Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/kgf-2-trailer8b948438-d438-476b-a7c4-93c83a96a341-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/kgf-2-trailer8b948438-d438-476b-a7c4-93c83a96a341-415x250-IndiaHerald.jpgఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కేజీఎఫ్-2 ట్రైలర్ వచ్చేసింది. దేశ వ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు ఈ ట్రైలర్ కోసం దాదాపు ఏడాదిగా ఎదురు చేస్తున్నారు. అంతేకాదు దీనిపై భారీ అంచనాలను సైతం పెట్టుకున్నారు. వారి అంచనాలకు..kgf 2 trailer;watch;raveena tandon;sanjay dutt;prasanth;prashanth neel;india;cinema;january;youtube;hero;cigarette;kgf;prasanth neel;v;prashant kishor;chitramఅదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?kgf 2 trailer;watch;raveena tandon;sanjay dutt;prasanth;prashanth neel;india;cinema;january;youtube;hero;cigarette;kgf;prasanth neel;v;prashant kishor;chitramThu, 07 Jan 2021 22:26:00 GMTజనవరి 8వ తేదీ యశ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల చేయాలనుకుంది చిత్ర యూనిట్. కానీ అభిమానులకు సర్‌ప్రైజ్‌గా ఓ రోజు ముందుగానే ట్రైలర్‌ను విడుదల చేసి ఆశ్చర్యపరిచింది. ఇక ఈ టీజర్ గురించి మాట్లాడితే బాహుబలికంటే అదిరిపోయే విజువల్స్ ఇందులో కనిపిస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. పాన్ ఇండియా రేంజ్ ఏ మాత్రం తగ్గకుండా ఉంది. ఇక  అధీరగా సంజయ్ దత్ లుక్ సినిమాకే హైలెట్. దీనికి తోడు యశ్ క్యారెక్టరైజేషన్, ట్రైలర్ చివర్లో మిషన్ గన్ బ్యారెల్‌కు సిగరెట్ కాల్చుకునే సీన్ అదిరిపోయిందనే చెప్పాలి.

కన్నడలో తెరకెక్కి అనూహ్య విజయం సాధించిన కేజీఎఫ్ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రం కేజీఎఫ్-2. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర కథకు పార్ట్-2తో దర్శకుడు ప్రశాంత్ నీల్ ముగింపునివ్వనున్నాడు. ఈ చిత్రంలో రవీనా టాండన్ రమీకా సేన్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలను పెంచిందనే చెప్పాలి. తల్లికిచ్చిన మాటకు కట్టుబడిన కొడుకు కథగా పార్ట్-2ను తెరకెక్కించారని టీజర్ చివర్లోని ఓ సన్నివేశం చెప్పకనే చెప్పింది.

ఇదిలా ఉంటే సినిమా దేశ వ్యాప్తంగా అనేక భాష్లలో విడుదల అవుతుండడం వల్ల ట్రైలర్‌ను వినూత్నంగా విడుదల చేశారు. సాధారణంగా ట్రైలర్ అంటే హీరో డైలాగ్‌లు, విలన్ వాయిస్ ఇవన్నీ వినిపించాలి. అయితే పలు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతుండడం వల్ల అన్ని ట్రైలర్లను కాకుండా.. అన్ని భాషలకు కలిపి ఒకటే విడుదల చేశారు. ఇందులో ఎలాంటి డైలాగ్‌లు లేవు. కేవలం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోనే అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది చిత్ర బృందం. మరి సినిమా రిలీజ్ అయ్యాక ఏ స్థాయిలో హిట్ కొడుతుందో చూడాలి.

" style="height: 209px;">




కృష్ణా-వెస్ట్-ఈస్ట్‌ల్లో ఒకో వికెట్ ఔట్...వాళ్ళు డౌటే...

తెరాస పార్టీ బీజేపీ ని కాకుండా బండి ని టార్గెట్ చేయడంలో మర్మం ఏంటి..?

ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్దరించండి

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?

ఎమ్మెల్యేలను పిలుస్తున్న జగన్... షాక్ ఇస్తారా...?

వైసీపీతో స్నేహం చేసే నేతల మీద బిజెపి సీరియస్...?

షాకింగ్ న్యూస్.. తుమ్మితే ఎముకలు విరిగాయి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>