PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/similarities-between-eluru-and-vizag-incidentfaf4b717-d641-4203-898c-106fb7714c0a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/similarities-between-eluru-and-vizag-incidentfaf4b717-d641-4203-898c-106fb7714c0a-415x250-IndiaHerald.jpgఏలూరులో వింత వ్యాధికి కూరగాయలే కారణం అని ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ స్పష్టం చేసింది. వివిధ సంస్థల నివేదికలు పరిశీలించి నిర్ధారణకు వచ్చిన ఉన్నతస్థాయి కమిటీ... నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. కూరగాయల్లో ఉన్న ఆర్గానో క్లోరైడ్స్ వలనే వింత వ్యాధి లక్షణాలు అని పేర్కొన్నారు. పాలు, తాగునీరు కలుషితం అయినా.. కలుషితం పరిమితమే అని వ్యాఖ్యానించారు. ఏలూరు కృష్ణా కాల్వ కాలుష్య రహితంగా మార్చడానికి కమిటీ పలు సూచనలు చేసారు. గత నెల 4 వ తేదీ నుంచి 12 వ తేదీ వరకు 622 మందికి వింత వ్యాధి సోకగా.. ఒకరు eluru,ap;ashok;krishna river;andhra pradesh;district;aqua;tdp;central government;eluru;v;mantraఏలూరు ఘటనకు కారణం చెప్పేసిన కమిటీ...!ఏలూరు ఘటనకు కారణం చెప్పేసిన కమిటీ...!eluru,ap;ashok;krishna river;andhra pradesh;district;aqua;tdp;central government;eluru;v;mantraThu, 07 Jan 2021 15:45:00 GMTకృష్ణా కాల్వ కాలుష్య రహితంగా మార్చడానికి కమిటీ పలు సూచనలు చేసారు. గత నెల 4 వ తేదీ నుంచి 12 వ తేదీ వరకు 622 మందికి వింత వ్యాధి సోకగా.. ఒకరు మృతి చెందారు.

 దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. ఏలూరు వింత వ్యాధికి కారణం కూరగాయల్లోని అవశేషాలేననే నిర్ధారణకు ప్రభుత్వం ఎలా వస్తుంది? అని నిలదీశారు. కూరగాయల వల్లే వ్యాధి తలెత్తిందని చెప్పడం ద్వారా ప్రభుత్వం అసలు వాస్తవాలను తొక్కిపెట్టాలని చూస్తోంది అని విమర్శించారు. నీటి ద్వారానే వ్యాధి తలెత్తిందని, నీటిలో నికెల్ వంటి రసాయయనాలున్నాయని కేంద్ర ప్రభుత్వ సంస్థలు చెబితే, వాటిని వేదికను ప్రభుత్వం ఎందుకు పక్కన పెట్టాలని చూస్తోంది అని మండిపడ్డారు.

ఎయిమ్స్, సీసీఎంబీ, ఎన్ఐఎన్ వంటి సంస్థల నివేదికలను ఏపీ ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయడం లేదు అని ప్రశ్నించారు. కూరగాయలే కారణమంటే అవే కూరగాయలను జిల్లా ప్రజలంతా తింటున్నప్పుడు, ఏలూరు ప్రాంతంలోనే బాధితులు ఎందుకున్నారో సమాధానం చెప్పాలి అని ఆయన ప్రశ్నించారు. కూరగాయలను సాకుగా చూపి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తే, దాని వల్ల రైతులు కూడా నష్టపోతారనే వాస్తవాన్ని పాలకులు ఎందుకు గుర్తించరు? అని నిలదీశారు. సమస్య మూలాలను గుర్తించకుండా, తూతూ మంత్రంగా విచారణ జరిపి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తే, భవిష్యత్ లో మరిన్ని సమస్యలు కొని తెచ్చుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం అని ఆయన అన్నారు.


ప్రభుదేవాతో విడిపోవడానికి గల కారణానికి క్లారిటీ ఇచ్చిన నయనతార!

బీజేపీలో షాడో వైసీపీ నేత‌.. జీవీఎల్‌పై కామెంట్లు నిజ‌మేనా...?

అర్జెంట్ గా గవర్నర్ వద్దకు టీడీపీ నేతలు... ఎందుకు...?

ఫోన్ పే అదిరిపోయే ఆఫర్.. కేవలం 149 రూపాయలతో..?

వెలంప‌ల్లి కోరితెచ్చుకున్న క‌ష్టాలు.. పొంచి ఉన్న ప‌ద‌వీ గండం..!

కెజిఎఫ్ విలన్ అసలు ఎవరో తెలుసా?

కొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>