Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/date-fix-for-clapping-for-adipurushc09e5001-bfe7-4c9e-a126-f8cc99d3cab7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/date-fix-for-clapping-for-adipurushc09e5001-bfe7-4c9e-a126-f8cc99d3cab7-415x250-IndiaHerald.jpgబాహుబలి తర్వాత డార్లింగ్ ప్రభాస్ రేంజే మారిపోయింది. ఈ స్టార్ కు భారీ ఆఫర్లు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. చిన్న రేంజే నాది కాదంటూ భారీ బడ్జెట్ తో తెరకెక్కే పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు ఈ హీరో. కాగా ఓం రౌత్ రూపొందిస్తున్న ఆదిపురుష్ లో హీరోగా కనిపించి ప్రభాస్ తన అభిమానులకు కనువిందుచెయ్యబోతున్నారు. ఈ సినిమాకోసం డార్లింగ్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. బాహుబలికి ఏమాత్రం మించిపోని విధంగా విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ మూవీ ఉండబోతుందని ఈ చిత్ర యూనిట్ చెబుతోంది.prabhas;prabhas;aly khan;saif ali khan;ali;ramu;mumbai;india;cinema;bahubali;director;hero;darling;vప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్ షురూ అవుతున్నట్టేనా?ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్ షురూ అవుతున్నట్టేనా?prabhas;prabhas;aly khan;saif ali khan;ali;ramu;mumbai;india;cinema;bahubali;director;hero;darling;vThu, 07 Jan 2021 12:59:27 GMTబాహుబలి తర్వాత డార్లింగ్ ప్రభాస్ రేంజే మారిపోయింది. ఈ స్టార్ కు భారీ ఆఫర్లు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. చిన్న రేంజే నాది కాదంటూ భారీ బడ్జెట్ తో తెరకెక్కే పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు ఈ హీరో. కాగా ఓం రౌత్ రూపొందిస్తున్న ఆదిపురుష్ లో హీరోగా కనిపించి ప్రభాస్ తన అభిమానులకు కనువిందుచెయ్యబోతున్నారు. ఈ సినిమాకోసం డార్లింగ్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. బాహుబలికి ఏమాత్రం మించిపోని విధంగా విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ మూవీ ఉండబోతుందని ఈ చిత్ర యూనిట్ చెబుతోంది.


అయితే ఆదిపురుష్ డైరెక్టర్ ఆమద్య  ముందే చెప్పినట్టుగా ఈ సినిమా షూటింగ్ ను ఈ నెలలోనే మొదలు చెయ్యబోతున్నారట. కాగా ఈ సినిమాలోని సీన్స్ ను 90 శాతం గ్రీన్ మ్యాట్ పైనే తియ్యబోతున్నారట.  ఇందుకోసం ముంబాయిలో ఉండే ఓ స్టూడియో రెడీ కూడా అయ్యిందట. అక్కడే ఈ నెల 19 న షూటింగ్ షురూ చెయ్యబోతున్నరని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకో పది రోజుల్లో ముంబయి చేరబోతున్నాడు డార్లింగ్ ప్రభాస్. అయితే ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా కనిపించబోతున్నట్టు ఆ చిత్ర యూనిట్ తెలిపిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో విజువల్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉండేందుకు విజువల్ ఎఫెక్ట్స్ టీం భాగా పనిచేస్తున్నారట. ఈ పాన్ ఇండియా సినిమాను రూ.450 కోట్ల భారీ బడ్జెట్ తో ఓం రౌత్ రూపొందిస్తున్నాడని గుసగుసలు మొదలయ్యాయి. అయితే ఈ సినిమాలో విజువల్స్ ఎఫెక్ట్స్ ఒక ప్రత్యేకతైతే మరోటి రావణుడి పాత్రను దాదాపుగా 9 అడుగుల ఎత్తు చూపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. రాముడిని ఆరడుగుల ఆజానుబాహుడిగా చూపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా ఎప్పుడు తెరముందుకు రాబోతుందన్న విషయాన్ని ఆ చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసింది. ఈ మూవీని వచ్చే ఏడాది ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలిపింది చిత్ర యూనిట్. అయితే ఈ సినిమా షూటింగ్ ను ఇంకో నాలుగు నెలల్లో కంప్లీట్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. కాగా ఈ సినిమా షూటింగ్ షురూ అవుతున్నా రాముడికి సీతగా ఎవరు నటిస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. 


లోకేష్‌ను లైట్ తీస్కొన్న బాల‌య్య‌.. చివ‌ర‌కు ఇంత చుల‌క‌నా...?

కొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!

ముఖ్యమంత్రికి షాకిచ్చిన హైకోర్టు.. కేసును కొనసాగించాలని లోకాయుక్తకు ఆదేశం

ఎమ్మెల్సీ ఉప పోరు రెడీ... వైసీపీలో ఆశావాహుల‌ లిస్ట్ పెద్ద‌దే...!

మోదీ హవా తగ్గుతోందా...బీజేపీ కి పాతరోజులు తప్పవా...!

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>