PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/patients-children-and-oldage-people-be-careful-in-this-winterfacc9992-a4da-4b8f-b4e2-277b362492ae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/patients-children-and-oldage-people-be-careful-in-this-winterfacc9992-a4da-4b8f-b4e2-277b362492ae-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం అత్యంత చల్లగా మారింది. ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడటంతో ఒక్కసారిగా పగటి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలి గాలులకి ప్రజలు గజ గజ వణుకుతున్నారు. జనాలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు. అయితే రానున్న మూడు నాలుగు రోజుల్లో ఈ చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారుclimate;varsha;hyderabad;koshta;telangana;komaram bheem;gulf countries;yadadri;medchal;ranga reddy;central government;kamareddy;sangareddy;adilabad;sircilla;mancherial;jagtialతెలంగాణలో వాతావరణ మార్పులు... రాబోయే నాలుగు రోజులు మరింత జాగ్రత్త అవసరంతెలంగాణలో వాతావరణ మార్పులు... రాబోయే నాలుగు రోజులు మరింత జాగ్రత్త అవసరంclimate;varsha;hyderabad;koshta;telangana;komaram bheem;gulf countries;yadadri;medchal;ranga reddy;central government;kamareddy;sangareddy;adilabad;sircilla;mancherial;jagtialThu, 07 Jan 2021 11:50:00 GMTతెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం అత్యంత చల్లగా మారింది. ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడటంతో ఒక్కసారిగా పగటి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలి గాలులకి ప్రజలు గజ గజ వణుకుతున్నారు. జనాలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు. అయితే రానున్న మూడు నాలుగు రోజుల్లో ఈ చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. నిన్న బుధవారం హైదరాబాద్‌, నల్లగొండ, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జోగులాంబ గద్వాల, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది.



కొమరిన్ ఏరియా నుంచి ఉత్తర తమిళనాడు వరకు గల్ఫ్ ఆఫ్ మన్నార్ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. ద్రోణితో తూర్పు దిశ నుంచి వేగంగా గాలులు వీస్తున్నాయి. బంగాళాఖాతంలోని తేమ దక్షిణ కోస్తా నుంచి తెలంగాణ మీదుగా రావడంతో ఆకాశం మేఘావృతమై గురువారం పలు చోట్ల ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్నిచోట్ల చలిగాలులు బలంగా వీస్తున్నాయి. దీనితో ఈ చల్లటి గాలుల ప్రభావానికి ప్రజలు గజ గజ వణుకుతున్నారు. ఇక అటు పొగమంచు కూడా తెరలా కమ్మేసి ఉండటం విశేషం. మరోవైపు నిన్న బుధవారం అత్యల్పంగా ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అత్యల్ప పగటి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇక వాటి ఉష్ణోగ్రతల వివరాలు తీసుకుంటే ఆదిలాబాద్‌ జిల్లాలో 14 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవగా, కామారెడ్డి జిల్లాలో 15 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇక సంగారెడ్డి, నిర్మల్, కుమురం భీమ్, వికారాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలు సహా మిగిలిన ఇతర జిల్లాల్లో కూడా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.


ట్రంప్ ప్రవర్తనతో..అట్టుడుకుతున్న అమెరికా !!

కొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!

ముఖ్యమంత్రికి షాకిచ్చిన హైకోర్టు.. కేసును కొనసాగించాలని లోకాయుక్తకు ఆదేశం

ఎమ్మెల్సీ ఉప పోరు రెడీ... వైసీపీలో ఆశావాహుల‌ లిస్ట్ పెద్ద‌దే...!

మోదీ హవా తగ్గుతోందా...బీజేపీ కి పాతరోజులు తప్పవా...!

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>