PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఇబ్బంది పెట్టడానికి కొన్ని రాజకీయ పార్టీలు తీవ్ర స్థాయిలో కష్టపడుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ముఖ్యమంత్రి జగన్ ని టార్గెట్ చేయడానికి వైసీపీ నేతలను కూడా తెలుగుదేశం పార్టీలోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు ఎక్కువ చేస్తుంది. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన ఎర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు పార్టీలోకి తీసుకురావడానికి తీవ్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ నేతలు కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీys jagan;srinivasa reddy;telugu desam party;balineni srinivasa reddy;bhagya lakshmi kottagulli;jagan;andhra pradesh;telugu;chief minister;mla;minister;ycp;reddy;partyఆయనకు జగన్ ఎమ్మెల్సీ ఇస్తారా...?ఆయనకు జగన్ ఎమ్మెల్సీ ఇస్తారా...?ys jagan;srinivasa reddy;telugu desam party;balineni srinivasa reddy;bhagya lakshmi kottagulli;jagan;andhra pradesh;telugu;chief minister;mla;minister;ycp;reddy;partyThu, 07 Jan 2021 09:04:11 GMTఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఇబ్బంది పెట్టడానికి కొన్ని రాజకీయ పార్టీలు తీవ్ర స్థాయిలో కష్టపడుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ముఖ్యమంత్రి జగన్ ని టార్గెట్ చేయడానికి వైసీపీ నేతలను కూడా తెలుగుదేశం పార్టీలోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు ఎక్కువ చేస్తుంది. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన ఎర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు పార్టీలోకి తీసుకురావడానికి తీవ్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ నేతలు కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి రంగంలోకి దిగి సదరు నేతతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది.

గత ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన తనకు ప్రాధాన్యత దక్కడం లేదు అని ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేసినట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయనకు దళిత సామాజిక వర్గం లో మంచి పట్టు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ తో మంత్రి మాట్లాడారని సమాచారం. ఆయన వెళ్తే అనవసరంగా ఇతర పార్టీ నేతలలో కూడా కాస్త ఆందోళన వ్యక్తం అవుతుంది.

కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి వివరించారట. అయితే ఈ వ్యవహారంపై సీఎం సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. పార్టీలో పదవులు రాలేదని పోవాల్సిన అవసరం ఏం ఉంటుందని పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏదో ఒకటి వస్తుంది కదా కొంత కాలం వేచి ఉండొచ్చు కదా అనే భావనను ముఖ్యమంత్రి... మంత్రి వద్ద వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. మరి సదరు నేత ఉంటారా వెళ్తారా అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి.


ఏలూరు వింత వ్యాధికి కారణం తెలిసింది

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?

ఐ లవ్ యూ అంటూ ఆ ఫొటోను పోస్ట్ చేసిన రష్మిక

కొడాలి నాని నీకే చెబుతున్నా.. సహనాన్ని పరీక్షించొద్దు: నందమూరి బాలకృష్ణ

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>