MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-ravi-tejaf8551fb9-964e-4c9e-bb7d-4427ea9f9bbd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-ravi-tejaf8551fb9-964e-4c9e-bb7d-4427ea9f9bbd-415x250-IndiaHerald.jpgసినీ రంగంలో ఇప్పటికే వారసత్వ నటులు చాలా మందినే ఉన్నారు. తండ్రి పేరు చెప్పుకునే, మరే బ్యాక్ గ్రౌండ్ తోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వాళ్ళ నటనతో అందరిని అలరిస్తున్నారు. అయితే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన వారు కూడా చాలామందినే ఉన్నారు. hero ravi teja;ravi;anil ravipudi;chalam;ravi anchor;ravi teja;teja;cinema;cheque;hero;father;mass;chitramఇక పై నా కొడుకు ఆ పని చేయడు: రవి తేజఇక పై నా కొడుకు ఆ పని చేయడు: రవి తేజhero ravi teja;ravi;anil ravipudi;chalam;ravi anchor;ravi teja;teja;cinema;cheque;hero;father;mass;chitramThu, 07 Jan 2021 13:03:24 GMTతండ్రి పేరు చెప్పుకునే, మరే బ్యాక్ గ్రౌండ్ తోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వాళ్ళ నటనతో అందరిని అలరిస్తున్నారు.  అయితే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన వారు కూడా చాలామందినే ఉన్నారు.  కానీ వారిలో కొంతమంది మాత్రమే ఇండస్ట్రీలో నిల దొక్కుకున్నారు. అలాంటి వారిలో మాస్‌రాజా ర‌వితేజ ఒక‌రు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంచలంచలుగా పైకి ఎదుగుతూ వచ్చాడు. మొదట్లో విలన్ పాత్రలు,హీరో ఫ్రెండ్స్ పాత్రలు వేసుకుంటూ వచ్చాడు. తరువాత సినిమాల్లో సోలో హీరోగా నటిస్తూ మాస్ మహారాజ అనీ అభిమానుల దగ్గర బిరుదు కూడా సంపాదించుకున్నాడు రవితేజ. అయితే ఇప్పుడు అందరిలోనూ ఒక ప్రశ్న మదిలో మెదులుతుంది.

రవితేజ తనయుడు ఎప్పుడు ఇండస్ట్రీలోకి అడుగుపెడతాడా?  అని.రవితేజ కూడా కూడా అంద‌రిలాగానే త‌న న‌ట వార‌సుడిని సినిమాల్లో నటింప చేస్తాడా.. లేదా..అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇదే విష‌యాన్ని ర‌వితేజ‌ను అడిగితే.. ఇప్ప‌ట్లో త‌న కుమారుడు మ‌హాధ‌న్ ఎంట్రీ ఉండ‌ద‌ని క్లారిటీ ఇచ్చేసాడు రవితేజ . ఎందుకంటే మహాధన్  ప్ర‌స్తుతం తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడ‌ని, చ‌దువు త‌ప్ప మ‌రో ధ్యాస లేద‌ని ర‌వితేజ చెప్పేశాడు.కానీ రవితేజ నటించిన  రాజాదిగ్రేట్ చిత్రంలో ర‌వితేజ చిన్న‌ప్ప‌టి పాత్ర‌లో మ‌హాధ‌న్ న‌టించాడు కదా అనే ప్రశ్నకు సమాధానంగా... అప్పుడు డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి బ‌ల‌వంతం మీద న‌టింప చేయాల్సి వ‌చ్చింది అని చెప్పారు.

అంతే కానీ.. మ‌హాధ‌న్ సినిమాల కోసం ఉన్న చ‌దువు వ‌దిలేయ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని ర‌వ‌తేజ తేల్చి చెప్పేశాడు.రవితేజ మాటలను ఇచ్చిన క్లారిటీని బట్టి ఇప్పట్లో  ర‌వితేజ త‌న‌యుడు మ‌హాధ‌న్ సినీ రంగ ప్ర‌వేశం గురించి  వ‌స్తున్న వార్త‌ల‌కు ర‌వితేజ చెక్ పెట్టేసాడు.ప్రస్తుతం మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా న‌టిస్తోన్న చిత్రం ‘క్రాక్‌’. ఈ సినిమా జ‌న‌వ‌రి 9న విడుద‌ల‌వుతుంది. రవితేజాకు జోడిగా శ్రుతి హాస‌న్ నటిస్తుంది.. !మరి ఈ సినిమా అయిన రవితేజ కెరీర్ కు ప్లస్ అవుతుందేమో చూడాలి..


లోకేష్‌ను లైట్ తీస్కొన్న బాల‌య్య‌.. చివ‌ర‌కు ఇంత చుల‌క‌నా...?

కొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!

ముఖ్యమంత్రికి షాకిచ్చిన హైకోర్టు.. కేసును కొనసాగించాలని లోకాయుక్తకు ఆదేశం

ఎమ్మెల్సీ ఉప పోరు రెడీ... వైసీపీలో ఆశావాహుల‌ లిస్ట్ పెద్ద‌దే...!

మోదీ హవా తగ్గుతోందా...బీజేపీ కి పాతరోజులు తప్పవా...!

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>