PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kodalinaniaa5b6816-3990-4f41-b8bd-cdd0f8af9477-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kodalinaniaa5b6816-3990-4f41-b8bd-cdd0f8af9477-415x250-IndiaHerald.jpg ఏపీలో పేకాట క్లబ్‌లపై దాడులు జరిగిన నాటి నుంచి రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. పేకాటపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలకు నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంత్రిగా ఉన్న kodalinani;nani;balakrishna;kodali nani;manu;amarnath cave temple;krishna river;nandamuri balakrishna;police;pond;village;mla;pistachio;minister;tdp;central government;nandamuri taraka rama rao;nandivadaకొడాలి నాని నీకే చెబుతున్నా.. సహనాన్ని పరీక్షించొద్దు: నందమూరి బాలకృష్ణకొడాలి నాని నీకే చెబుతున్నా.. సహనాన్ని పరీక్షించొద్దు: నందమూరి బాలకృష్ణkodalinani;nani;balakrishna;kodali nani;manu;amarnath cave temple;krishna river;nandamuri balakrishna;police;pond;village;mla;pistachio;minister;tdp;central government;nandamuri taraka rama rao;nandivadaThu, 07 Jan 2021 00:46:40 GMTమంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలకు నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంత్రిగా ఉన్న కొడాలి నాని ఇలా ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకోవడం సరికాదంటూ చెప్పుకొచ్చారు. కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోవాలి హెచ్చరించారు. అంతేకాకుండా ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘‘రెచ్చగొట్టకండి. రెచ్చగొడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. న్యాయం, చట్టం అంటే లెక్కలేనితనం.

ఎవడికైనా చెబుతున్నా.. మా సహనాన్ని పరీక్షించొద్దు. ఉత్తుత్తినే నోరు పారేసుకోవద్దు. మేము మాటల మనుషులంకాదు. అవసరమైతే చేతలను కూడా చూపిస్తాం. జాగ్రత్త.. తస్మాత్!’’ అని మంత్రి కొడాలి నానికి బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఈ వార్త మరింత హాట్ టాపిక్‌గా మారిపోయింది. కాగా.. గుడివాడలోని తమిరశ గ్రామంలో గత ఆదివారం రాత్రి ఎస్‌ఈబీ దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో 30 మంది పేకాట రాయుళ్లను ఎస్‌ఈబీ పట్టుకుంది. ఎస్‌ఈబీ దాడుల్లో 28 కార్లు, కోట్ల కొద్దీ నగదు లభ్యమైంది. దీంతో ఈ వార్త కాస్తా రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది. అందులోనూ ఈ నియోజకవర్గానికి మంత్రి కొడాలి నాని ప్రాతినిథ్యం వహిస్తుండటంతో మరింత హాట్ టాపిక్‌గా మారింది. కొడాలి నాని అనుచరులే ఈ పేకాట క్లబ్‌లను నడిపిస్తున్నారనేది కూడా టాక్ నడుస్తోంది. అక్కడ పేకాడితే పోలీసులు ఏం చేయరన్న ధీమా ఏర్పడడంతోనే రాష్ట్రం నలుమూలల నుంచీ పేకాటరాయుళ్లు ఈ తమిరశ ప్రాంతానికి తరలివస్తుంటారని వార్తలు వెలువడుతున్నాయి.

ముఖ్యంగా కృష్ణా, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలకు చెందిన వ్యాపారులు, ధనవంతులు పేకాట ఆడేందుకు ఈ ప్రాంతానికి వస్తారని, వీరికి మంత్రికి చెందిన కన్వెన్షన్‌లోనే బస ఏర్పాటు చేస్తారని ఓ పత్రిక రాసుకొచ్చింది. అంతేకాకుండా ఇలా బస ఏర్పాటు చేయడమే కాకుండా వారిని హోటల్ నుంచి పేకాట శిబిరాలకు సొంత వాహనాల్లో తరలిస్తారని చెప్పింది. గుడివాడ రూరల్‌, నందివాడ మండలాల్లోని చేపల చెరువుల కేంద్రంగా ఈ పేకాట శిబిరాలు నడుస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పేకాట శిబిరాలను ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటారని, ఒక రోజు ఒక చోట ఏర్పాటుచేసే శిబిరం మరుసటి రోజు అక్కడ ఉండదని దాన్ని వెంటనే వేరే చోటకు మార్చుతారని అంటున్నారు.


 

 




బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు

బండి సంజయ్ ది కార్పొరేటర్ స్థాయి!

డబ్బుల కోసం బ్యాంకుకు వచ్చిన డెడ్ బాడీ.. వణికిపోయిన ఉద్యోగులు..

రాయలసీమ గూండాలను ఊరుకునేది లేదు: తెలంగాణా మంత్రి సంచలన వ్యాఖ్యలు

మరో వివాదంలో సిఎం జగన్...! నిజమేనా...?

మీ శక్తి ప్రజలందరికీ తెలుసు... జగన్ మీద పవన్ ఆసక్తికర కామెంట్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>