PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan5d66ce6d-c364-4e4b-a55b-26574fcb385c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan5d66ce6d-c364-4e4b-a55b-26574fcb385c-415x250-IndiaHerald.jpgఆలయాల రక్షణపై ప్రభుత్వం తన వైఖరి వెల్లడించాలి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు. కమీషన్లు వచ్చే కాంట్రాక్ట్ పనులపైనే కాదని అన్నారు. సి.సి.కెమెరాల ఏర్పాటుపైనా దృష్టిపెట్టాలి అని సూచించారు. ఆలయాల ఆస్తులు, విగ్రహాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వ చర్యల పై ఎలాంటి స్పష్టత లేదు అని మండిపడ్డారు. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన సమయంలోనే అన్ని ఆలయాలలో సి.సి.కెమెరాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు అని అన్నారు. ఇప్పుడు రామతీర్థంలో శ్రీ కోదండరామ స్వామి విగ్రహం తల నరికిన దుస్సంఘటన తరవాత అదే మాట చెబుతున్నారు pavan kalyan,jansena,ap;pawan;dharma;kalyan;vijayawada;janasena;temple;janasena party;rama tirthaఏపీలో 26 వేల దేవాలయాలకు సీసీ కెమెరాలు ఉన్నట్టేనా...?ఏపీలో 26 వేల దేవాలయాలకు సీసీ కెమెరాలు ఉన్నట్టేనా...?pavan kalyan,jansena,ap;pawan;dharma;kalyan;vijayawada;janasena;temple;janasena party;rama tirthaThu, 07 Jan 2021 16:00:00 GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు. కమీషన్లు వచ్చే కాంట్రాక్ట్ పనులపైనే కాదని అన్నారు.  సి.సి.కెమెరాల ఏర్పాటుపైనా దృష్టిపెట్టాలి  అని సూచించారు. ఆలయాల ఆస్తులు, విగ్రహాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వ చర్యల పై ఎలాంటి స్పష్టత లేదు అని మండిపడ్డారు. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన సమయంలోనే అన్ని ఆలయాలలో సి.సి.కెమెరాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు అని అన్నారు. ఇప్పుడు రామతీర్థంలో శ్రీ కోదండరామ స్వామి విగ్రహం తల నరికిన దుస్సంఘటన తరవాత అదే మాట చెబుతున్నారు అని విమర్శించారు.

రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలో సుమారు 26వేల ఆలయాలు ఉన్నాయి అని ఆయన అన్నారు.  అందులో ఎన్ని ఆలయాలకు సి.సి.కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు? అనేది ప్రశ్నార్థకమే అని అన్నారు.  ఆలయాలే ఆ కెమెరాలను, పర్యవేక్షణను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం చెబుతుండటం సరికాదు అని ఆయన సూచించారు.  సి.సి. కెమెరాలను ఆలయాలే ఏర్పాటు చేసుకోవాలనడం బాధ్యతను విస్మరించడమే అని విమర్శించారు. గత ప్రభుత్వ కాలంలో కూల్చినవాటిని కడుతున్నామని అంటున్నారని అన్నారు.

ఈ పాలక పక్షం గత 18 నెలలుగా ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదు అని నిలదీసారు.  విగ్రహాల ధ్వంసం ఘటనల క్రమంలోనే ప్రభుత్వం విజయవాడలో ఆలయాల పునర్నిర్మాణం అంటోంది అని, విజయవాడ దుర్గ గుడి అభివృద్ధికి రూ.70 కోట్లు కేటాయించి పనులు మొదలుపెడతామన్నారు అని ఆయన ఆరోపించారు. ఆలయాల పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు ప్రభుత్వ విధి నిర్వహణలో భాగమే అన్నారు. వారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చేస్తున్న పనులుగా వాటిని చూడలేము అని వ్యాఖ్యానించారు. కాంట్రాక్టుల్లో వచ్చే కమీషన్ల మీదపెట్టే శ్రద్ధ రాష్ట్రవ్యాప్తంగా 26వేల ఆలయాలకు సి.సి.కెమెరాలు ఏర్పాటు మీదా దృష్టిపెట్టాలి అని సూచించారు. లేదంటే ఈ ప్రభుత్వం కేవలం ప్రకటనలకు, ప్రచారానికి మాత్రమే సి.సి. కెమెరాలు అనే మాట చెబుతుందని భావించాల్సి వస్తుంది అని అన్నారు.


ఏ కారణం చేత ఉదయ్ కిరణ్ ఆ సినిమాలను వదులుకున్నాడు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

బీజేపీలో షాడో వైసీపీ నేత‌.. జీవీఎల్‌పై కామెంట్లు నిజ‌మేనా...?

అర్జెంట్ గా గవర్నర్ వద్దకు టీడీపీ నేతలు... ఎందుకు...?

ఫోన్ పే అదిరిపోయే ఆఫర్.. కేవలం 149 రూపాయలతో..?

వెలంప‌ల్లి కోరితెచ్చుకున్న క‌ష్టాలు.. పొంచి ఉన్న ప‌ద‌వీ గండం..!

కెజిఎఫ్ విలన్ అసలు ఎవరో తెలుసా?

కొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>