PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-nagarjuna-sagar3e3eb351-c501-4831-b37c-39a4f7b255b5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-nagarjuna-sagar3e3eb351-c501-4831-b37c-39a4f7b255b5-415x250-IndiaHerald.jpgవరుస ఓటములతో పరేషాన్ లో ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీకి త్వరలో జరగనున్న నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. సిట్టింగ్ స్థానం కావడంతో ఇక్కడ గెలవడం ఆ పార్టీకి కంపల్సరి. అందుకే నాగార్జున సాగర్ లో ఎలాగైనా గెలిచేందుకు ప్రణాళికలు రచిస్తోంది గులాబీ పార్టీ. అయితే అభ్యర్థి ఎంపిక అధికార పార్టీకి సవాల్ గా మారిందనే చర్చ జరుగుతోంది. దుబ్బాకలో సిట్టింగు సీటును కోల్పోవడంతో సాగర్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది అధికార పార్టీ. kcr nagarjuna sagar;nagarjuna akkineni;jr ntr;bharatiya janata party;telangana rashtra samithi trs;pithe;telangana;congress;assembly;mla;janareddy;reddy;party;sasanamandaliసాగర్ అభ్యర్థి ఎంపిక టీఆర్ఎస్ కు సవాలే!సాగర్ అభ్యర్థి ఎంపిక టీఆర్ఎస్ కు సవాలే!kcr nagarjuna sagar;nagarjuna akkineni;jr ntr;bharatiya janata party;telangana rashtra samithi trs;pithe;telangana;congress;assembly;mla;janareddy;reddy;party;sasanamandaliThu, 07 Jan 2021 08:16:07 GMTటీఆర్ఎస్ పార్టీకి త్వరలో జరగనున్న నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. సిట్టింగ్ స్థానం కావడంతో ఇక్కడ గెలవడం ఆ పార్టీకి కంపల్సరి. అందుకే నాగార్జున సాగర్ లో ఎలాగైనా గెలిచేందుకు ప్రణాళికలు రచిస్తోంది గులాబీ పార్టీ. అయితే అభ్యర్థి ఎంపిక అధికార పార్టీకి సవాల్ గా మారిందనే చర్చ జరుగుతోంది. దుబ్బాకలో సిట్టింగు సీటును కోల్పోవడంతో సాగర్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది అధికార పార్టీ.

         దివంగత ఎమ్మెల్యే నోముల కుటుంబ సభ్యులు పోటీకి సిద్ధపడుతున్నా.. దుబ్బాక ఫలితంతో టీఆర్ఎస్ కొంత ఆలోచనలో పడిందని చెబుతున్నారు. దుబ్బాకలో రామలింగారెడ్డి సతీమణకి టికెట్ ఇవ్వగా.. ఆమె పార్టీకి మైనస్ అయిందనే చర్చ జరిగింది. సాగర్ లోనూ అలాంటే సమస్యే రావచ్చనే ఆందోళన గులాబీ నేతల్లో కనిపిస్తోందని అంటున్నారు. నోముల కొడుకు రేసులో ఉన్నా... ఆయన జూనియర్ అనే ప్రచారాన్ని కొందరు తెరపైకి తెస్తున్నారు. దీంతో నోముల కుటుంబానికి నామినేట్ పదవిని ఇచ్చి కొత్త అభ్యర్థిని నాగార్జున సాగర్ లో బరిలోకి దింపితే ఎలా ఉంటుదన్న చర్చ కూడా టీఆర్ఎస్ లో జరుగుతుందని తెలుస్తోంది.

             నాగార్జున సాగర్ లో యాదవ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. నోముల కూడా ఆ వర్గానికి చెందిన వారే కావడంతో ఉప ఎన్నికలోనూ యాదవ్ కే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది. దీంతో యాదవ వర్గానికి చెందిన,ఉన్నతవిద్యవంతుడైన,ఉస్మానియా విద్యార్థి నేత, తెలంగాణ ఉద్యమకారుడు డా. దూదిమెట్ల బాలరాజు యాదవ్ ,రంజిత్ యాదవ్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. అదే సమయంలో నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని తెలంగాణ ఉద్యమకారులంతా ఏకమై తమలో ఒకరికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దూదిమెట్లకు టికెట్ ఇస్తే..ఉద్యమకారుడిని గుర్తించినట్లు అవుతుందనే అభిప్రాయాన్ని కొందరు టీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారట.


          రెడ్డి సామాజికవర్గ నేతలు కూడా టీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీరిలో ఎంసీ కోటిరెడ్డి,ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే టీఆర్ఎస్ రెడ్డికి టికెట్ ఇస్తే.. బీజేపీ యాదవ వ్యక్తిని బరిలోకి దింపే ప్రయత్నం చేస్తుందట. ఎలాగూ కాంగ్రెస్ నుంచి జానా రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. దీంతో ఇద్దరు రెడ్ల మధ్య బీజేపీకి ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. దీంతో నాగార్జున సాగర్ లో యాదవ వర్గానికి మళ్లీ టికెట్ ఇవ్వాలని దాదాపుగా నిర్ణయించిన టీఆర్ఎస్ పెద్దలు.. ఎవరిని ఖరారు చేయాలన్న అంశంలో మాత్రం తర్జనభర్జన పడుతున్నారని తెలుస్తోంది.




రెండు ముక్కలైన యువకుడు.. సగం శరీరంతోనే 12 గంటలు..

మోదీ హవా తగ్గుతోందా...బీజేపీ కి పాతరోజులు తప్పవా...!

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?

ఐ లవ్ యూ అంటూ ఆ ఫొటోను పోస్ట్ చేసిన రష్మిక

కొడాలి నాని నీకే చెబుతున్నా.. సహనాన్ని పరీక్షించొద్దు: నందమూరి బాలకృష్ణ

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>