MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja2ab5faa4-a7fb-49cf-82dd-4999704605a8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja2ab5faa4-a7fb-49cf-82dd-4999704605a8-415x250-IndiaHerald.jpgప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ సినిమా క్రాక్. సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్ పై బి. మధు ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా మరొక రెండు రోజుల్లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ తో పాటు ఇందులోని సాంగ్స్ కూడా ప్రేక్షకాభిమానులని ఎంతో అలరించాయి. ముఖ్యంగా సాంగ్స్ మాత్రమే కాకుండా సినిమాకి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూkrack;raviteja;ravi;gopichand;shruti haasan;kranthi;kranti;raja;ravi teja;thaman s;makar sakranti;tollywood;cinema;sankranthi;media;event;blockbuster hit;success;romantic;naveen nuli;solo bathuke so better;mass;krackవార్నీ ..... మరీ ఇంత పాజిటివా ..... ఇది అస్సలు ఊహించలేదు .....??వార్నీ ..... మరీ ఇంత పాజిటివా ..... ఇది అస్సలు ఊహించలేదు .....??krack;raviteja;ravi;gopichand;shruti haasan;kranthi;kranti;raja;ravi teja;thaman s;makar sakranti;tollywood;cinema;sankranthi;media;event;blockbuster hit;success;romantic;naveen nuli;solo bathuke so better;mass;krackThu, 07 Jan 2021 20:19:16 GMTమాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ సినిమా క్రాక్. సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్ పై బి. మధు ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా మరొక రెండు రోజుల్లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ తో పాటు ఇందులోని సాంగ్స్ కూడా ప్రేక్షకాభిమానులని ఎంతో అలరించాయి. ముఖ్యంగా సాంగ్స్ మాత్రమే కాకుండా సినిమాకి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోతుందని మూవీ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది.

శృతిహాసన్ రవితేజకు జోడీగా నటిస్తున్న ఈ సినిమాకి ప్రముఖ ఛాయాగ్రాహకుడు జి కె విష్ణు ఫోటోగ్రఫీ అందించగా నవీన్ నూలి ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఇటీవల కెరీర్పర్ పరంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న మాస్ రాజా రవితేజ తప్పకుండా ఈ మూవీ ద్వారా బ్లాక్బస్టర్ సక్సెస్ కొడతారని ఆయన అభిమానులు అభిలషిస్తూ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్ చేస్తున్నారు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో ఎంతో వైభవంగా జరిగింది. ఆ సందర్భంగా మూవీ యూనిట్ సభ్యులు మాట్లాడుతూ అనుకున్న దాని కంటే కూడా పది రెట్లు సినిమా ఎంతో అద్భుతంగా వచ్చిందని ముఖ్యంగా సినిమాలోని మాస్ కమర్షియల్ అంశాలతో పాటు  అలరించే యాక్షన్ సీన్స్, సాంగ్స్, ఫైట్స్, రొమాంటిక్, ఎమోషనల్ సన్నివేశాలు, వండర్ఫుల్ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి అందరినీ ఎంతో ఆకట్టుకోవడం ఖాయమని ట్రైలర్ లో డైలాగ్ మాదిరిగా తమ సినిమా మూవీ షూర్ షాట్ బ్లాక్ బస్టర్ ఖాయమని అందరూ అభిప్రాయపడటం జరిగింది.

మరో వైపు రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ఈ సినిమాపై ఎంతో కాన్ఫిడెంట్ గా ఉండటంతో ఒక్కసారిగా సినిమాపై మరింత పాజిటివ్ బజ్ పెరిగింది. లాక్‌డౌన్‌ తర్వాత వచ్చిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా కూడా మంచి టాక్ తో కొనసాగుతుండటంతో ఈ క్రాక్ మూవీ కూడా అదేవిధంగా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం ఖాయంగా కనపడుతోందనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. మొత్తంగా చూసుకున్నట్లయితే క్రాప్ మూవీ పై అందరిలోనూ సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఉంది. మరి రిలీజ్ తర్వాత ఈ మూవీ ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో తెలియాలి అంటే మరొక రెండు రోజుల వరకు వెయిట్ చేయక తప్పదు.......!!


టీమిండియా యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ కంటతడి

ఎమ్మెల్యేలను పిలుస్తున్న జగన్... షాక్ ఇస్తారా...?

వైసీపీతో స్నేహం చేసే నేతల మీద బిజెపి సీరియస్...?

షాకింగ్ న్యూస్.. తుమ్మితే ఎముకలు విరిగాయి..!

రేవంత్ అయితేనే బెస్ట్... అధిష్టానానికి లేఖ రాసారా...?

ఏపీ: కోనసీమలో కోడి పందాలకు సై..!?

చంద్రబాబుకి, కేసీఆర్ కి మమత ఆహ్వానం...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>