PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababue84c2f76-bdd8-4241-b1e4-0addb46318f1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababue84c2f76-bdd8-4241-b1e4-0addb46318f1-415x250-IndiaHerald.jpgఏపీలో ఇటీవల మతరాజకీయం పెరిగింది. విగ్రహాల ధ్వంసం ఘటనలు కొన్ని రోజులుగా రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. ఏపీలో ముఖ్యమంత్రి, హోం మంత్రి, డీజీపీ క్రైస్తవులు కాబట్టే రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై విధ్వంసకాండ జరుగుతోందని చంద్రబాబు కొత్త రాగం ఆలపిస్తున్నారు. 136 దుర్ఘటనలు జరిగినా ప్రభుత్వ పెద్దల అండ ఉండబట్టే ఎలాంటి చర్యలు తీసుకోలేదని చంద్రబాబు అంటున్నారు. క్రైస్తవ ముఖ్యమంత్రిగా జగన్‌రెడ్డి.. విగ్రహాల ధ్వంసంపై చర్యలు తీసుకుంటారన్న నమ్మకం తమకు లేదని, కేంద్రం తక్షణం జోక్యం చేసుకుని సీబీఐ దర్యాప్తు జరిపించాలchandrababu;deva;raaga;telugu desam party;telugu;scheduled caste;scheduled tribes;backward classes;cm;chief minister;cbi;minister;central government;ycp;hindus;maha;partyబాబు వెనుక బుద్ధుడి కథ ఏంటి.. అదిరిపోయే లాజిక్‌ లాగిన వైసీపీ..!?బాబు వెనుక బుద్ధుడి కథ ఏంటి.. అదిరిపోయే లాజిక్‌ లాగిన వైసీపీ..!?chandrababu;deva;raaga;telugu desam party;telugu;scheduled caste;scheduled tribes;backward classes;cm;chief minister;cbi;minister;central government;ycp;hindus;maha;partyThu, 07 Jan 2021 09:00:00 GMTమంత్రి, డీజీపీ క్రైస్తవులు కాబట్టే రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై విధ్వంసకాండ జరుగుతోందని చంద్రబాబు కొత్త రాగం ఆలపిస్తున్నారు. 136 దుర్ఘటనలు జరిగినా ప్రభుత్వ పెద్దల అండ ఉండబట్టే ఎలాంటి చర్యలు తీసుకోలేదని చంద్రబాబు అంటున్నారు. క్రైస్తవ ముఖ్యమంత్రిగా జగన్‌రెడ్డి.. విగ్రహాల ధ్వంసంపై చర్యలు తీసుకుంటారన్న నమ్మకం తమకు లేదని, కేంద్రం తక్షణం జోక్యం చేసుకుని సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

అంతే కాదు.. మన దేవుళ్లను మనం రక్షించుకుందాం అంటూ హిందూ మతాన్ని భుజానికి ఎత్తుకుంటున్నారు. అంతే కాదు.. జరుగుతున్న పరిణామాలపై గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేయాలని, అవసరమైతే దిల్లీకి బృందాన్ని పంపించాలని చంద్రబాబు నిర్ణయించారు. జగన్‌ పాలనలో హిందూ మతంపై జరుగుతున్న దుర్మార్గాలు, దుశ్చర్యలు బ్రిటిష్‌ హయాంలో కూడా జరగలేదని చంద్రబాబు అంటున్నారు.

ఇదే సమయంలో వైసీపీ ఓ లాజిక్ లాగుతోంది. చంద్రబాబు తన ఐదేళ్ల గత పాలనలో ఎక్కువగా బుద్ధుడి బొమ్మను పక్కన పెట్టుకున్నారు. సీఎం కార్యాలయంలో కూడా తన వెనుక బౌద్ధ చక్రం ఉండేలా డిజైన్ చేయించారు. చంద్రబాబు మహా హిందుత్వ వాది అయితే.. అప్పట్లో తన సీటు వెనకాలా బుద్దుడి బొమ్మ ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నిస్తున్నారు. జైశ్రీరాం అని పెద్దగా అంటున్నావే.. ఇంతకు ముందు శ్రీరాముడు ఎందుకు నీకు గుర్తుకురాలేదని అడుగుతున్నారు.

సీఎం వైయస్‌ జగన్‌ను క్రిస్టియన్‌గా ముద్రవేయడానికి చేసే పిచ్చే ప్రయత్నంలో చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నాడని.. సీఎం వైయస్‌ జగన్‌ మతమార్పులు చేస్తున్నాడంట.. నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై చాలా కష్టపడుతుంటే సీఎంపై కొత్త ముద్ర వేయడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని వైసీపీ నేతలు అంటున్నారు. రూ.90 వేల కోట్లు ఖర్చు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు డైరెక్ట్‌గా నగదు సాయం చేసిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదంటున్న వైసీపీ... ఇలాంటి మేలు చూసి తెలుగుదేశం పార్టీ నాయకులంతా పార్టీలు మారుతున్నారని చెబుతున్నారు. ఈ మార్పులు చూసి మతాల మార్పు అని పిచ్చి ప్రచారాలు చేయొద్దని హితవు పలుకుతున్నారు.




ఆయనకు జగన్ ఎమ్మెల్సీ ఇస్తారా...?

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?

ఐ లవ్ యూ అంటూ ఆ ఫొటోను పోస్ట్ చేసిన రష్మిక

కొడాలి నాని నీకే చెబుతున్నా.. సహనాన్ని పరీక్షించొద్దు: నందమూరి బాలకృష్ణ

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>