PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mlac044597b-bde2-475c-8b40-829963be99e7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mlac044597b-bde2-475c-8b40-829963be99e7-415x250-IndiaHerald.jpgఏపీలో కొద్దిరోజులుగా చోటు చేసుకున్న మత రాజకీయాలపై లొల్లి కొనసాగుతూనే ఉంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పాత్ర ఉంది తప్పు అంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుండగా, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పాత్ర ఎక్కువగా ఉందని, వారే ఈ విగ్రహాల రాజకీయాలకు పాల్పడుతున్నారు అంటూ వైసీపీ నాయకులు ఫైర్ అవుతున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు సైతం ఎప్పుడూ లేని విధంగా నుదుట బొట్టు పెట్టి మరి హిందూ ఇజానికి బ్రాండ్ అంబాసిడర్ తానే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇక టిడిపి నేతలు ఎక్కువగా ఈ మత పరమైన విమర్శలు చేస్తూ ,ysrcp ap tdp cbn rk roja chandrababu;auto;cbn;telugu desam party;roja;jagan;telugu;mla;letter;tdp;ycp;ayyappa;nagari;party;mantraమత రాజకీయాలపై వైసిపి లేడీ ఫైర్ బ్రాండ్ ఫైర్ ?మత రాజకీయాలపై వైసిపి లేడీ ఫైర్ బ్రాండ్ ఫైర్ ?ysrcp ap tdp cbn rk roja chandrababu;auto;cbn;telugu desam party;roja;jagan;telugu;mla;letter;tdp;ycp;ayyappa;nagari;party;mantraThu, 07 Jan 2021 19:19:33 GMTఏపీలో కొద్దిరోజులుగా చోటు చేసుకున్న మత రాజకీయాలపై లొల్లి కొనసాగుతూనే ఉంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పాత్ర ఉంది తప్పు అంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుండగా,  ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పాత్ర ఎక్కువగా ఉందని, వారే ఈ విగ్రహాల రాజకీయాలకు పాల్పడుతున్నారు అంటూ వైసీపీ నాయకులు ఫైర్ అవుతున్నారు.
 టిడిపి అధినేత చంద్రబాబు సైతం ఎప్పుడూ లేని విధంగా నుదుట బొట్టు పెట్టి మరి హిందూ ఇజానికి  బ్రాండ్ అంబాసిడర్ తానే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇక టిడిపి నేతలు ఎక్కువగా ఈ మత పరమైన విమర్శలు చేస్తూ , ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని,  అదే పనిగా వైసీపీ మంత్రులు,  ఎమ్మెల్యేల పై మండిపడుతూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. వైసీపీ లేడీ ఫైర్ బ్రాండ్ , నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా టిడిపి అధినేత చంద్రబాబును ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు.




 గతంలో వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చా రని, అందుకే చంద్రబాబు ఆయన పార్టీ ఇంతగా పతనం అయ్యారు అంటూ మండిపడ్డారు. ఆయన పాలనలో విజయవాడలో గుళ్ళు కొల్లగొట్టి టాయిలెట్లు కట్టారు.. అందుకే ఈ రోజు ఇంత పతనమయ్యారు అంటూ మండిపడ్డారు. చంద్రబాబుకు బుద్ధి లేకుండా ఇప్పుడు రాజకీయాలు మొదలు పెట్టారు. దేవాలయాల భద్రత కోసం 20వేల సిసి కెమెరాలు పెట్టాం. చంద్రబాబు తన పాలనలో ఇలా ఎందుకు చేయలేదు..? అయ్యప్ప మాల వేస్తే మద్యం ఆదాయం తగ్గిపోతుంది అనే వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. 



 " చంద్రబాబు హయాంలో ఆలయాలను కూల్చి టాయిలెట్లు కట్టారు. డీజీపీ మతం గురించి మాట్లాడుతున్న చంద్రబాబు... గతంలో సి పి గా పెట్టలేదా ? ఇప్పుడు పని చేస్తున్న అధికారులు అంతా చంద్రబాబు హయాంలో ఉన్నవారే కదా ! సీఎం వైఎస్ జగన్ అధికారులను కొత్తగా తెచ్చారా ? చంద్రబాబు చేయని ఆలయ అభివృద్ధి నిర్మాణాలను సీఎం జగన్ చేస్తున్నారు అంటూ  బాబు తీరుపై రోజా తీవ్రంగా మండిపడ్డారు.



నీరవ్ మోదీ కథ ముగిసినట్లేనా.. అప్రూవర్‌గా మారిన సోదరి

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?

ఎమ్మెల్యేలను పిలుస్తున్న జగన్... షాక్ ఇస్తారా...?

వైసీపీతో స్నేహం చేసే నేతల మీద బిజెపి సీరియస్...?

షాకింగ్ న్యూస్.. తుమ్మితే ఎముకలు విరిగాయి..!

రేవంత్ అయితేనే బెస్ట్... అధిష్టానానికి లేఖ రాసారా...?

ఏపీ: కోనసీమలో కోడి పందాలకు సై..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>