PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mlacdb66843-a4a2-4b61-8eea-1495da696ad7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mlacdb66843-a4a2-4b61-8eea-1495da696ad7-415x250-IndiaHerald.jpgవైసీపీకి ద‌క్కుతుంద‌న‌డంలో సందేహం లేదు. అయితే.. వైసీపీ నేత‌లు ఈ స్తానం ద‌క్కించుకునేందుకు భారీ సంఖ్య‌లో పోటీకి రెడీ అయ్యారు. ఇప్ప‌టికే సీఎం జ‌గ‌న్ కొంద‌రికి హామీ ఇచ్చి ఉండ‌డంతో వారికి ఈ సీటు ద‌క్కుతుందా? అనే ప్ర‌చారం జ‌రుగుతోంది. అదేస‌మ‌యంలో ఈ సీటుకు రాజీనామా చేసిన పోతుల సునీత కూడా ఆశలు పెట్టుకున్నారు. గ‌తంలో టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద‌రావు.. ఆ పార్టీకి రాజీనామా చేసి.. వైసీపీలో చేరిన‌ప్పుడు.. ఇలానే ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జ‌రిగింది. ఆ స‌మ‌యంలో డొక్కాకే జ‌గ‌న్ ysrcp;tiru;pothula suneetha;రాజీనామా;tirupati;mla;husband;letter;tdp;central government;ycp;dokka manikyavaraprasadఎమ్మెల్సీ ఉప పోరు రెడీ... వైసీపీలో ఆశావాహుల‌ లిస్ట్ పెద్ద‌దే...!ఎమ్మెల్సీ ఉప పోరు రెడీ... వైసీపీలో ఆశావాహుల‌ లిస్ట్ పెద్ద‌దే...!ysrcp;tiru;pothula suneetha;రాజీనామా;tirupati;mla;husband;letter;tdp;central government;ycp;dokka manikyavaraprasadThu, 07 Jan 2021 09:44:43 GMTమ‌రోసారి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌కు రంగం సిద్ధ‌మైంది. ఈ నెల 28న ఉప ఎన్నిక నిర్వ‌హించేందుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ ప్ర‌క‌టించింది. నామినేష‌న్లు, ఉప‌సంహ‌ర‌ణ‌, ఎన్నిక‌ల తేదీల‌ను వెల్ల‌డిస్తూ.. తాజాగా షెడ్యూల్ విడుద‌ల చేసింది. టీడీపీ మాజీ నాయ ‌కురాలు.. ఫైర్ బ్రాండ్ నేత‌.. పోతుల సునీత‌.. కొన్నాళ్ల కింద‌ట ఈ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయి న ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వ‌హించేందుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం రెడీ  అయింది. ఎమ్మెల్యే కోటాలో ఈ సీటును భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ నెల 18న నామినేష‌న్ల‌కు గ‌డువు ఇచ్చారు. 19న ఉప‌సంహ‌ర‌ణ‌కు అవ‌కాశం క‌ల్పించారు. 28న ఎన్నిక, అదే రోజు లెక్కింపు జ‌ర‌గ‌నుంది.

ఇదిలావుంటే.. ఎమ్మెల్యేలు అధిక సంఖ్య‌లో ఉన్నందున ఈ స్థానం.. వైసీపీకి ద‌క్కుతుంద‌న‌డంలో సందేహం లేదు. అయితే.. వైసీపీ నేత‌లు ఈ స్తానం ద‌క్కించుకునేందుకు భారీ సంఖ్య‌లో పోటీకి రెడీ అయ్యారు. ఇప్ప‌టికే సీఎం జ‌గ‌న్ కొంద‌రికి హామీ ఇచ్చి ఉండ‌డంతో వారికి ఈ సీటు ద‌క్కుతుందా? అనే ప్ర‌చారం జ‌రుగుతోంది. అదేస‌మ‌యంలో ఈ సీటుకు రాజీనామా చేసిన పోతుల సునీత కూడా ఆశలు పెట్టుకున్నారు. గ‌తంలో టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద‌రావు.. ఆ పార్టీకి రాజీనామా చేసి.. వైసీపీలో చేరిన‌ప్పుడు.. ఇలానే ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జ‌రిగింది. ఆ స‌మ‌యంలో డొక్కాకే జ‌గ‌న్ ఛాన్స్ ఇచ్చి గెలిపించి.. మ‌ళ్లీ మండ‌లికి పంపారు.

ఇదేవిధంగా త‌న‌కు కూడా జ‌గ‌న్ న్యాయం చేస్తార‌నే ఆశాభావంతో పోతుల సునీత ఉన్నారు. ఒక‌వేళ ఆమెకు ద‌క్క‌క పోతే.. ఇటీవ‌ల మృతి చెందిన తిరుపతి పార్ల‌మెంటు అభ్య‌ర్థి బ‌ల్లి దుర్గా ప్ర‌సాద‌రావు కుటుంబం నుంచి ఆయ‌న కుమారుడికి ఈ టికెట్ ఇచ్చే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు సీనియ‌ర్లు. ఎందుకంటే.. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంటు ఉప ఎన్నిక టికెట్‌ను మ‌రొక‌రి ఇచ్చేందుకు జ‌గ‌న్ రెడీ అయ్యారు.

ఈ క్ర‌మంలో దుర్గా ప్ర‌సాద్ కుటుంబానికి న్యాయం చేసేందుకు ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని వినియోగిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలావుంటే.. గుంటూరు నుంచి మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు గ‌తంలోనే జ‌గ‌న్ హామీ ఇచ్చారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికైనా త‌న‌కు న్యాయం చేస్తారా ? అని ఆయ‌న ఎదురు చూస్తున్నారు. మొత్తం చూస్తే.. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. మ‌రి జ‌గ‌న్ ఎవ‌రిని క‌రుణిస్తారో చూడాలి. 


జిగర్తాండ సినిమా హిందీ రిమేక్ షూటింగ్ ప్రారంభించిన చిత్ర బృందం..!

మోదీ హవా తగ్గుతోందా...బీజేపీ కి పాతరోజులు తప్పవా...!

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?

ఐ లవ్ యూ అంటూ ఆ ఫొటోను పోస్ట్ చేసిన రష్మిక

కొడాలి నాని నీకే చెబుతున్నా.. సహనాన్ని పరీక్షించొద్దు: నందమూరి బాలకృష్ణ

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>