PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modhee-govt-in-struggles0d7bc85a-ce92-45ad-8935-199efe82c98f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modhee-govt-in-struggles0d7bc85a-ce92-45ad-8935-199efe82c98f-415x250-IndiaHerald.jpgమోడీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో జరిగిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి ఘోరంగా పరాజయం పాలవడం ఇందుకు నిదర్శనం అంటున్నారు. వాటిలో..ఒకటి గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీకాగా.. మరొకటి టీచర్స్ ఎమ్మెల్సీ. ఈ రెండు విద్యావంతులకు సంబంధించినవే..modhee govt in struggles;modi;varanasi;bharatiya janata party;india;haryana - chandigarh;narendra modi;prime minister;local languageమోదీ హవా తగ్గుతోందా...బీజేపీ కి పాతరోజులు తప్పవా...!మోదీ హవా తగ్గుతోందా...బీజేపీ కి పాతరోజులు తప్పవా...!modhee govt in struggles;modi;varanasi;bharatiya janata party;india;haryana - chandigarh;narendra modi;prime minister;local languageThu, 07 Jan 2021 09:00:00 GMTమోడీ హవా తగ్గుతోందా... తన నియోజక వర్గంలోనే ఆయనపై వ్యతిరేకత మొదలైపోయిందా..?? రానున్న రోజుల్లో మోడీ సారథ్యంలో నడుస్తున్న బిజెపి బలం తగ్గనుందా.. ? అంటే..!! నిజమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనికి కారణం లేకపోలేదు. మోడీ భారతదేశంలో అత్యధిక ఓట్ల మెజారిటీతో ప్రధానమంత్రి అయ్యారంటే అందుకు ముఖ్య కారణం ఉత్తర భారత ప్రజల అన్న విషయం అందరికీ తెలిసిందే. ఉత్తర భారతదేశంలో ఆయనకున్న పొలిటికల్ ఫాలోయింగ్ అలాంటిది. కానీ ఇప్పుడది మెల్లమెల్లగా తగ్గుతోంది. ఆ ప్రాంతంలో మోడీ జోరుకు బ్రేకులు పడుతున్నాయి.

మోడీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో జరిగిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో  బిజెపి ఘోరంగా పరాజయం పాలవడం ఇందుకు నిదర్శనం అంటున్నారు. వాటిలో..ఒకటి గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీకాగా.. మరొకటి టీచర్స్ ఎమ్మెల్సీ. ఈ రెండు విద్యావంతులకు సంబంధించినవే..  అలాంటిది ఈ రెండు ఎన్నికల్లోనూ బిజెపి పరాజయం పాలవడం చూస్తుంటే.. విద్యావంతుల్లో మోడీపై వ్యతిరేకత మొదలైనట్లు తెలుస్తోంది. ఆయన హవా ఇక్కడ సాగడం లేదని అర్థమవుతోంది. ఏకంగా వారణాసి ఎన్నికల్లో ఇంత దారుణంగా మోడీ ఓడిపోవడం చూస్తుంటే... భవిష్యత్తులో 2023 లో బీజేపీ పరిస్థితి ఏంటి..??  2023 ఎన్నికల్లో బిజెపికి ఓటమి తప్పదా..?? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి..!

ఇటు మహారాష్ట్రలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ ఓడిపోవడం మోడీ కి పెద్ద షాక్ తగిలినట్లయింది. మరోవైపు హర్యానా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తాజాగా బీజేపీ ఓటమిని ఎదుర్కోవడం గమనార్హం... ఇలా మెల్లమెల్లగా మోడీ వేవ్ తగ్గుతుందనే చెప్పాలి. ఇక దుబ్బాక ఎన్నికలతో తెలంగాణలో బలం పెంచుకుంటున్న బిజెపి... ఆతర్వాత గ్రేటర్ ఎన్నికలతో తన సత్తా చాటింది.... కానీ ఇప్పుడు ఉత్తర భారతదేశంలో మోడీ పాలనలో ముందుకు నడుస్తున్న బీజేపీకి అడుగడుగునా బ్రేకులు పడడం చూస్తుంటే.... ఆ ప్రభావం ఇక్కడ తెలంగాణలోను పడేలా ఉంది అంటున్నారు. మోడీని నెత్తిన పెట్టుకున్న ఉత్తర భారత ప్రజల్లోనే ఆయన పై వ్యతిరేకత మొదలు అవుతుంటే.... ఇక రానురాను తెలంగాణలోనూ బిజెపికి అదే పరిస్థితి ఎదురవుతుంది అని అంచనా వేస్తున్నారు రాజకీయ మేధావులు. మరి మోడీ మరింత ముందుచూపుతో సమస్యలన్నింటినీ చక్క పెడతారో లేక కాలంతో రాజీ పడతారో చూడాలి.


రెండు ముక్కలైన యువకుడు.. సగం శరీరంతోనే 12 గంటలు..

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?

ఐ లవ్ యూ అంటూ ఆ ఫొటోను పోస్ట్ చేసిన రష్మిక

కొడాలి నాని నీకే చెబుతున్నా.. సహనాన్ని పరీక్షించొద్దు: నందమూరి బాలకృష్ణ

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>