Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/bcci079a5176-2f39-4faa-8bd8-0c3336a59926-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/bcci079a5176-2f39-4faa-8bd8-0c3336a59926-415x250-IndiaHerald.jpgభారత క్రికెట్ మండలి.. బీసీసీఐ ప్రపంచ క్రికెట్ బోర్డుల్లోనే అత్యంత ధనికమైన, శక్తిమంతమైన క్రికెట్ బోర్డు అనే విషయం అందరికీ తెలుసు. కానీ ఆ ఆదాయం ఎంతో ఎవరికైనా తెలుసా..? తాజాగా బీసీసీఐ గత ఆర్థిక సంవత్సర ఆదాయ వివరాలను ప్రకటించింది. ఈ వివరాలు విన్న ప్రతి ఒక్కరూ నోరెళ్లబెడుతున్నారు. గత ఆర్థిక సంవత్సరానికి..bcci;cricket;2019;bcci;2020;internationalప్రపంచ క్రికెట్‌లో బీసీసీఐ నెంబర్ వన్.. ఇంత ఆదాయం ఎలా సాధ్యం..?ప్రపంచ క్రికెట్‌లో బీసీసీఐ నెంబర్ వన్.. ఇంత ఆదాయం ఎలా సాధ్యం..?bcci;cricket;2019;bcci;2020;internationalThu, 07 Jan 2021 10:09:00 GMTఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ మండలి.. బీసీసీఐ ప్రపంచ క్రికెట్ బోర్డుల్లోనే అత్యంత ధనికమైన, శక్తిమంతమైన క్రికెట్ బోర్డు అనే విషయం అందరికీ తెలుసు. కానీ ఆ ఆదాయం ఎంతో ఎవరికైనా తెలుసా..? తాజాగా బీసీసీఐ గత ఆర్థిక సంవత్సర ఆదాయ వివరాలను ప్రకటించింది. ఈ వివరాలు విన్న ప్రతి ఒక్కరూ నోరెళ్లబెడుతున్నారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బీసీసీఐ తన ఆదాయ, వ్యయ వివరాలను తాజాగా విడుదల చేసింది. ఆ నివేదికను పరిశీలిస్తే 2018-19కి గానూ బోర్డు నికర విలువ రూ.14,489.80 కోట్లుగా తేలింది. దీంతో ప్రపంచ క్రికెట్ బోర్డులలో తనకు ఎవరూ సాటి లేరని మళ్లీ నిరూపించుకుంది. కను సైగతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ని శాసించే స్ధాయికి చేరడానికి తన ఆదాయమే కారణమని మరోసారి తేటతెల్లం చేసింది.

బీసీసీఐ ప్రస్తుతం మూడు టోర్నీలు, నాలుగు ఈవెంట్లతో వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. చిన్న క్రికెట్ బోర్డులకు బీసీసీఐ రూ. వందల కోట్లలో సాయం చేస్తూ ప్రపంచ క్రికెట్‌ను తన గుప్పిట్లో పెట్టుకుంది. 2014-15లో సరిగ్గా ఐదేళ్ల క్రితం బీసీసీఐ నికర ఆస్తుల విలువ కేవలం 5438.61 కోట్లు మాత్రమే. అప్పటితో పోలిస్తే బీసీసీఐ ఆదాయం భారీగా పెరిగింది. ప్రధానంగా ఐపీఎల్ లాంటి బిగ్ టోర్నీలతో పాటు దేశవాళీ ఈవెంట్స్‌తో బీసీసీఐకి భారీగా సంపాదిస్తోంది. 2018లో బీసీసీఐ ఆదాయం రూ. 4017.11 కోట్లు రాగా.. దానిలో ఐపీఎల్ వాటా రూ. 2407.46 కోట్లు. ఇక దేశవాళీ క్రికెట్ టోర్నీలు ద్వారా రూ.446 కోట్ల ఆదాయం సమకూరింది.
 
ఇదిలా ఉంటే 2019-2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వివరాలను మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు. అయితే 2020లో ప్రపంచ క్రికెట్ మొత్తం స్తంభించిపోవడంతో ఎక్కడా ఎలాంటి టోర్నీలు జరగలేదు. బీసీసీఐ కూడా ఏ దేశంతోనూ సిరీస్‌లు నిర్వహించలేకపోయింది. కానీ ఏడాది చివర్లో ఐపీఎల్‌తో మళ్లీ పుంజుకుంది. మరి ఈ ఆదాయ వివరాలను ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి.


‘ఆదిపురుష్’ అతడే.. లేకపోతే సినిమానే వద్దు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

ఎమ్మెల్సీ ఉప పోరు రెడీ... వైసీపీలో ఆశావాహుల‌ లిస్ట్ పెద్ద‌దే...!

మోదీ హవా తగ్గుతోందా...బీజేపీ కి పాతరోజులు తప్పవా...!

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?

ఐ లవ్ యూ అంటూ ఆ ఫొటోను పోస్ట్ చేసిన రష్మిక

కొడాలి నాని నీకే చెబుతున్నా.. సహనాన్ని పరీక్షించొద్దు: నందమూరి బాలకృష్ణ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>