PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lockdown-once-again-with-the-new-strainb21ca7b0-66b4-4426-852c-9b6c027d2e06-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lockdown-once-again-with-the-new-strainb21ca7b0-66b4-4426-852c-9b6c027d2e06-415x250-IndiaHerald.jpgప్రపంచ వ్యాప్తంగా కొత్త కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. చాపకింద నీరులా కరోనా వ్యాప్తి చెందుతూనే ఉంది. ఎప్పటికప్పుడు రూపం మార్చుకొని తన పంజా విసురుతోంది. కొత్త స్ట్రెయిన్ వెలుగుచూసిన బ్రిటన్లో కేసులు వేలాదిగా నమోదవుతున్నాయి. మరణాల రేటూ ఎక్కువగానే ఉంది. బ్రిటన్‌లో ఇప్పటివరకు మొత్తం 77వేల 346 మంది కరోనాతో మరణించారు. ప్రతీ రోజు 60 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 62వేల 322 కేసులు నమోదుకాగా... ఒక వెయ్యి 41 మంది మరణించారు. కొత్త స్ట్రెయిన్‌తో మరోసారి లాక్‌ డౌన్‌ విధించింది బ్రిటన్‌lockdown once again with the new strain;russia;mexico;january;prime minister;2020;central government;panjaaకొత్త స్ట్రెయిన్‌తో మరోసారి లాక్‌ డౌన్ !కొత్త స్ట్రెయిన్‌తో మరోసారి లాక్‌ డౌన్ !lockdown once again with the new strain;russia;mexico;january;prime minister;2020;central government;panjaaThu, 07 Jan 2021 21:00:00 GMTపంజా విసురుతోంది. కొత్త స్ట్రెయిన్ వెలుగుచూసిన బ్రిటన్లో కేసులు వేలాదిగా నమోదవుతున్నాయి. మరణాల రేటూ ఎక్కువగానే ఉంది. బ్రిటన్‌లో ఇప్పటివరకు మొత్తం 77వేల 346 మంది కరోనాతో మరణించారు. ప్రతీ రోజు 60 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 62వేల 322 కేసులు నమోదుకాగా... ఒక వెయ్యి 41 మంది మరణించారు. కొత్త స్ట్రెయిన్‌తో మరోసారి లాక్‌ డౌన్‌ విధించింది బ్రిటన్‌ ప్రభుత్వం.

బ్రిటన్ స్ట్రెయిన్‌ ప్రపంచ దేశాలకు వేగంగా విస్తరిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రతీ రోజు నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే 41 దేశాలకు బ్రిటన్ స్ట్రెయిన్ వ్యాపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. బ్రిటన్‌లో తొలుత బయటపడిన కోవ్‌-2020 కరోనా వైరస్‌... జనవరి 5 నాటికే 40 దేశాల్లోని పలు ప్రాంతాలకు విస్తరించినట్లు ప్రకటించింది. సార్స్‌కోవ్‌-2తో పోలిస్తే బ్రిటన్‌ రకం కరోనా 70 శాతం వేగంగా వ్యాపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భారత్‌లోనూ స్ట్రెయిన్‌ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 71 కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం వీరందరినీ ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటుచేసి చికిత్స అందిస్తున్నారు. వారి సన్నిహితులను క్వారంటైన్‌లో ఉంచారు. కొత్త రకం కేసుల కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ కొనసాగుతుండటంతోపాటు వైరస్‌ సోకిన వారి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కూడా చేపడుతున్నామని కేంద్రం తెలిపింది. బ్రిటన్‌లో ఏర్పడిన ప్రజారోగ్య సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా భారత్‌లో రిపబ్లిక్ డేకు అతిథిగా రావాల్సిన బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ పర్యటన రద్దైంది. ప్రపంచంలోని చాలా దేశాలు బ్రిటన్‌కు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి.

బ్రిటన్‌ రకం వైరస్‌ కాకుండా ఇప్పటివరకు మొత్తం నాలుగు రకాల కరోనా వైరస్‌లు బయటపడినట్లు డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది. వాటిలో దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన రకంతోపాటు అంతకు ముందు వచ్చిన d-614g రకం కూడా ఉంది. మరణాల సంఖ్య కూడా భారీగానే ఉంది. గడిచిన 24 గంటల్లో అమెరికాలో లక్షా 53 కేసులు నమోదుకాగా... అందులో వెయ్యి 532 మంది మృతిచెందారు. బ్రిటన్‌లో 62వేల 322 కేసులు నమోదుకాగా... ఒక వెయ్యి 41 మంది మృత్యువాత పడ్డారు. ఆ తర్వాతి స్థానంలో ఉంది మెక్సికో... ఇక్కడ ఒక్కరోజులో వెయ్యికి పైగా మరణాలు సంభవించాయి. జర్మనీలో 17వేల 496 కేసులు నమోదుకాగా... 639 మంది మరణించారు. భారత్‌తోపాటు రష్యా, బ్రెజిల్‌ దేశాల్లో కేసుల నమోదు ఎక్కువగానే ఉన్నా... మరణాల రేటు మాత్రం తక్కువగా ఉంది. అయినా కోవిడ్ నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు వైద్యులు.


పవన్‌కు రాపక భారీ ఝలక్.. తాను వైసీసీతోనే అంటూ...

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?

ఎమ్మెల్యేలను పిలుస్తున్న జగన్... షాక్ ఇస్తారా...?

వైసీపీతో స్నేహం చేసే నేతల మీద బిజెపి సీరియస్...?

షాకింగ్ న్యూస్.. తుమ్మితే ఎముకలు విరిగాయి..!

రేవంత్ అయితేనే బెస్ట్... అధిష్టానానికి లేఖ రాసారా...?

ఏపీ: కోనసీమలో కోడి పందాలకు సై..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>