PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-govt-master-plan-temples-issueb74aaea8-2b87-4195-91d1-ec09c61e78c4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-govt-master-plan-temples-issueb74aaea8-2b87-4195-91d1-ec09c61e78c4-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలన్ని ఆలయాల చుట్టే తిరుగుతున్నాయి. మతాల చుట్టే పార్టీల మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. హిందూ ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడులతో ఉక్కిరిబిక్కిరవుతోంది వైసీపీ సర్కార్.దీంతో ప్రజా వ్యతిరేకతను తగ్గించుకునే పనిలో పడింది. ఇందుకోసం మాస్టర్ ప్లాన్ వేసింది జగన్ సర్కార్. పుష్కరాల సమయంలో ప్రకాశం బ్యారేజి వద్ద సుమారు 21 ఆలయాలు కూల్చివేసినట్టు తెలుస్తోంది. temples attack cm jagan;cbn;srinivas;tiru;krishna river;jagan;v vijayasai reddy;andhra pradesh;mp;government;temple;minister;tdp;ycp;reddy;masterజగన్ సర్కార్ మాస్టర్ ప్లాన్!జగన్ సర్కార్ మాస్టర్ ప్లాన్!temples attack cm jagan;cbn;srinivas;tiru;krishna river;jagan;v vijayasai reddy;andhra pradesh;mp;government;temple;minister;tdp;ycp;reddy;masterThu, 07 Jan 2021 08:22:51 GMTఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలన్ని ఆలయాల చుట్టే తిరుగుతున్నాయి. మతాల చుట్టే పార్టీల మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. హిందూ ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడులతో ఉక్కిరిబిక్కిరవుతోంది వైసీపీ సర్కార్.దీంతో  ప్రజా వ్యతిరేకతను తగ్గించుకునే పనిలో పడింది. ఇందుకోసం మాస్టర్ ప్లాన్ వేసింది జగన్ సర్కార్. కృష్ణా పుష్కరాల సమయంలో టీడీపీ హయాంలో కూల్చివేసిన ఆలయాలను పునర్ నిర్మించాలని నిర్ణయించింది. చంద్రబాబు పాలనలో విజయవాడలో కూల్చిన ఆలయాలను తమ ప్రభుత్వం పునర్నిర్మిస్తుందని  ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇందుకోసం ఏర్పాట్లు ప్రారంభించామన్నారు

             పుష్కరాల సమయంలో ప్రకాశం బ్యారేజి వద్ద సుమారు 21 ఆలయాలు కూల్చివేసినట్టు తెలుస్తోంది. వాటిలో  తొలి విడతగా వాటిలో 8 ఆలయాలను పునర్నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలుస్తోంది. తొలి దశ పూర్తయిన తర్వాత రెండో విడతలో మరికొన్ని ఆలయాల పునర్నిర్మాణం ఉంటుందని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా కూల్చివేతలకు గురైన ఆలయాలను కూడా నిర్మించే ఆలోచనలో ఏపీ సర్కారు ఉందని మంత్రి వెల్లడించారు. ఇక ఈ నెల 8న దుర్గగుడి అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. బెజవాడ కనకదుర్గ గుడి అభివృద్ధి పనులకు సర్కారు రూ.70 కోట్లు ఖర్చు చేయనుంది.

           టీడీపీ అధినేత చంద్రబాబును భగవంతుడే శిక్షిస్తాడని ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరించారు. మతాలకతీతంగా వైసీపీ పాలనందిస్తోందని ఆయన తెలిపారు. చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగా ఆలయాలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వంపై కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ కనుమరుగౌతోందన్న భయంతోనే బాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి తప్పుబట్టారు.ఏపీలో మత రాజకీయాలు పని చేయవన్న విజయసాయి రెడ్డి.. ప్రజల మధ్య చిచ్చు పెట్టాలనే చూసే పార్టీలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
       
       


రెండు ముక్కలైన యువకుడు.. సగం శరీరంతోనే 12 గంటలు..

మోదీ హవా తగ్గుతోందా...బీజేపీ కి పాతరోజులు తప్పవా...!

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?

ఐ లవ్ యూ అంటూ ఆ ఫొటోను పోస్ట్ చేసిన రష్మిక

కొడాలి నాని నీకే చెబుతున్నా.. సహనాన్ని పరీక్షించొద్దు: నందమూరి బాలకృష్ణ

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>