PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/yeluri-sambha-siva-rao3902500f-1ea2-434b-bbcd-11aa3dc8519c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/yeluri-sambha-siva-rao3902500f-1ea2-434b-bbcd-11aa3dc8519c-415x250-IndiaHerald.jpgఇప్ప‌టికే పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు నేరుగా డీల‌ర్ల‌తో మాట్లాడి ఎక్కువ డిస్కౌంట్‌పై ట్రాక్ట‌ర్లు పంపిణీ చేసిన ఏలూరి.. అత్యంత కీల‌కమైన ఎరువులు, పురుగు మందుల విష‌యంలో రైతన్న‌లు న‌ష్ట‌పోకుండా.. న‌కిలీ కంపెనీల బెడ‌ద‌తో క‌ష్టాలు కొనితెచ్చుకోకుండా.. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న ఎరువులు, పురుగు మందుల‌ను అత్యంత స్వ‌ల్ప ధ‌ర‌ల‌కే నేరుగా రైతుల ఇళ్ల‌కు చేర్చే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టి అద్భుత‌మైన ఫ‌లితాన్ని సాధించారు. రైతుల‌కు వెన్నుద‌న్నుగా ఉంటూ.. వారికి అన్ని స‌మ‌యాల్లోనూ నేనున్నానంటూ .. ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్న yeluri sambha siva rao;nithya new;mandula;district;mla;vegetable market;letter;butter;nijam;partyఅన్న‌దాత‌కు అండ‌గా ఎమ్మెల్యే ఏలూరి అద్భుత ప్ర‌య‌త్నం... ప్ర‌తి ఒక్క‌రు స‌లాం చేయాల్సిందే...!అన్న‌దాత‌కు అండ‌గా ఎమ్మెల్యే ఏలూరి అద్భుత ప్ర‌య‌త్నం... ప్ర‌తి ఒక్క‌రు స‌లాం చేయాల్సిందే...!yeluri sambha siva rao;nithya new;mandula;district;mla;vegetable market;letter;butter;nijam;partyThu, 07 Jan 2021 11:23:48 GMTజై జ‌వాన్‌! జై కిసాన్‌!! అన్న స్ఫూర్తిని అణువ‌ణువునా నింపుకొన్న ప్ర‌జా నేత ఏలూరి సాంబ‌శివ‌రావు. ప్ర‌కాశం జిల్లా ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు సాధించిన ఆయ‌న‌.. అనునిత్యం అన్న‌దాత అభ్యున్న‌తి కోసం.. శ్ర‌మిస్తున్న విష‌యం తెలిసిందే. ఎమ్మెల్యేగా ఉంటూ.. ప్ర‌భుత్వం ఏదో చేయాలి.. నిధులు తేవాలి.. అని కూర్చోకుండా.. త‌న‌దైన శైలిలో దూసుకుపోతు న్నారు. `ఎవ‌రో వ‌స్తారు.. ఏదో చేస్తారు..`` అని ఎదురు చూడ‌కుండా.. త‌న‌దైన మార్గంలో, త‌న‌దైన శైలిలో అన్నం పెడుతున్న రైత‌న్న‌కు ఏదైనా చేయాల‌నే సత్సంక‌ల్పంతో ముందుకు సాగుతున్నారు. స్వ‌త‌హాగా వ్య‌వ‌సాయ అధికారి అయిన ఏలూరి.. ప్ర‌జా ప్ర‌తినిధి అయ్యాక కూడా త‌న‌దైన శైలిని ఎక్క‌డా మ‌రిచిపోలేదు.

అనునిత్యం అన్న‌దాత‌ల అభ్యున్న‌తి కోసం ప‌రిత‌పిస్తున్నారు. ఇప్ప‌టికే పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు నేరుగా డీల‌ర్ల‌తో మాట్లాడి ఎక్కువ డిస్కౌంట్‌పై ట్రాక్ట‌ర్లు పంపిణీ చేసిన ఏలూరి.. అత్యంత కీల‌కమైన ఎరువులు, పురుగు మందుల విష‌యంలో రైతన్న‌లు న‌ష్ట‌పోకుండా.. న‌కిలీ కంపెనీల బెడ‌ద‌తో క‌ష్టాలు కొనితెచ్చుకోకుండా.. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న ఎరువులు, పురుగు మందుల‌ను అత్యంత స్వ‌ల్ప ధ‌ర‌ల‌కే నేరుగా రైతుల ఇళ్ల‌కు చేర్చే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టి అద్భుత‌మైన ఫ‌లితాన్ని సాధించారు. రైతుల‌కు వెన్నుద‌న్నుగా ఉంటూ.. వారికి అన్ని స‌మ‌యాల్లోనూ నేనున్నానంటూ .. ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. నిజంగా రాష్ట్రంలో ఏ నియోజ‌క‌వ‌ర్గంలోనూ లేని విధంగా ఇక్క‌డ‌ రైతుల‌కు ల‌భిస్తుండ‌డం న‌భూతో న‌భ‌విష్య‌తి అన్న‌ట్టుగా సాగుతోంది.

ఈ ప‌రంపర‌లోనే త‌న సేవాస్ఫూర్తిని మ‌రింత విస్త‌రింప జేశారు ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావు. కీల‌క‌మైన స్ప్రేయ‌ర్ల విష‌యంలో ఆయ‌న ముందు చూపుతో వ్య‌వ‌హ‌రించారు. పంట‌ల‌కు పురుగు మందులు జ‌ల్లేందుకు రైత‌న్న‌ల‌కు స్ర్పేయ‌ర్లు అత్యంత కీల‌కం. అయితే.. భారీ ఖ‌రీదుతో ఉండే వీటిని కొనుగోలు చేసేందుకు అన్న‌దాత‌లు అప్పులు చేయాల్సి వ‌స్తోంది. పైగా నాణ్య‌త‌పైనా అనేక సందేహాలు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో రైతుల‌కు.. అండ‌గా ఉండేలా.. అత్యంత స్వ‌ల్ప ఖ‌రీదుతో కూడిన నాణ్య‌మైన ప‌వ‌ర్ స్ప్రేయ‌ర్ల‌ను త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని రైతుల‌కు పంపిణీ చేయాల‌ని ఏలూరి నిర్ణ‌యించుకున్నారు.

ఈ క్ర‌మంలోనే ఎన్నారైల నుంచి సాయం అందిపుచ్చుకున్నారు. అన్న‌దాత‌కు చేసే సాయం..పుడ‌మి త‌ల్లి కి చేసే సాయం కింద‌కే వ‌స్తుంద‌న్న సూక్తిని నిజం చేస్తూ.. ఎన్నారైల సాయంతో నాణ్య‌మైన ప‌వ‌ర్ స్ప్రేయ‌ర్ల‌ను కొనుగోలు చేసి.. విడ‌త‌ల వారీగా.. రైతుల‌కు కుల,మ‌త‌, పార్టీ ర‌హితంగా అందించేందుకు న‌డుం బిగించారు ఎమ్మెల్యే ఏలూరి. త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని గ్రామాల్లోనూ రైతుల‌కు వీటిని అందించాల‌ని  సంకల్పించారు. ఈ క్ర‌మంలో గ్రామానికి 5 నుంచి 10 స్ప్రేయ‌ర్ల‌ను అందించేలా ప్ర‌ణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ స్ప్రేయ‌ర్ల‌ను పొందేందుకు రైతులు ఎవ‌రి సిఫార్సుల కోసం ఎదురు చూడాల్సిన అవ‌స‌రం లేకుండా.. నేరుగా త‌న కార్యాల‌యంలో సంప్ర‌దించే ఏర్పాటు చేశారు.

మార్కెట్ లో స్ప్రేయ‌ర్ల‌కు రూ. 11,000 నుంచి రూ. 12,000 వేలు డిమాండ్ ఉంది. వీటిని  రూ.5000 లకు అందించేందుకు ఎమ్మెల్యే ఏలూరి నిర్ణయం తీసుకున్నారు. పర్చూరు నియోజకవర్గంలో అర్హులైన రైతులందరికీ స్ప్రేయర్లు  అందించేలా రూపకల్పన చేశారు. ఆసక్తి గల రైతులు ఎమ్మెల్యే ఏలూరి క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక వ్యవసాయ విభాగంలో  పేరు నమోదు చేసుకోవ‌చ్చు. ఏదేమైనా రైతుల కోసం ఏలూరి చేస్తోన్న ఈ అద్భుత కార్య‌క్ర‌మానికి ప్ర‌తి ఒక్క‌రు  స‌లాం కొట్టాల్సిందే..!
 రైతులకు సూచనలు...
1. మొదటి విడతలో 250 మంది రైతులకు  స్ప్రేయర్లు అందిస్తారు.
2. దరఖాస్తు చేసుకున్న వారం రోజుల తరువాత రైతులకు స్ప్రేయర్లు అందుతాయి.
3. ఒక రైతుకు ఒకటి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది.
4. చిన్న, సన్నకారు రైతులకు తొలి ప్రాధాన్యం.
5. అన్ని గ్రామాలకు సమాన అవకాశం.
6. విడతల వారీగా సాధ్యమైనంత మంది రైతులకు స్ప్రేయర్లు అందించే ఏర్పాట్లు  
7. రైతులు ఎలాంటి ధ్రువ ప‌త్రాల‌ను తీసుకురావాల్సిన అవ‌స‌రం లేదు. 


కృత్రిమ కాళ్ల‌తో.. కొత్త జీవితాల‌ను ప్ర‌సాదించిన సేథీ...! నేడు వ‌ర్ధంతి

కొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!

ముఖ్యమంత్రికి షాకిచ్చిన హైకోర్టు.. కేసును కొనసాగించాలని లోకాయుక్తకు ఆదేశం

ఎమ్మెల్సీ ఉప పోరు రెడీ... వైసీపీలో ఆశావాహుల‌ లిస్ట్ పెద్ద‌దే...!

మోదీ హవా తగ్గుతోందా...బీజేపీ కి పాతరోజులు తప్పవా...!

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>