Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/aadipurush238a7898-4945-4caf-b8d8-2fa7d642169c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/aadipurush238a7898-4945-4caf-b8d8-2fa7d642169c-415x250-IndiaHerald.jpgబాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్‌లో రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్న ప్రభాస్ బాలీవుడ్‌లోనూ ఓ సినిమా సైన్ చేశాడు. రామాయణం ఆధారంగా ఓం రవుత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో..aadipurush;beauty;prabhas;nag ashwin;prasanth;prashanth neel;ramu;india;bollywood;cinema;naga aswin;jil;love;interview;director;thriller;hero;prasanth neel;vemuri radhakrishna;prashant kishor‘ఆదిపురుష్’ అతడే.. లేకపోతే సినిమానే వద్దు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్‘ఆదిపురుష్’ అతడే.. లేకపోతే సినిమానే వద్దు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్aadipurush;beauty;prabhas;nag ashwin;prasanth;prashanth neel;ramu;india;bollywood;cinema;naga aswin;jil;love;interview;director;thriller;hero;prasanth neel;vemuri radhakrishna;prashant kishorThu, 07 Jan 2021 10:10:00 GMTఇంటర్నెట్ డెస్క్: బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్‌లో రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్న ప్రభాస్ బాలీవుడ్‌లోనూ ఓ సినిమా సైన్ చేశాడు. రామాయణం ఆధారంగా ఓం రవుత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. దీంతో మిగతా సినిమాలతో పోల్చితే ఈ సినిమాకు మరింత బూస్ట్ లభిస్తోంది. ఈ సినిమా గురించి ఏ వార్త వచ్చినా అది సెన్సేషన్ అవుతోంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.300 కోట్ల వరకు ఉండబోతోందని అంచనా. ఈ నేపథ్యంలోనే ఓం రవుత్ ప్రభాస్ గురించి, ఆదిపురుష్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఓం రవుత్.. ఈ సినిమా ఆలోచన రాగానే తన మైండ్‌లో ప్రభాస్ మాత్రమే కనపడ్డాడని, అతడే తన సినిమాలో హీరో అని ఫిక్స్ అయిపోయానని చెప్పాడు. ఒకవేళ ప్రభాస్ ఈ సినిమాను ఒప్పుకోకపోయిఉంటే ఆదిపురుష్ అనే సినిమానే ఉండేది కాదంటూ షాక్ ఇచ్చాడు. ‘ప్రభాస్ నో అనిఉంటే ఆదిపురుష్ స్క్రిప్ట్ పక్కన పెట్టేసి వేరే సినిమాలు చేసుకునేవాడిని' అంటూ ఓం రవుత్ సంచలన కామెంట్స్ చేశాడు.

ఈ మాటలతో ప్రభాస్‌ అభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు. ఓ బాలివుడ్ డైరెక్టర్‌కు తమ అభిమాన నటుడు ప్రభాస్‌పై ఇంత నమ్మకం ఉంచడంతో సంబరపడిపోతున్నారు.అంతే కాదు ఈ సినిమాతో తమ ప్రియతమ నటుడు పాన్ ఇండియా స్థాయి నుంచి పాన్ వరల్డ్ స్థాయికి వెళ్లిపోతాడని అంటున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం తెరకెక్కుతున్న రాధేశ్యామ్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. పీరియాడిక్ లవ్ స్టోరీగా రెడీ అవుతున్న రాధేశ్యామ్ ఈ ఏడాది విడుదల అవుతుందని అంచనా. ఈ సినిమాపై ఇప్పటికే ప్రభాస్ లుక్స్, పోస్టర్స్ మూవీపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. దీని తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఓ భారీ యాక్షన్ థిల్లర్‌ సినిమాలో నటించనున్నాడు. ఫుల్లీ యాక్షన్ ప్యాక్‌డ్ సినిమాగా రూపొందనున్న ఈ సినిమాలో ప్రభాస్.. సలార్‌గా కనిపించనున్నాడు.

సినిమా కూడా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా రూపొందనుంది. వీటితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమాలోనూ ప్రభాస్ చేయనున్నాడు. ఈ చిత్రం కూడా పాన్ ఇండియా మూవీగానే తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే హీరోయిన్‌‌‌గా కనిపించనుంది.


చంద్రబాబు ముందు అదొక్కటే మార్గం ఉందా...?

బీజేపీలో షాడో వైసీపీ నేత‌.. జీవీఎల్‌పై కామెంట్లు నిజ‌మేనా...?

అర్జెంట్ గా గవర్నర్ వద్దకు టీడీపీ నేతలు... ఎందుకు...?

ఫోన్ పే అదిరిపోయే ఆఫర్.. కేవలం 149 రూపాయలతో..?

వెలంప‌ల్లి కోరితెచ్చుకున్న క‌ష్టాలు.. పొంచి ఉన్న ప‌ద‌వీ గండం..!

కెజిఎఫ్ విలన్ అసలు ఎవరో తెలుసా?

కొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>