PoliticsSiva Prasadeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jaganmohan-reddy518c89f7-ad74-4906-82e0-b4d97ed1044e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jaganmohan-reddy518c89f7-ad74-4906-82e0-b4d97ed1044e-415x250-IndiaHerald.jpgమధ్యతరగతి ప్రజలకు సొంతింటి కలను నిజం చేస్తామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. మున్సిపల్‌ శాఖతో సీఎం జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఏపీలో పట్టణ, నగర పేదలకు తక్కువ ధరకు ప్లాట్లు, లే అవుట్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. లాభాపేక్ష లేకుండా లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయిస్తామన్నారు. మధ్యతరగతి వారికోసం ఏదైనా చేయాలన్న తపనతోనే ఈ ఆలోచన తీసుకున్నామని జగన్ స్పష్టం చేశారు. మధ్యతరగతి ప్రజలకు క్లియర్‌ టైటిల్‌తో, వివాదాల్లేని ప్లాట్లు ఇస్తామని ప్రకటించారు. jaganmohan reddy;jagan;botcha satyanarayana;chief minister;minister;reddyమధ్యతరగతి ప్రజలకు ప్లాట్లు: సీఎం జగన్‌మధ్యతరగతి ప్రజలకు ప్లాట్లు: సీఎం జగన్‌jaganmohan reddy;jagan;botcha satyanarayana;chief minister;minister;reddyThu, 07 Jan 2021 20:15:21 GMTజగన్ స్పష్టం చేశారు. మధ్యతరగతి ప్రజలకు క్లియర్‌ టైటిల్‌తో, వివాదాల్లేని ప్లాట్లు ఇస్తామని ప్రకటించారు. పాట్లు అందజేయడంపై విధానాలు రూపొందించాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశించారు.
                              పట్టణ, నగరాల్లోని పేదలకు సొంత ఇంటి స్థలం, తద్వారా సొంతింటి కలను నిజం చేసే దిశగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్భన్‌ డవలప్‌మెంట్‌ సెక్రటరీ వై శ్రీలక్ష్మి, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ సహా పలువురు అధికారులతో జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణాలు, నగరాల్లో వైఎస్సార్‌ హయాంలో రాజీవ్‌ స్వగృహ పేరిట గతంలో ఒక కార్యక్రమం జరిగిందని..మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలకు ఫ్లాట్లు ఇవ్వాలన్నది ఆ కార్యక్రమ ఉద్దేశమన్నారు. ఇప్పుడు ఫ్లాట్లకు బదులు వివాదాల్లేని విధంగా, క్లియర్‌ టైటిల్‌తో తక్కువ ధరకు ప్లాట్లు ఇవ్వాలని చెప్పారు. ప్రభుత్వమే లే అవుట్లను అభివృద్ధి చేసి ప్లాట్లను తయారుచేసి లబ్ధిదారులకు కేటాయించాలని సీఎం సూచించారు.
                                   ప్రైవేటు వ్యక్తుల వద్ద స్థలాలు కొనుక్కుంటున్న వారికి అనేక ఆందోళనలు ఉన్నాయన్నారు. సరైన టైటిల్‌ ఉందా? అన్నిరకాల అనుమతులు ఉన్నాయా? లేవా? అనే భయాలు ప్రజలకు కలుగుతున్నాయని సీఎం జగన్ చెప్పారు. లే అవుట్ల అభివృద్ధిని ప్రభుత్వమే చేపడితే అలాంటి ఆందోళనలు, భయాలు ఉండవన్నారు. వివాదాలు లేకుండా, క్లియర్‌ టైటిల్స్‌ తో కూడిన ఇంటి స్థలాలు, ప్రభుత్వం లాభాపేక్షలేకుండా వ్యవహరించడం వల్ల తక్కువ ధరకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు ఈ ప్లాట్లను అందించాలని జగన్ తెలిపారు. మధ్యతరగతి ప్రజలకోసం కూడా ఏదైనా చేయాలన్న తపనతో ఈ ఆలోచన వచ్చిందని జగన్ వివరించారు.


పంత్‌పై వేటు తప్పదా..?

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?

ఎమ్మెల్యేలను పిలుస్తున్న జగన్... షాక్ ఇస్తారా...?

వైసీపీతో స్నేహం చేసే నేతల మీద బిజెపి సీరియస్...?

షాకింగ్ న్యూస్.. తుమ్మితే ఎముకలు విరిగాయి..!

రేవంత్ అయితేనే బెస్ట్... అధిష్టానానికి లేఖ రాసారా...?

ఏపీ: కోనసీమలో కోడి పందాలకు సై..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Siva Prasad]]>