PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/vangavitis-new-politics-will-this-plan-be-successful32e65b0f-821e-40c1-bfa8-6e7164bb4ed2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/vangavitis-new-politics-will-this-plan-be-successful32e65b0f-821e-40c1-bfa8-6e7164bb4ed2-415x250-IndiaHerald.jpgజ‌గ‌న్ దూకుడుకు ఎలా ? బ్రేకులు వేయాలి... జ‌మిలీ ఎన్నిక‌లు వస్తాయా ? జ‌మిలీ ఎన్నిక‌ల‌ను ఎలా ? ఎదుర్కోవాలి.. మ‌ళ్లీ బీజేపీతో జోడీ క‌డ‌దామా? కాపు ఓటు బ్యాంకు కోసం ప‌వ‌న్‌ను మ‌ళ్లీ క‌లిపేసుకుందామా ? ఈ అంశాల చుట్టూనే ప్ర‌స్తుతం ప‌వ‌న్ ఆలోచ‌న‌లు అన్నీ తిరుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే మ‌ళ్లీ బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యేందుకు బాబు వేస్తోన్న ఎత్తులు, ప్ర‌య‌త్నాలు అన్నీ ఇన్నీకావు. ఇక జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను సైతం త‌మ వైపున‌కు తిప్పుకునేందుకు బాబు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టేశార‌ట‌. ఇందుకు కాపు వ‌ర్గానికేvangaveeti radha;tiru;mla;letter;tdp;vangaveeti;dookudu;party;amaravathiపాపం రాధాను చివ‌ర‌కు బాబు అలా వాడుతున్నారా...!పాపం రాధాను చివ‌ర‌కు బాబు అలా వాడుతున్నారా...!vangaveeti radha;tiru;mla;letter;tdp;vangaveeti;dookudu;party;amaravathiThu, 07 Jan 2021 14:20:00 GMTటీడీపీ పూర్తిగా వెన‌క‌ప‌డిపోతోంది. అస‌లు పార్టీకి భ‌విష్య‌త్తు ఉంటుందా ? అన్న సందేహ‌మే చాలా మందిని వేధిస్తోంది. కొంద‌రు సీనియ‌ర్ నేత‌లు ఎవ‌రి దారి వారు చూసుకుంటున్నారు. పార్టీలో ఉన్నోల్లు కూడా ఇప్పుటి నుంచి క‌ష్ట‌ప‌డి ఎందుకు ఇళ్లు.. ఒళ్లు గుళ్ల చేసుకోవ‌డం అన్న‌ట్టుగా నిట్టూర్పు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ప్ర‌స్తుతం చంద్ర‌బాబు ఆలోచ‌న‌లు అన్నీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలా గెల‌వాలి ?  జ‌గ‌న్ దూకుడుకు ఎలా ?  బ్రేకులు వేయాలి... జ‌మిలీ ఎన్నిక‌లు వస్తాయా ?  జ‌మిలీ ఎన్నిక‌ల‌ను ఎలా ?  ఎదుర్కోవాలి.. మ‌ళ్లీ బీజేపీతో జోడీ క‌డ‌దామా?  కాపు ఓటు బ్యాంకు కోసం ప‌వ‌న్‌ను మ‌ళ్లీ క‌లిపేసుకుందామా ? ఈ అంశాల చుట్టూనే ప్ర‌స్తుతం ప‌వ‌న్ ఆలోచ‌న‌లు అన్నీ తిరుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే మ‌ళ్లీ బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యేందుకు బాబు వేస్తోన్న ఎత్తులు, ప్ర‌య‌త్నాలు అన్నీ ఇన్నీకావు. ఇక జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను సైతం త‌మ వైపున‌కు తిప్పుకునేందుకు బాబు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టేశార‌ట‌.
ఇందుకు కాపు వ‌ర్గానికే చెందిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాను ప్ర‌యోగిస్తున్న‌ట్టు తెలుస్తోంది. వంగ‌వీటి రాధా గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో చేరి ఎలాంటి ప్రాధాన్యం లేకుండా ఉన్నారు. ఆయ‌న ఇటీవ‌ల అమ‌రావ‌తి ఉద్య‌మంలో కాస్త యాక్టివ్ అవుతున్నారు. చంద్ర‌బాబు ఇటీవ‌ల రాధాతో మాట్లాడ‌డంతో పాటు జ‌న‌సేన‌తో పొత్తుకు ప్ర‌య‌త్నాలు చేయాల‌ని.. ఇందుకు ప‌వ‌న్‌ను ఒప్పించాల‌ని రాధాకు సూచ‌న‌లు చేసిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుకుంటున్నాయి.

చంద్ర‌బాబు సూచ‌న మేర‌కే ఇటీవ‌ల రాధా నాదెండ్ల మ‌నోహ‌ర్ వ‌ద్ద‌కు వెళ్లార‌ని టాక్‌. మ‌నోహ‌ర్ సైతం ఏపీలో జ‌న‌సేన ఒంట‌రిగా పోటీ చేసినా.. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా బ‌ల‌ప‌డ‌ద‌ని.. టీడీపీతో క‌లిసి వెళితేనే ఎన్నిక‌ల్లో గెలుస్తుద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చేశార‌ట‌. అందుకే ఆయ‌న సైతం టీడీపీతో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగేందుకు ఆస‌క్తితో ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌నోహ‌ర్ నిర్ణ‌యం ఎలా ఉన్నా అంతిమంగా ప‌వ‌న్ ఏం చేస్తారు ? బాబు వంగ‌వీటి అస్త్రం జ‌న‌సేనానిని టీడీపీకి ఎంత వ‌ర‌కు ద‌గ్గ‌ర చేస్తుందో ?  చూడాలి.




ఆ కారణం చేతనే శ్రీదేవి బాలకృష్ణతో కలసి నటించడానికి ఒప్పుకోలేదట!

కొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!

ముఖ్యమంత్రికి షాకిచ్చిన హైకోర్టు.. కేసును కొనసాగించాలని లోకాయుక్తకు ఆదేశం

ఎమ్మెల్సీ ఉప పోరు రెడీ... వైసీపీలో ఆశావాహుల‌ లిస్ట్ పెద్ద‌దే...!

మోదీ హవా తగ్గుతోందా...బీజేపీ కి పాతరోజులు తప్పవా...!

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>