PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/police-arrests-five-journalists-on-singarayakonda-temple-issue30482f27-6220-47d8-b143-fca705059763-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/police-arrests-five-journalists-on-singarayakonda-temple-issue30482f27-6220-47d8-b143-fca705059763-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న ఆలయాల ఘటనలో తప్పెవరిది అనే విషయంపై పోలీసుల పరిశోధన జరుగుతూనే ఉంది. అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు పోలీసు అధికారులు. అయితే అంతలోనే.. రోజుకోచోట విగ్రహాలు ధ్వంసమయ్యాయంటూ వార్తలొస్తున్నాయి. ఉద్దేశ పూర్వకంగా ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారా? లేక నిజంగానే అక్కడ అలాంటి ఘటనలు జరిగాయా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. singarayakonda;district;police;media;driver;lakshmi devi;arrest;prakasam district;prakasm;nijamతప్పంతా జర్నలిస్ట్ లదే..తప్పంతా జర్నలిస్ట్ లదే..singarayakonda;district;police;media;driver;lakshmi devi;arrest;prakasam district;prakasm;nijamThu, 07 Jan 2021 09:00:00 GMT
ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా సింగరాయకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ముఖద్వారంపై ఉన్న స్వామి, అమ్మవారి బొమ్మలు ధ్వంసం చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది. మొదట సోషల్ మీడియాలో ప్రసారం అయిన ఈ వార్తను తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియా అంది పుచ్చుకుంది. అపచారం జరిగిపోయిందంటూ వార్తలిచ్చింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అవన్నీ తప్పుడు వార్తలని నిర్థారించడంతోపాటు.. వాటిల్ని ప్రసారం చేసిన ఐదుగురు మీడియా ప్రతినిధుల్ని అరెస్ట్ చేశారు.

20 ఏళ్ల క్రితం సింగరాయకొండ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ముఖద్వారం వద్ద నిర్మించిన ఆర్చిపై లక్ష్మీనరసింహస్వామి, అమ్మవారి బొమ్మలను సిమెంట్‌ తో ఏర్పాటు చేశారు. అవి పాతబడటంతో అప్పుడప్పుడు పెచ్చులూడిపోతుండేవి. ప్రతి ఏటా వీటికి మరమ్మతులు చేసి రంగులు వేసేవారు. రెండేళ్లుగా అక్కడ మరమ్మతులు చేయకపోవడంతో.. అమ్మవారి బొమ్మలో చేయి భాగం కొంత విరిగి కిందపడింది. స్వామి వారి బొమ్మకు పెచ్చులూడాయి. ఇదంతా సహజంగా జరిగింది కానీ ఎవరూ ఉద్దేశ పూరితంగా చేసింది కాదు. ఈ విషయం తెలిసి కూడా కొంతమంది మీడియా ప్రతినిధులు తప్పుడు వార్తలతో ప్రజల్లో అలజడి సృష్టించాలని చూశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఓ లారీ డ్రైవర్ సహా ఈ కేసులో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఇకపై ఇలా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సున్నిత భావోద్వేగ పరిస్థితుల్లో మీడియా మరింత సంయమనంతో ఉండాలని, నిజా నిజాలు తెలుసుకుని ప్రచురించాలని సూచించారు.


ఆయనకు జగన్ ఎమ్మెల్సీ ఇస్తారా...?

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?

ఐ లవ్ యూ అంటూ ఆ ఫొటోను పోస్ట్ చేసిన రష్మిక

కొడాలి నాని నీకే చెబుతున్నా.. సహనాన్ని పరీక్షించొద్దు: నందమూరి బాలకృష్ణ

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>