PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjay51d180d5-69f4-4991-ac5d-6c9c6f7836be-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjay51d180d5-69f4-4991-ac5d-6c9c6f7836be-415x250-IndiaHerald.jpgబండి సంజయ్.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తున్న పేరు.. ఆయన తెలంగాణ బీజేపీ పగ్గాలు చేపట్టిన తర్వాతే ఆపార్టీకి మంచి జోష్ వచ్చింది. దుబ్బాక ఎన్నికలు గెలిచారు.. జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్‌కు వణుకు పుట్టించారు. ఇప్పుడు అదే జోష్ అటు ఖమ్మం, వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లోనూ కంటిన్యూ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు.. అటు ఏపీలో జరగబోతున్న తిరుపతి ఉపఎన్నికపైనా ఆయన కన్నేశారు.. ఎలాగూ ఇప్పుడు ఏపీలో విగ్రహాల రాజకీయం నడుస్తోంది కదా.. అందుకే బండి సంజయ్ ఆ మధ్య సంచలన కామెంట్లు చేశారు. భగవద్గీత bandi-sanjay;ramu;satya;tiru;bharatiya janata party;warangal;telangana;ram madhav;tirupati;husband;bible;ycp;rama tirtha;research and analysis wing;josh;partyబండి సంజయ్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన వైసీపీ..!?బండి సంజయ్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన వైసీపీ..!?bandi-sanjay;ramu;satya;tiru;bharatiya janata party;warangal;telangana;ram madhav;tirupati;husband;bible;ycp;rama tirtha;research and analysis wing;josh;partyThu, 07 Jan 2021 10:00:00 GMTతెలంగాణ బీజేపీ పగ్గాలు చేపట్టిన తర్వాతే  ఆపార్టీకి మంచి జోష్ వచ్చింది. దుబ్బాక ఎన్నికలు గెలిచారు.. జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్‌కు వణుకు పుట్టించారు. ఇప్పుడు అదే జోష్ అటు ఖమ్మం, వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లోనూ కంటిన్యూ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు.. అటు ఏపీలో జరగబోతున్న తిరుపతి ఉపఎన్నికపైనా ఆయన కన్నేశారు.. ఎలాగూ ఇప్పుడు ఏపీలో విగ్రహాల రాజకీయం నడుస్తోంది కదా.. అందుకే బండి సంజయ్ ఆ మధ్య సంచలన కామెంట్లు చేశారు.

భగవద్గీత పార్టీ కావాలో..బైబిల్ పార్టీ కావాలో తేల్చుకోవాలంటూ తిరుపతి ప్రజలకు సలహా ఇచ్చాడు.. రెండు కొండలు అంటున్న వైసీపీకి ఓటేస్తారా.. ఏడు కొండలంటున్న బీజేపీకి ఓటేస్తారా అంటూ కలకలం రేపుతున్నారు.. ఇప్పుడు వైసీపీ కూడా ఈ అంశంపై ఘాటుగానే స్పందించింది. ఆ పార్టీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ.. “ ఆయనెవరో బండి సంజయ్‌ అంట కార్పొరేటర్‌ స్థాయి నాయకుడు కూడా వచ్చి వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడుతున్నాడు. బైబిల్‌ పార్టీకి ఓటేస్తారా..? భగవద్గీత పార్టీకి ఓటేస్తారా..? అని మాట్లాడుతున్నాడు. బైబిల్, ఖురాన్, భగవద్గీత వంటి పవిత్ర గ్రంధాలకు పార్టీలు పెట్టేశావ్‌. అవును మాది భగవద్డీత పార్టీ, మాది బైబిల్‌ పార్టీ, మాది ఖురాన్‌ పార్టీ.. మూడు కలిస్తేనే వైయస్‌ఆర్‌ సీపీ అన్ని మతాలకు సంబంధించి పార్టీ తప్ప.. నీలాంటి మతంతో ప్రమేయమున్న పార్టీ కాదని అంబటి అన్నారు.

బండి సంజయ్ రెండు కొండలు, ఏడు కొండలు అని మాట్లాడుతున్నాడు. బండి సంజయ్‌కి సత్యం తెలుసా..? చంద్రబాబు రెండు కొండలు అని ఇస్తే.. మహానేత వైయస్‌ఆర్‌ ఏడు కొండలుగా జీఓ ఇచ్చారు. తెలుసుకో.. సంజయ్‌. ఆంధ్రరాష్టంలో మతాలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయలేరు. రామతీర్థంలో రాముడి విగ్రహం తల ఎవరు పగులగొట్టారో తొందరలోనే తేలుతుంది. విచారణ జరుగుతుంది. దోషులను కఠినంగా శిక్షిస్తాం.. అన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. 


జిగర్తాండ సినిమా హిందీ రిమేక్ షూటింగ్ ప్రారంభించిన చిత్ర బృందం..!

ఎమ్మెల్సీ ఉప పోరు రెడీ... వైసీపీలో ఆశావాహుల‌ లిస్ట్ పెద్ద‌దే...!

మోదీ హవా తగ్గుతోందా...బీజేపీ కి పాతరోజులు తప్పవా...!

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?

ఐ లవ్ యూ అంటూ ఆ ఫొటోను పోస్ట్ చేసిన రష్మిక

కొడాలి నాని నీకే చెబుతున్నా.. సహనాన్ని పరీక్షించొద్దు: నందమూరి బాలకృష్ణ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>