EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/chandrababu77be8949-1aad-4036-a3f2-7e972f4dd927-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/chandrababu77be8949-1aad-4036-a3f2-7e972f4dd927-415x250-IndiaHerald.jpgనిన్న మొన్నటి వరకూ ఏపీలో రాజకీయాలు కులం చుట్టూ తిరిగాయి. అమరావతిలో ఒక కులం వాళ్లే ఉన్నారని వైసీపీ రచ్చ చేసిందని టీడీపీ విమర్శించింది. ఆ తర్వాత ఏ కులాన్ని ఎవరు ఎన్ని పదవులు ఇచ్చారన్న లెక్కలపైనా చర్చ జరిగింది. జగన్ రెడ్డి తన సొంత కులానికే పదవులు ఇస్తున్నారని టీడీపీ నేతలు విమర్శించారు. కానీ.. ఇప్పుడు ఏపీలో రాజకీయం సీన్ మారిపోయింది. కులం నుంచి ఇప్పుడు సీన్ మాతానికి వచ్చేసింది. రామతీర్థం ఘటనలో ఈ మత రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. ఏపీలో బీజేపీకి ఎక్కడ లాభం జరుగుతుందో అన్న శంకతో చంద్రబాబు కూడా ఇటీవchandrababu;cbn;deva;bharatiya janata party;jagan;chief minister;job;minister;tdp;ycp;rama tirtha;reddy;raccha;mantraచంద్రబాబుకు ఏమైంది.. ఆ మతాన్ని అంతగా అవమానిస్తున్నారు..?చంద్రబాబుకు ఏమైంది.. ఆ మతాన్ని అంతగా అవమానిస్తున్నారు..?chandrababu;cbn;deva;bharatiya janata party;jagan;chief minister;job;minister;tdp;ycp;rama tirtha;reddy;raccha;mantraThu, 07 Jan 2021 00:00:00 GMTవైసీపీ రచ్చ చేసిందని టీడీపీ విమర్శించింది. ఆ తర్వాత ఏ కులాన్ని ఎవరు ఎన్ని పదవులు ఇచ్చారన్న లెక్కలపైనా చర్చ జరిగింది. జగన్ రెడ్డి తన సొంత కులానికే పదవులు ఇస్తున్నారని టీడీపీ నేతలు విమర్శించారు. కానీ.. ఇప్పుడు ఏపీలో రాజకీయం సీన్ మారిపోయింది. కులం నుంచి ఇప్పుడు సీన్ మాతానికి వచ్చేసింది.

రామతీర్థం ఘటనలో ఈ మత రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. ఏపీలో బీజేపీకి ఎక్కడ లాభం జరుగుతుందో అన్న శంకతో చంద్రబాబు కూడా ఇటీవల మతంపై హద్దులు మీరి మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఆయన సీఎం, మంత్రులు, అధికారులకు కూడా మతం ఆపాదిస్తూ విమర్శించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముఖ్యమంత్రి, హోం మంత్రి, డీజీపీ, చివరకు విజయనగరం ఎస్పీ అంతా క్రిస్టియన్లే అంటున్నారు చంద్రబాబు.

అంతే కాదు.. రామతీర్థం ఘటన దర్యాప్తు బాధ్యతను సీఐడీకి ఇచ్చారని.. దాని అధిపతి క్రైస్తవుడైన సునీల్‌కుమార్‌ అని చంద్రబాబు అంటున్నారు. అంతా క్రిస్టియన్లే ఉన్నారని.. అయినప్పుడు హిందూ దేవాలయాలు, దేవుళ్లపై దాడులు జరగకుండా జాగ్రత్తగా చూడాలని సలహాలు ఇస్తున్నారు. గతంలో చంద్రబాబు ఇలా ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ ఏపీలో బీజేపీ జోరు చూసి తాను కూడా మత రాజకీయాలకు దిగుతున్నారు.

మరి.. చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు క్రైస్తవాన్ని కించపరచడం కాదా.. ఈ రకంగా క్రైస్తవ మతాన్ని, ఆ మతానికి చెందిన అధికారులను అగౌరవపర్చవచ్చా? అధికారులు మతం ప్రకారం ఉద్యోగంలోకి వచ్చారా? మతాల ప్రకారం బాధ్యతలు నిర్వహిస్తారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ చూసుకుంటే.. ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు క్రైస్తవ సభలకు కూడా  వెళ్లారు.. ఏసు అంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప దేవుడు అని చెప్పిన రోజులూ ఉన్నాయి. మరి అలాంటి చంద్రబాబు ఇలా క్రిస్టియన్లను కించపరచడం విడ్డూరంగా కనిపిస్తోంది. 


బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు

బండి సంజయ్ ది కార్పొరేటర్ స్థాయి!

డబ్బుల కోసం బ్యాంకుకు వచ్చిన డెడ్ బాడీ.. వణికిపోయిన ఉద్యోగులు..

రాయలసీమ గూండాలను ఊరుకునేది లేదు: తెలంగాణా మంత్రి సంచలన వ్యాఖ్యలు

మరో వివాదంలో సిఎం జగన్...! నిజమేనా...?

మీ శక్తి ప్రజలందరికీ తెలుసు... జగన్ మీద పవన్ ఆసక్తికర కామెంట్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>