MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-directorsc9d2af0f-2269-44f7-b75f-6f805ec4ce11-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-directorsc9d2af0f-2269-44f7-b75f-6f805ec4ce11-415x250-IndiaHerald.jpgఅమ్మ మనకి జన్మను ఇస్తే.. నాన్న మనకి నడవడిక నేర్పుతాడు. అలాగే అమ్మ , నాన్న తరువాత మనకి మంచి ఏదో, చెడు ఏదో చెప్పేది ఒక గురువు మాత్రమే. మనకు విద్యాబుద్ధులు నేర్పి మనల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టేది ఒక్క గురువు మాత్రమే.. తల్లి- కొడుకుల బంధం, తండ్రి -కొడుకులు బంధం లాగానే గురు శిష్యుల బంధం కూడా చాలా ముఖ్యమైనదిtollywood directors;gopichand;kumaar;ram gopal varma;shiva;anil music;anil ravipudi;choudary actor;dasari narayana rao;editor mohan;geetha;koratala siva;krishna vamshi;nag ashwin;paruchuri brothers;posani krishna murali;prasad;ram pothineni;ramu;rajamouli;sekhar;srinu vytla;sukumar;kamma;mohandas karamchand gandhi;cinema;naga aswin;director;lord siva;comedy;thota chandrasekhar;k v vijayendra prasad;father;darsakudu;maya bazar;reddy;v;jandhyala ravishankar;raghavendraరాజమౌళి రాఘవేంద్ర రావు సహా తెలుగు సినిమాల్లో గురు శిష్యులు వీళ్ళేరాజమౌళి రాఘవేంద్ర రావు సహా తెలుగు సినిమాల్లో గురు శిష్యులు వీళ్ళేtollywood directors;gopichand;kumaar;ram gopal varma;shiva;anil music;anil ravipudi;choudary actor;dasari narayana rao;editor mohan;geetha;koratala siva;krishna vamshi;nag ashwin;paruchuri brothers;posani krishna murali;prasad;ram pothineni;ramu;rajamouli;sekhar;srinu vytla;sukumar;kamma;mohandas karamchand gandhi;cinema;naga aswin;director;lord siva;comedy;thota chandrasekhar;k v vijayendra prasad;father;darsakudu;maya bazar;reddy;v;jandhyala ravishankar;raghavendraThu, 07 Jan 2021 15:00:00 GMTనాన్న మనకి నడవడిక నేర్పుతాడు. అలాగే అమ్మ , నాన్న తరువాత మనకి మంచి ఏదో, చెడు ఏదో చెప్పేది ఒక గురువు మాత్రమే. మనకు విద్యాబుద్ధులు నేర్పి మనల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టేది ఒక్క గురువు మాత్రమే.. తల్లి- కొడుకుల బంధం, తండ్రి -కొడుకులు బంధం లాగానే గురు శిష్యుల బంధం కూడా చాలా ముఖ్యమైనది. అలాగే మన  వెండితెరపై కూడా  చాలా మంది గురు శిష్యులు ఉన్నారు తెలుసా.. !! అంటే ఇప్పుడు పేరు. ప్రఖ్యాతలు సంపాదించుకున్న దర్శకులలో చాలా మంది డైరెక్టర్స్ కూడా ఒకప్పుడు వేరే దర్శకుల దగ్గర శిష్యరికం చేసిన వాళ్లే తెలుసా.. అలా వెండితెరపై  దర్శకులుగా ఒక వెలుగు వెలుగుతున్న ఆ గురుశిష్యులు ఎవరెవరో ఒకసారి తెలుసుకుందాం.. ! దర్శక దిగ్గజంగా పేరుగాంచిన  రాజమౌళి కెరీర్ మొదట్లో తన తండ్రి v VIJAYENDRA PRASAD' target='_blank' title='విజయేంద్ర ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>విజయేంద్ర ప్రసాద్ దగ్గర రైటర్ ‌గా పనిచేసి..ఆ తరువాత  కోటగిరి వెంకటేశ్వరరావు దగ్గర ఎడిటింగ్ వర్క్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర దర్శకత్వ మెలుకువలు నేర్చుకుని ఇప్పుడు ప్రపంచం గర్వించదగ్గ గొప్ప డైరెక్టర్ అయ్యాడు.  అలాగే ప్రముఖ  దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా  పౌరాణిక బ్రహ్మా అయిన కమలకర కామేశ్వరరావు దగ్గర అసిస్టెంట్‌గా డైరెక్టర్‌గా పనిచేసాడు.అలాగే తన తండ్రి కే.యస్. ప్రకాష్ రావు దగ్గర కొన్ని సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేసారు.

అలాగే  కోదండరామిరెడ్డి గారు కూడా రాఘవేంద్రరావు దగ్గర కొన్ని సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేసాడు. యాక్షన్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న  ప్రముఖ దర్శకులు బి.గోపాల్ కూడా ముందుగా పి.చంద్రశేఖర్ రెడ్డిగా అసిస్టెంట్‌గా కెరీర్ మొదలు పెట్టారు. తరువాత కే.రాఘవేంద్రరావు  దర్శకత్వం వహించిన అడవి రాముడు నుంచి ఆయనకు అసిస్టెంట్‌గా పనిచేసి దర్శకుడుగా మారాడు. ఇక ఈ లిస్టులో వైవియస్ చౌదరి కూడా ఉన్నారు. ఈయన రాఘవేంద్రరావు దగ్గర ‘పట్టాభిషేకం’ సినిమా నుంచి అసిస్టెంట్‌గా పనిచేసి దర్శకుడయ్యారు.ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కూడా దర్శకరత్న దాసరి నారాయణ రావు శిష్యుడే.అలాగే హాస్య దర్శకుడిగా పేరు గడించిన రేలంగి నరసింహారావు కూడా దాసరి నారాయణ రావు దగ్గర దర్శకత్వంలో మెళుకువలు  నేర్చుకున్నారు. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాస రావు ప్రముఖ దర్శకుడు మాయా బజార్’ ఫేమ్ కే.వి.రెడ్డి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసారు. అలాగే ప్రముఖ  కళా తపస్వీ కే.విశ్వనాథ్ గారు ఆదుర్తి సుబ్బారావు దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసారు. అలాగే స్వర్గీయ  హాస్య దర్శకులు ఇవివి సత్యనారాయణ .. హాస్యబ్రహ్మా జంధ్యాల దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసారు.ఈయన కామెడీ సినిమాలకు పెట్టింది పేరు. అలాగే  వివాదస్పద దర్శకుడు  రామ్ గోపాల్ వర్మకు ఎంతో మంది శిష్యులున్నారు.


అందులో కృష్ణవంశీ, పూరీ జగన్నాద్ లు  కూడా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యులే. అలాగే దర్శకుడు కొరటాల శివ కూడా పోసాని కృష్ణమురళి దగ్గర పనిచేసారు.మోహన్ గాంధీ దగ్గర అసిస్టెంట్‌గా జీవితాన్ని ప్రారంభించిన పోసాని కృష్ణమురళి, ఆ తర్వాత పరుచూరి బ్రదర్స్ దగ్గర చాలా కాలం పనిచేసారు పోసాని.  శ్రీనువైట్ల దగ్గర శిష్యరికం చేసిన గోపీచంద్ మలినేని. అలాగే కొద్ది కాలం పాటు  శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసాడు నాగ్ అశ్విన్. అలాగే  వి.వి.వినాయక్ ప్రముఖ దర్శకుడు సాగర్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసాడు. అలాగే వినాయక్ దగ్గర  సుకుమార్ అసిస్టెంట్‌గా పనిచేసాడు. అలాగే యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముందుగా తమ్ముడు ఫేమ్ అరుణ్ ప్రసాద్ దగ్గర పనిచేసారు. ఆ తర్వాత శ్రీను వైట్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసాడు.అలాగే ఇవివి దగ్గర కొన్ని సినిమాలకు శిష్యరికం చేసాడు శ్రీను వైట్ల. ఇలా చాలామంది దర్శకులు వాళ్ళ గురువుల దగ్గర దర్శకత్వ మెళుకువలు నేర్చుకుని ఇప్పడు గొప్ప స్థాయిలో ఉన్నారు.. !!
 .


అర్జెంట్ గా గవర్నర్ వద్దకు టీడీపీ నేతలు... ఎందుకు...?

ఫోన్ పే అదిరిపోయే ఆఫర్.. కేవలం 149 రూపాయలతో..?

వెలంప‌ల్లి కోరితెచ్చుకున్న క‌ష్టాలు.. పొంచి ఉన్న ప‌ద‌వీ గండం..!

కెజిఎఫ్ విలన్ అసలు ఎవరో తెలుసా?

కొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!

ముఖ్యమంత్రికి షాకిచ్చిన హైకోర్టు.. కేసును కొనసాగించాలని లోకాయుక్తకు ఆదేశం

ఎమ్మెల్సీ ఉప పోరు రెడీ... వైసీపీలో ఆశావాహుల‌ లిస్ట్ పెద్ద‌దే...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>