Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/biden-elected-as-46th-president-of-america-after-congress-meeting2b95adf2-a573-4e47-be39-815bdd6fed4b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/biden-elected-as-46th-president-of-america-after-congress-meeting2b95adf2-a573-4e47-be39-815bdd6fed4b-415x250-IndiaHerald.jpgదేశ తదుపరి అధ్యక్షుడిగా బైడెన్‌ను ప్రకటిస్తూ అమెరికా కాంగ్రెస్ ప్రకటన విడుదల చేసింది. మ్యాజిక్ ఫిగర్ 270 ఎలక్టోరల్ ఓట్లకంటే ఎక్కువగా 306 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను బైడెన్ గెలుచుకున్నారని, అందువల్ల ఆయనే తదుపరి ప్రెసిడెంట్ అని తేల్చి చెప్పింది. దీంతో ట్రంప్ ఇన్నాళ్లుగా చేసిన రాద్ధాంతం..trump;ganga;ganges;american samoa;congress;donald trump;january;capital;letter;college;partyట్రంప్‌‌కు షాకిచ్చిన పెన్స్.. బైడెన్‌ అధ్యక్షుడంటూ కాంగ్రెస్ కు లేఖట్రంప్‌‌కు షాకిచ్చిన పెన్స్.. బైడెన్‌ అధ్యక్షుడంటూ కాంగ్రెస్ కు లేఖtrump;ganga;ganges;american samoa;congress;donald trump;january;capital;letter;college;partyThu, 07 Jan 2021 19:15:56 GMTఅమెరికా కాంగ్రెస్ ప్రకటన విడుదల చేసింది. మ్యాజిక్ ఫిగర్ 270 ఎలక్టోరల్ ఓట్లకంటే ఎక్కువగా 306 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను బైడెన్ గెలుచుకున్నారని, అందువల్ల ఆయనే తదుపరి ప్రెసిడెంట్ అని తేల్చి చెప్పింది. దీంతో ట్రంప్ ఇన్నాళ్లుగా చేసిన రాద్ధాంతం సమసిపోయింది. అమెరికాలో సాగుతున్న ఉద్రిక్తతకు ముగింపు కార్డు పడింది. అమెరికా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, ఫలితాలను అంగీకరించనని, ఎన్నికలు పూర్తయనప్పటి నుంచే ట్రంప్ ప్రకటిస్తున్నారు. ఇన్నాళ్లుగా కూడా అధికారం వీడేది లేదని, తన పోరాటం కొనసాగుతుందని ఈ మధ్య కూడా ప్రకటించారు. ఇవ్వన్నీ ట్రంప్ మద్దతుదారులపై తీవ్ర ప్రభావం చూపించాయి. క్యాపిటల్ బిల్డింగ్‌ను సైతం ముట్టడించేలా చేశాయి. గత 200 ఏళ్లలో అమెరికా ఎన్నడూ చూడని భయానక దృశ్యాలు క్యాపిటల్ బిల్డింగ్ వద్ద దర్శమిచ్చాయి. దీంతో ప్రపంచమే నివ్వెరపోయింది.

ఒకానొక సమయంలో ట్రంప్ విధానాలను సొంత పార్టీ నేతలే వ్యతిరేకించారు. రిపబ్లిక్, డెమెక్రటిక్ పార్టీల నేతలంతా ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే క్యాపిటల్ బిల్డింగ్‌లో పరిస్థితులు సద్దుమణిగిన వెంటనే ఉభయ చట్టసభల సభ్యులు సంయుక్తం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ అధ్యక్షత వహించారు. ఇక్కడ కూడా ట్రంప్ తన అవకాశాన్ని వినియోగించుకునేందుకు ప్రయత్నించారు.  మైక్ పెన్స్‌ను తనకు అనుకూలంగా వాడుకోవాలని అనుకున్నారు. ఇంతకుముందే దీనిపై ట్రంప్ ఓ వివాదాస్పద పోస్ట్ కూడా చేశారు. ఎన్నికల ఫలితాలను తిప్పి పంపే అధికారం పెన్స్‌కు ఉందంటూ బహిరంగ ప్రకటన చేశారు. దీంతో పెన్స్ ఏం చేస్తారోనని సర్వత్రా ఆందోళన నెలకొంది.

పెన్స్ మాత్రం అమెరికా ట్రంప్ అభ్యర్థలను పక్కనపెట్టి నిష్పక్షపాతంగా ఎన్నికల్లో బెడెన్ గెలిచినట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ఈ విషయాన్ని బహిరంగంగా వెలువరించింది. దీంతో ట్రంప్ ఆఖరి అవకాశం కూడా చేజారినట్లైంది. దీంతో ట్రంప్ దిగివచ్చారు. ఓటమిని అంగీకరించిన ట్రంప్‌.. పద్ధతి ప్రకారం ప్రశాంతంగా అధికార బదిలీ జరుగుతుందని తెలిపారు. దీంతో రెండు నెలలుగా సాగుతున్న గందరగోళం కొన్ని గంటల్లోనే సమసిపోయింది.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ తీర్పుతో బైడెన్‌కు అధ్యక్షుడ పీఠానికి మార్గం సుగమమైంది. ఈ క్రమంలోనే జనవరి 20న ఆయన అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ట్రంప్ వైట్‌హౌస్‌ను వీడి వెళ్లిపోనున్నారు. అయితే ఓ గొప్ప పాలనకు నేటితో చరమగీతం పాడినట్లైందని ట్రంప్ ప్రకటించడం కొసమెరుపు.


పవన్ కు నాదెండ్ల షాక్...?

ఎమ్మెల్యేలను పిలుస్తున్న జగన్... షాక్ ఇస్తారా...?

వైసీపీతో స్నేహం చేసే నేతల మీద బిజెపి సీరియస్...?

షాకింగ్ న్యూస్.. తుమ్మితే ఎముకలు విరిగాయి..!

రేవంత్ అయితేనే బెస్ట్... అధిష్టానానికి లేఖ రాసారా...?

ఏపీ: కోనసీమలో కోడి పందాలకు సై..!?

చంద్రబాబుకి, కేసీఆర్ కి మమత ఆహ్వానం...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>