SportsSreekanth Eeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rishabpant8ebe88a8-19e2-455e-9558-dfeded47060b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rishabpant8ebe88a8-19e2-455e-9558-dfeded47060b-415x250-IndiaHerald.jpgబోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కీపింగ్ పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ స్పందించాడు. వికెట్ల వెనకాల పంత్ ప్రదర్శన తీసికట్టుగా ఉందని విమర్శించాడు. టెస్టుల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ప్రపంచ క్రికెట్ లో ఎవరూ వదలనన్ని ఎక్కువ క్యాచులు జారవిడిచాడని ఎద్దేవా చేసాడు. ఇక పంత్ ప్రదర్శన ఇలానే ఉంటే భవిష్యత్తులో కష్టమని అభిప్రాయపడ్డాడు.rishabpant;cricket;australia;rishabh pant;yuva;paruguపంత్‌పై రికీ పాంటింగ్‌ ఘాటు వ్యాఖ్యలుపంత్‌పై రికీ పాంటింగ్‌ ఘాటు వ్యాఖ్యలుrishabpant;cricket;australia;rishabh pant;yuva;paruguThu, 07 Jan 2021 22:52:15 GMTయువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కీపింగ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెల్సిందే. పంత్ రెండు క్యాచ్ లను జారవిడడవంతో అతనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పంత్ ప్రదర్శన పట్ల ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ స్పందించాడు. వికెట్ల వెనకాల పంత్ ప్రదర్శన తీసికట్టుగా ఉందని విమర్శించాడు.

టెస్టుల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ప్రపంచ క్రికెట్ లో ఎవరూ వదలనన్ని ఎక్కువ క్యాచులు జారవిడిచాడని ఎద్దేవా చేసాడు. ఇక పంత్ ప్రదర్శన ఇలానే ఉంటే భవిష్యత్తులో కష్టమని అభిప్రాయపడ్డాడు. పంత్‌ మరింత మెరుగ్గవాల్సిందేనని హెచ్చరించాడు. పంత్ తొలి రోజు నేలపాలు చేసిన రెండు క్యాచులు ఎంతో తేలికైనవని అన్నాడు. ఒకవేళ పుకోస్కీ గానీ  క్రీజులో ఉంటే కచ్చితంగా భారీ శతకం లేదా ద్విశతకం చేసేవాడని పాంటింగ్ అన్నాడు.

కాగా ఆసీస్ జట్టులో డేవిడ్ వార్నర్ తో ఓపెనర్ గా వచ్చిన విల్‌ పకోస్కీ ఈ మ్యాచ్ తో టెస్టుల్లో అర్రంగేట్రం చేసాడు. అయితే ఈ ఇన్నింగ్స్ లో పకోస్కీ ఇచ్చిన రెండు క్యాచ్ లను పంత్ జారవిడిచాడు.  రవిచంద్రన్‌ అశ్విన్‌ వేసిన 22వ ఓవర్ చివరి బంతి పకోస్కీ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని కీపర్ కు వెళ్ళగా పంత్ ఆ క్యాచ్ ని  నేలపాలు చేశాడు. అప్పటికి పకోస్కీ 69 బంతుల్లో 26 పరుగుల వద్ద ఉన్నాడు. ఇక మళ్ళీ మహ్మద్‌ సిరాజ్‌ వేసిన 25వ ఓవర్ చివరి బంతి టాప్ ఎడ్జ్ తీసుకొని లెగ్ సైడ్ వెళ్ళగా పంత్ దానిని కూడా మిస్ చేసాడు. రెండు లైఫ్ ల అనంతరం పకోస్కీ  62 పరుగుల వద్ద నవదీప్‌ సైని బౌలింగ్ లో ఎల్బీడబ్య్లూ గా వెనుదిగాడు. ఇలా పకోస్కీ  ఇచ్చిన రెండు క్యాచ్ లను పంత్ నేలపాలు చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.


అన్ని భాషల్లో ఒకే టీజర్.. కె.జి.ఎఫ్-2 మాటల్లేవ్ అంతే..!

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?

తెరాస పార్టీ బీజేపీ ని కాకుండా బండి ని టార్గెట్ చేయడంలో మర్మం ఏంటి..?

ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్దరించండి

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?

ఎమ్మెల్యేలను పిలుస్తున్న జగన్... షాక్ ఇస్తారా...?

వైసీపీతో స్నేహం చేసే నేతల మీద బిజెపి సీరియస్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sreekanth E]]>