MoviesSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_gossips/do-they-accept-the-requests-of-the-producers98baff66-3ed1-4cf1-ba87-25f9c10c44d6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_gossips/do-they-accept-the-requests-of-the-producers98baff66-3ed1-4cf1-ba87-25f9c10c44d6-415x250-IndiaHerald.jpgధియేటర్లలో సినిమా ప్రదర్శనల సందర్భంగా కొవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని కేంద్రం స్పష్టం చేసింది. సినిమా హాళ్లకు, మల్టీప్లెక్సులకు 50 శాతం ప్రేక్షకులతో మాత్రమే సినిమా ప్రదర్శనలు అనుమతిచ్చామని తెలిపింది. ఈ ఆంక్షలను జనవరి 31 వరకు పొడిగించామని గుర్తు చేసింది. కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలను ఏ రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం కూడా తమకు అనుగుణంగా మార్చుకోరాదని స్పష్టం చేసిందిcinema;business;allu aravind;ajay;hari;hari music;kranthi;kranti;makar sakranti;bharatiya janata party;industries;cinema;sankranthi;january;festival;tamil;tamilnadu;letter;central government;coronavirus100 శాతం సీటింగ్ కుదరదు... కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే - కేంద్రం100 శాతం సీటింగ్ కుదరదు... కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే - కేంద్రంcinema;business;allu aravind;ajay;hari;hari music;kranthi;kranti;makar sakranti;bharatiya janata party;industries;cinema;sankranthi;january;festival;tamil;tamilnadu;letter;central government;coronavirusThu, 07 Jan 2021 07:15:00 GMTసినిమా ప్రదర్శనల సందర్భంగా కొవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని కేంద్రం స్పష్టం చేసింది. సినిమా హాళ్లకు, మల్టీప్లెక్సులకు 50 శాతం ప్రేక్షకులతో మాత్రమే సినిమా ప్రదర్శనలు అనుమతిచ్చామని తెలిపింది. ఈ ఆంక్షలను జనవరి 31 వరకు పొడిగించామని గుర్తు చేసింది. కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలను ఏ రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం కూడా తమకు అనుగుణంగా మార్చుకోరాదని స్పష్టం చేసింది. తమిళనాడు ప్రభుత్వం తీసకున్న నిర్ణయం వివాదాస్పదం కావడంతో కేంద్ర హోం శాఖ స్పందించింది.

సినిమా థియేటర్స్‌లో సీటింగ్ సామర్థ్యాన్ని 50 శాతం నుంచి 100 శాతానికి పెంచుకోవచ్చంటూ తమిళనాడు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నిర్ణయంపై వ్యతిరేకత తెలుపుతూ చాలా మంది గళమెత్తారు. సోషల్ మీడియాలో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. కోలీవుడ్‌కు చెందిన కొంత మంది ప్రముఖులు కూడా ప్రభుత్వం ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరారు. తాజాగా ఈ అంశంపై తమిళనాడు ప్రభుత్వానికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఓ లేఖ రాశారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతోందని, దీనికి తోడు కరోనా కొత్త వైరస్‌ స్ట్రెయిన్ కేసులు కూడా నమోదవుతున్నాయని.. ఇలాంటి తరుణంలో సినిమా హాళ్లు, మల్టీప్లెక్సుల్లో 100 శాతం సీటింగ్ సామర్థ్యంతో సినిమా ప్రదర్శనకు అనుమతివ్వడం సమంజసం కాదని లేఖలో పేర్కొన్నారు. తమిళనాడు ప్రభుత్వం ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని సూచించారు.



తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం కేంద్రం డిసెంబరు 28న జారీ చేసిన కొవిడ్‌-19 మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉందని కేంద్ర హోం శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. 100 శాతం సీటింగ్‌తో సినిమా ప్రదర్శనల ఆదేశాలను ఉపసంహరించుకోవాలని, తమ ఆదేశాన్ని పాటించాలని తమిళనాడు ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు కూడా ఇప్పటికీ మాస్కులు, భౌతిక దూరం నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసిందని లేఖలో పేర్కొన్నారు. తమిళనాడులో సినిమా హాళ్లలో సీటింగ్ కెపాసిటీని 100 శాతానికి పెంచడాన్ని అరవింద్ స్వామి వ్యతిరేకించారు. అలనాటి నటి, ఇటీవల బీజేపీ పార్టీలో చేరిన ఖుష్బూ తమిళ సర్కార్ నిర్ణయానికి మద్దతు పలికారు. పుదిచ్చేరికి చెందిన ఒక వైద్యుడు 100 శాతం సీటింగ్ అవకాశాన్ని తప్పుపడుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. అది బాగా వైరల్ అయ్యింది. ఈ పోస్టును ట్యాగ్ చేస్తూ కొందరు తమిళ సినీ ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను తప్పుబట్టారు. ఇదిలా ఉండగా.. టాలీవుడ్‌లోనూ 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశం కల్పించాలని కోరుతూ రెండు తెలుగు రాష్ట్రాల నిర్మాతల మండలి విజ్ఞప్తి చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కరోనా లాక్‌డౌన్‌తో బాగా నష్టపోయిన రంగాల్లో సినీ పరిశ్రమ ఒకటి. సంక్రాంతి పండుగ నుంచి మళ్లీ బిజినెస్ పుంజుకుంటుందని నిర్మాతలు, సినిమా థియేటర్ల యజమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 


పొగాకు ప్రియులకు భారీ షాక్.. ఇక వారికి నో సిగరెట్..?

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?

ఐ లవ్ యూ అంటూ ఆ ఫొటోను పోస్ట్ చేసిన రష్మిక

కొడాలి నాని నీకే చెబుతున్నా.. సహనాన్ని పరీక్షించొద్దు: నందమూరి బాలకృష్ణ

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>