలయాల్లో జరిగే అవినీతిపై ఆచార్యను సంధించాడు కొరటాల.

కథంతా గుళ్లు చుట్టూ తిరగడంతో... ఏకంగా ఇండియాలోనే అతి పెద్ద టెంపర్‌ టౌన్‌ సెట్‌ను వేయించారు. ఆర్ట్ డైరెక్టర్‌ సురేష్‌ సెల్వరాజన్‌ 20 ఎకరాల్లో ఈ సెట్‌ వేశారు.  చిరంజీవి జస్ట్‌ ఎంట్రీ పార్ట్‌ను మాత్రమే చూపించి.. అసలైన గుడిని గోప్యంగా వుంచాడు.  ఈ టెంపుల్‌ టౌన్‌ కోసం .. 20 కోట్లు ఖర్చుపెట్టారని వార్తలొచ్చాయి. రామతీర్థ వివాదం తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలన్నీ దేవాలయాలు.. మతాలు చుట్టూ తిరుగుతున్నాయి. ఈ క్రమంలో గుడి సెట్‌ రివీల్‌ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఆచార్య ఆర్ట్‌ డైరెక్టర్‌ సురేష్‌ సెల్వరాజన్ తెలుగు ఇండస్ట్రీకి కొత్తేమీ కాదు. కొరటాల లాస్ట్‌ మూవీ భరత్‌ అనేనేనుకు వర్క్‌ చేశాడు. ఇందులో అసెంబ్లీ సెట్‌ సురేష్‌కు పేరు తీసుకొచ్చింది. అలాగే.. పేట సినిమాకు వర్క్‌ చేశాడు. మొత్తానికి ఆచార్యలో భాగంగా వేసిన టెంపుల్ టౌన్ సెట్ అదిరిపోయింది. చిన్నపార్ట్ ను వీడియోగా రిలీజ్ చేసిన చిరంజీవి ఉత్కంఠకు తెరదించాడు. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.








తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?

ఎమ్మెల్యేలను పిలుస్తున్న జగన్... షాక్ ఇస్తారా...?

వైసీపీతో స్నేహం చేసే నేతల మీద బిజెపి సీరియస్...?

షాకింగ్ న్యూస్.. తుమ్మితే ఎముకలు విరిగాయి..!

రేవంత్ అయితేనే బెస్ట్... అధిష్టానానికి లేఖ రాసారా...?

ఏపీ: కోనసీమలో కోడి పందాలకు సై..!?

చంద్రబాబుకి, కేసీఆర్ కి మమత ఆహ్వానం...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>