PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kodali-nani62e35eb3-dd48-4270-a45d-7cce7dde5814-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kodali-nani62e35eb3-dd48-4270-a45d-7cce7dde5814-415x250-IndiaHerald.jpg వైసీపీ వ‌ర్గాలు సైతం అవున‌నే అంటున్నాయి. ఇప్పుడు నానిని టార్గెట్ చేసే క్ర‌మంలోనే ఈ దాడులు జ‌రిగాయా ? అందుకే నాని దాడులు జ‌రిగిన మ‌రుస‌టి రోజు వెంట‌నే హుటాహుటీన వెళ్లి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను క‌లిశారు. అయితే ఈ క్ల‌బ్‌ల‌పై దాగి చేసిన వారంతా ప‌క్క జిల్లాల పోలీసులే అట‌. స్థానిక పోలీసులు ఈ దాడులు చేస్తే ముందుగానే పేకాట రాయుళ్ల‌కు స‌మాచారం ఇచ్చేసేవారు. పైగా స్పెష‌ల్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులే కాకుండా.. రెగ్యుల‌ర్ పోలీసుల‌ను సైతం ప‌క్క జిల్లాల నుంచి భారీగా ర‌ప్పించి.. మ‌రీ ఈ స్థావ‌రాల‌పై దాడులు చేశాkodali nani;nani;kodali nani;devineni avinash;police;minister;letter;tdp;local language;ycp;partyకొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!కొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!kodali nani;nani;kodali nani;devineni avinash;police;minister;letter;tdp;local language;ycp;partyThu, 07 Jan 2021 10:20:00 GMTమంత్రి కొడాలి నాని అడ్డా అయిన గుడివాడలో పేకాటస్ధావరంపై దాడులు చేయటం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ దాడులు జ‌రిగిన వెంట‌నే టీడీపీ అనుకూల మీడియాలో బూతు మంత్రి ఇలాకాలో పేకాట స్థావ‌రాల‌పై దాడులు. బూతు మంత్రికి జ‌గ‌న్ మార్క్ షాక్ అంటూ ర‌క‌ర‌కాల క‌థ‌నాలు ప్ర‌సారం అయ్యాయి. ఈ పేకాట క్ల‌బ్‌ల నిర్వాహ‌కుడు అయిన ముర‌ళీ మంత్రి కొడాలి నానికి అత్యంత స‌న్నిహితుడు కావ‌డంతో మంత్రిని వెంటనే బర్తరఫ్ చేసేయాలంటు మాజీమంత్రి దేవినేని డిమాండ్ మొదలుపెట్టేశారు. నిజానికి ఇటువంటి పేకాట క్లబ్బులు టీడీపీ పాల‌న‌లో కొకొల్లులుగా పెట్టారు. అయితే ఇప్పుడు జ‌రిగిన దాడిని మాత్రం భూత‌ద్దంలో పెట్టి చూపిస్తున్నారు.

అయితే మంత్రిగా ఉన్న నానికి తెలియ‌కుండానే ఈ దాడి జ‌రిగిందా ? అంటే వైసీపీ వ‌ర్గాలు సైతం అవున‌నే అంటున్నాయి. ఇప్పుడు నానిని టార్గెట్ చేసే క్ర‌మంలోనే ఈ దాడులు జ‌రిగాయా ? అందుకే నాని దాడులు జ‌రిగిన మ‌రుస‌టి రోజు వెంట‌నే హుటాహుటీన వెళ్లి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను క‌లిశారు. అయితే ఈ క్ల‌బ్‌ల‌పై దాగి చేసిన వారంతా ప‌క్క జిల్లాల పోలీసులే అట‌. స్థానిక పోలీసులు ఈ దాడులు చేస్తే ముందుగానే పేకాట రాయుళ్ల‌కు స‌మాచారం ఇచ్చేసేవారు.  

పైగా స్పెష‌ల్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులే కాకుండా.. రెగ్యుల‌ర్ పోలీసుల‌ను సైతం ప‌క్క జిల్లాల నుంచి భారీగా ర‌ప్పించి.. మ‌రీ ఈ స్థావ‌రాల‌పై దాడులు చేశారు. స్థానిక పోలీసుల‌తో దాడి చేయిస్తే ముందుగానే స‌మాచారం ఇస్తే నిర్వాహ‌కులు ముందే ఎస్కేప్ అవుతార‌న్న సందేహంతో ప‌క్క జిల్లాల నుంచి పోలీసుల‌ను ర‌ప్పించారు. అంటే ఉన్న‌తాధికారుల నుంచే ఎలా ?  దాడి చేయాల‌న్న అంశంపై ప‌క్కా ప్లాన్‌తో ఈ దాడి జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.

మంత్రికి తెలియ‌కుండానే చాలా ప‌గ‌డ్బందీగా ఈ దాడులు చేయించిన‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా నానికి తెలియ‌కుండా నాని ఇలాకాలో ఇంత బారీ ఎత్తున పేకాట స్థావ‌రాల‌పై దాడులు జ‌ర‌గ‌డం.. అందులోనూ అధికార పార్టీ నేత‌లు, మంత్రి స‌న్నిహితులే దొర‌క‌డం అధికార పార్టీతో పాటు అధికార వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 


ముఖ్యమంత్రికి షాకిచ్చిన హైకోర్టు.. కేసును కొనసాగించాలని లోకాయుక్తకు ఆదేశం

ఎమ్మెల్సీ ఉప పోరు రెడీ... వైసీపీలో ఆశావాహుల‌ లిస్ట్ పెద్ద‌దే...!

మోదీ హవా తగ్గుతోందా...బీజేపీ కి పాతరోజులు తప్పవా...!

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?

ఐ లవ్ యూ అంటూ ఆ ఫొటోను పోస్ట్ చేసిన రష్మిక

కొడాలి నాని నీకే చెబుతున్నా.. సహనాన్ని పరీక్షించొద్దు: నందమూరి బాలకృష్ణ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>