- Poorna Starrer Back Door Movie Shoot Completed (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న విభిన్న కథాచిత్రం 'బ్యాక్ డోర్'. ప్రముఖ కథానాయకి పూర్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ వినూత్న కథా చిత్రాన్ని.. 'ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్' పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. యువ కథానాయకుడు తేజ త్రిపురణ మరో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. హైద్రాబాద్, ఫిల్మ్ నగర్ లోని దుబాయ్ హౌస్ లో ఈ చిత్రం షూటింగ్ కి గుమ్మడి కాయ కొట్టారు.
దర్శకుడు కర్రి బాలాజీ మాట్లాడుతూ.. "పూర్ణ కెరీర్ లో చాలా డిఫరెంట్ ఫిల్మ్ "బ్యాక్ డోర్". ఓ స్త్రీ తన కంటే వయసులో చిన్నవాడితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్ల ఎదురయ్యే పరిణామాల నేపథ్యంలో సాగే చిత్రమిది. పూర్ణ పెర్ఫార్మెన్స్ 'బ్యాక్ డోర్" చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది" అని అన్నారు.
'ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్' అధినేత బి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... 'దర్శకుడిగా బాలాజీకి చాలా మంచి పేరు తెచ్చే చిత్రం '"బ్యాక్ డోర్". నటీనటులు, సాంకేతిక నిపుణుల నుంచి బాలాజీ మంచి అవుట్ పుట్ రాబట్టుకుంటున్నారు" అని వివరించారు.
హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ.. "నేను పని చేసిన దర్శకుల్లో బాలాజీగారు వన్ ఆఫ్ ది బెస్ట్. ప్రతి సీన్ ఎంతో ప్లానింగ్ తో, క్లారిటీతో తీస్తున్నారు. హీరోయిన్ గా నాకు, దర్శకుడిగా బాలాజీ గారికి మంచి పేరుతోపాటు... ఎంతో పేషన్ తో "బ్యాక్ డోర్" చిత్రం నిర్మిస్తున్న మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ రెడ్డి గారికి బోలెడు డబ్బు తెచ్చే చిత్రమిది" అని అన్నారు.
ఈ చిత్రానికి పోస్టర్ డిజైన్: రమేష్, కొరియోగ్రఫీ: రాజ్ కృష్ణ, పాటలు: జావళి, చాందిని, సంగీతం: ప్రణవ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్, ఆర్ట్: నాని, ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ, లైన్ ప్రొడ్యూసర్: రేఖ, కో-ప్రొడ్యూసర్: ఊట శ్రీను, నిర్మాత: బి.శ్రీనివాస్ రెడ్డి, రచన-దర్శకత్వం: కర్రి బాలాజీ!!