TVMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/karthika-deepam-hima920ec86b-7c49-4005-b956-79e1e2481039-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/karthika-deepam-hima920ec86b-7c49-4005-b956-79e1e2481039-415x250-IndiaHerald.jpgకార్తీక దీపం సీరియల్ గురించి అందులో నటించే వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పవలిసిన పని లేదు. ఎందుకంటే ఆ సీరియల్ లో ఎవరి పాత్రకు వారు 100% న్యాయం చేస్తున్నారు కాబట్టి. పెద్దవాళ్ళ దగ్గర నుండి అందులో నటించే ఇద్దరు కవల పిల్లల వరకు అందరు ఆ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ఇన్వాల్వ్ అయ్యి మరి నటిస్తారు. karthika deepam hima;karthik;deepa;jeevitha rajaseskhar;kranthi;kranti;tara;makar sakranti;sankranthi;girl;star maa;father;nijam;partyసీరియల్ లో కష్టాలు ఉన్నట్టు.. నిజజీవితంలో కూడా హిమ కు కష్టాలు తప్పవా.. !!సీరియల్ లో కష్టాలు ఉన్నట్టు.. నిజజీవితంలో కూడా హిమ కు కష్టాలు తప్పవా.. !!karthika deepam hima;karthik;deepa;jeevitha rajaseskhar;kranthi;kranti;tara;makar sakranti;sankranthi;girl;star maa;father;nijam;partyThu, 07 Jan 2021 12:01:39 GMTదీప క‌వ‌ల పిల్ల‌ల్లో చిన్న‌దైన హిమ‌ను పుట్టిన‌ప్పుడే వాళ్ళ నానమ్మ  తల్లి దగ్గర నుంచి దూరం చేసి అనాథ అని చెప్పి తండ్రి అయిన కార్తీక్ కు ద‌గ్గ‌ర‌ చేస్తుంది. హిమ తన కూతురే అనే విషయం తెలియక హిమను కన్నకూతురుగా చూసుకుంటూ తన మీదే ప్రాణాలు పెట్టుకుంటాడు.  

అయితే సౌర్య తో పాటు హిమ కూడా దీప బిడ్డ అని తెలిసిన కార్తీక్.. షాక్ అవుతాడు.  త‌న బిడ్డ‌ను తానే తీసుకుపోతానంటూ దీప, హిమ‌ను తీసుకెళ్తుంది. ప్ర‌స్తుతం హిమ‌, దీప ద‌గ్గ‌రే ఉంటోంది.కొన్నాళ్ల పాటు నాన్న దగ్గర ఉన్న హిమ ఇప్పుడు అమ్మ పంచన చేరుతుంది.  ఇలా ఈ సీరియ‌ల్‌లో హిమ పుట్టిన‌న‌ప్పుడు కన్న తల్లికి  దూరంగా.. ఇప్పుడు పెంచిన నాన్న‌కు దూరంగా ఉంటుంది. అయితే మన అందరికి తెలియని విషయం ఏంటంటే నిజ జీవితంలో కూడా హిమ అలాంటి అనుభవాల్ని ఎదుర్కొంది అంట. వివరాలలోకి వెళితే.. తాజాగా స్టార్ మా విడుద‌ల చేసిన సంక్రాంతి స్పెష‌ల్ ప్రోగ్రామ్‌ ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ ప్రోమోలో హిమ గురించిన ఆసక్తికర విషయాలు తెలిసాయి. హిమ అస‌లు పేరు బేబీ స‌హృద. అయితే ఈ పార్టీలో భాగంగా హిమ అసలు తల్లి వస్తుంది.హిమ వాళ్ళ అమ్మ రావడం చూసి ప్రేమగా దగ్గరకు వెళ్లి కౌగలించుకుంటుంది.

అప్పుడు హిమ వాళ్ళ అమ్మ... తన కూతుర్ని చూసి... భావోద్వేగానికి గురి అయ్యి..  చిన్న‌ప్పుడు హిమ  పుట్టిన‌ప్పుడు,  పుట్టింది ఆడపిల్ల అని తెలిసి వాళ్ల నాన్న హిమను  చూడ‌టానికి కూడా రాలేద‌ట‌. ఈ విష‌యాన్ని స్వయంగా  స‌హృద త‌ల్లి చెప్పింది. దాంతో ఆమె కంటతడి పెట్టింది. తల్లితో పాటు సహృద కూడా ఏడిచేసింది. ఒక్క  స‌హృద మాత్ర‌మే కాదు అక్కడ ఉన్న అంద‌రూ ఆ మాటలు విని  ఎమోష‌న‌ల్ అవుతారు. ఆ తరువాత అక్కడ ఉన్నవారు అందరు సహృదను, వాళ్ళ అమ్మను ఓదార్చుతారు. తరువాత యాంకర్ ర‌వి మాట్లాడుతూ.. కూతురు అంటే "టెన్ష‌న్ "కాదు.. కూతురు అంటే "టెన్.. సన్స్" తో  స‌మానం అని చెబుతాడు. సీరియల్ లో మాత్రమే హిమకు కష్టాలు కాదు... నిజ జీవితంలో కూడా కష్టాలే అనుభవిస్తుంది.. ఈ ప్రోగ్రామ్ ను ఇప్పుడు సహృద తండ్రి కనుక చుస్తే నిజంగా న కూతురు బంగారం అని అనుకోకుండా ఉండలేడు. !!


ట్రంప్ ప్రవర్తనతో..అట్టుడుకుతున్న అమెరికా !!

కొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!

ముఖ్యమంత్రికి షాకిచ్చిన హైకోర్టు.. కేసును కొనసాగించాలని లోకాయుక్తకు ఆదేశం

ఎమ్మెల్సీ ఉప పోరు రెడీ... వైసీపీలో ఆశావాహుల‌ లిస్ట్ పెద్ద‌దే...!

మోదీ హవా తగ్గుతోందా...బీజేపీ కి పాతరోజులు తప్పవా...!

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>