PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/minister-says-amma-vodi-final-list-is-greater-than-last-yeara02d173e-33cd-4310-ab92-7031a484a288-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/minister-says-amma-vodi-final-list-is-greater-than-last-yeara02d173e-33cd-4310-ab92-7031a484a288-415x250-IndiaHerald.jpgఏపీలో అమ్మఒడి రెండో దఫా ఆర్థిక సాయం ఈనెల 11న లబ్ధిదారుల అకౌంట్లలో జమ అవుతుంది. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అయితే లబ్ధిదారుల వివరాలను వెబ్ సైట్ లో పొందుపరచకపోవడంతో.. అందరిలో ఒకే టెన్షన్. ఈసారి అమ్మఒడి ఎవరికి పడుతుంది, ఎవరికి పడదు.. ఎవరెవరి పేర్లు హోల్డ్ లో ఉన్నాయి అనే సమాచారం ఇంకా పూర్తి స్థాయిలో బయటకు రాలేదు. తొలి విడతలో వివిధ కారణాలతో రిజెక్ట్ లిస్ట్ లో పేర్లున్నవారు.. ఇప్పుడు దానికి సంబంధించిన సర్టిఫికెట్లన్నీ సమర్పించినా కూడా ఆందోళనతోనే ఉన్నారు. amma vodi;amala akkineni;suresh;nidhi;jagan;audimulapu suresh;nellore;bank;chief minister;minister;qualification;central government;ammavodi;partyఅమ్మఒడి లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరుగుతోందా..?అమ్మఒడి లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరుగుతోందా..?amma vodi;amala akkineni;suresh;nidhi;jagan;audimulapu suresh;nellore;bank;chief minister;minister;qualification;central government;ammavodi;partyThu, 07 Jan 2021 12:00:00 GMTఅమ్మఒడి రెండో దఫా ఆర్థిక సాయం ఈనెల 11న లబ్ధిదారుల అకౌంట్లలో జమ అవుతుంది. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అయితే లబ్ధిదారుల వివరాలను వెబ్ సైట్ లో పొందుపరచకపోవడంతో.. అందరిలో ఒకే టెన్షన్. ఈసారి అమ్మఒడి ఎవరికి పడుతుంది, ఎవరికి పడదు.. ఎవరెవరి పేర్లు హోల్డ్ లో ఉన్నాయి అనే సమాచారం ఇంకా పూర్తి స్థాయిలో బయటకు రాలేదు. తొలి విడతలో వివిధ కారణాలతో రిజెక్ట్ లిస్ట్ లో పేర్లున్నవారు.. ఇప్పుడు దానికి సంబంధించిన సర్టిఫికెట్లన్నీ సమర్పించినా కూడా ఆందోళనతోనే ఉన్నారు.

అయితే ఈఏడాది అమ్మఒడి లబ్ధిదారుల సంఖ్య మరింత పెరుగుతుందని, ఎవ్వరికీ ఆర్థిక సాయం ఆగదని భరోసా ఇస్తున్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. అర్హురాలైన ప్రతి తల్లికీ అమ్మ ఒడి పథకం అమలు చేస్తామని చెప్పారాయన. కులం, మతం, పార్టీ అనేవి చూడకుండా, కేవలం అర్హతే ప్రామాణికంగా ఈ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు.

పిల్లలను బడికి పంపించే అర్హులైన తల్లులందరికీ ఈ పథకం అమలు చేయాలని సీఎం స్పష్టం చేసినట్టు తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్. ఈ నెల 11న నెల్లూరులో రెండో విడత అమ్మ ఒడి పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారని, అదే రోజు అర్హులందరి బ్యాంక్ అకౌంట్లలో నగదు జమ అవుతుందని చెప్పారు. తల్లులకు అమ్మ ఒడి కింద ఇచ్చే రూ.15 వేలల్లో.. టాయిలెట్ల నిర్వహణ నిధి కోసం రూ.1000 మినహాయించి రూ.14వేలను లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేస్తామని వివరించారు.

వేర్వేరు సమస్యల వల్ల అర్హత కోల్పోయిన వారి విషయంలో మరింత పకడ్బందీగా పరిశీలించాలని సీఎం సూచించినట్టు తెలిపారు మంత్రి సురేష్. ఎంత మంది అర్హులు ఉంటే అంతమందికీ లబ్ధి చేకూరుస్తామని, గత ఏడాది కంటే ఈసారి ఎక్కువ మంది లబ్ధిదారులుంటారని భావిస్తున్నట్టు తెలిపారు. అమ్మఒడి పథకం దేశం మొత్తానికి ఆదర్శంగా మారిందని, నూతన జాతీయ విద్యా విధానంలోనూ ఇదే అంశాన్ని కేంద్రం ప్రస్తావించిందని గుర్తు చేశారు.


ట్రంప్ ప్రవర్తనతో..అట్టుడుకుతున్న అమెరికా !!

కొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!

ముఖ్యమంత్రికి షాకిచ్చిన హైకోర్టు.. కేసును కొనసాగించాలని లోకాయుక్తకు ఆదేశం

ఎమ్మెల్సీ ఉప పోరు రెడీ... వైసీపీలో ఆశావాహుల‌ లిస్ట్ పెద్ద‌దే...!

మోదీ హవా తగ్గుతోందా...బీజేపీ కి పాతరోజులు తప్పవా...!

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>