MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prakash-raj2c7bd1bb-45b2-4750-b7eb-60b0f6219ea6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prakash-raj2c7bd1bb-45b2-4750-b7eb-60b0f6219ea6-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా పరిశ్రమకి ఇప్పటి వరకూ ఎంతోమంది నటీనటులు వచ్చారు వెళ్ళారు. అయితే వారిలో కొందరు మాత్రం ప్రేక్షకాభిమానుల మనస్సులో తమదైన ఆకట్టుకునే నటనతో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నారు. అటువంటి వారిలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఒకరు అని చెప్పక తప్పదు. స్వతహాగా తెలుగు వ్యక్తి కానప్పటికీ కూడా మొదటి నుంచి ఎన్నో తెలుగు సినిమా అవకాశాలు అందుకుని తన అద్భుత నటనతో ప్రేక్షకులను అలరిస్తూ కొనసాగుతున్న ప్రకాష్ రాజ్ ఇప్పటి వరకు కెరీర్లో ఎన్నో సినిమాల్లో ఎన్నో గొప్ప పాత్రలు చేసి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాprakash raj;tollywood;prakash raj;raj;tollywood;cinema;telugu;comedyపాత్ర ఏదైనా .... ఘట్టమేదైనా ..... ఆయన ఉంటె ఆ కిక్కే వేరప్పా .....?పాత్ర ఏదైనా .... ఘట్టమేదైనా ..... ఆయన ఉంటె ఆ కిక్కే వేరప్పా .....?prakash raj;tollywood;prakash raj;raj;tollywood;cinema;telugu;comedyThu, 07 Jan 2021 14:10:33 GMTసినిమా పరిశ్రమకి ఇప్పటి వరకూ ఎంతోమంది నటీనటులు వచ్చారు వెళ్ళారు. అయితే వారిలో కొందరు మాత్రం ప్రేక్షకాభిమానుల మనస్సులో తమదైన ఆకట్టుకునే నటనతో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నారు. అటువంటి వారిలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఒకరు అని చెప్పక తప్పదు. స్వతహాగా తెలుగు వ్యక్తి కానప్పటికీ కూడా మొదటి నుంచి ఎన్నో తెలుగు సినిమా అవకాశాలు అందుకుని తన అద్భుత నటనతో ప్రేక్షకులను అలరిస్తూ కొనసాగుతున్న ప్రకాష్ రాజ్ ఇప్పటి వరకు కెరీర్లో ఎన్నో సినిమాల్లో  ఎన్నో గొప్ప పాత్రలు చేసి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.

నిజానికి ప్రకాష్ రాజ్ తెలుగు సినిమా కెరీర్ లో దాదాపుగా చేయని పాత్ర లేదనే చెప్పాలి. సీరియస్ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కామెడీ విలన్ గా, తండ్రిగా, అన్నయ్యగా, మామయ్య ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా అన్ని రకాల పాత్రలు ఎంతో అద్భుతంగా పోషించిన ప్రకాష్ రాజ్ తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లో కూడా గొప్ప క్రేజ్ ని దక్కించుకున్నారు. ఇక ఏ విషయాన్ని అయినా మొదటినుంచి కుండ బద్దలు కొట్టేలా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే అలవాటున్న ప్రకాష్ రాజ్ అక్కడక్కడా పలు సినిమాల విషయంలో కొద్దిపాటి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు.

ఇక ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు పలు ఇతర భాషల్లో కూడా వరుసగా సినిమా అవకాశాలతో కొనసాగుతూ ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటున్న ప్రకాష్ రాజ్, తాను చేసే పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తారు అనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగులో అందుకే ఆయనకు విలక్షణ నటుడు అనే పేరుంది. మొత్తంగా చెప్పాలి అంటే పాత్ర ఏదైనా, ఘట్టం ఏదైనా దానిలో ప్రకాష్ రాజ్ నటన నభూతో నభవిష్యత్. ఇక ఇటీవల కరోనా సమయంలో ఎందరో పేదవారికి తనవంతుగా సాయమందించి తన గొప్ప మనసు చాటుకున్న ప్రకాష్ రాజ్, రాబోయే రోజుల్లో మరిన్ని గొప్ప పాత్రలు చేసి మనల్ని అందరినీ అలరించాలని కోరుకుంటూ పలువురు ప్రేక్షకులు ఆయనకి అభినందనలు తెలియచేస్తున్నారు......!!


కెజిఎఫ్ విలన్ అసలు ఎవరో తెలుసా?

కొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!

ముఖ్యమంత్రికి షాకిచ్చిన హైకోర్టు.. కేసును కొనసాగించాలని లోకాయుక్తకు ఆదేశం

ఎమ్మెల్సీ ఉప పోరు రెడీ... వైసీపీలో ఆశావాహుల‌ లిస్ట్ పెద్ద‌దే...!

మోదీ హవా తగ్గుతోందా...బీజేపీ కి పాతరోజులు తప్పవా...!

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>