Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/thrivikram49aef4bb-2df7-4375-9dc2-86cbe36fd1c0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/thrivikram49aef4bb-2df7-4375-9dc2-86cbe36fd1c0-415x250-IndiaHerald.jpgగతేడాది కరోనా మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీ బోసిపోయింది. అందుకే ఈ ఏడాది సినిమా లతో సందడి చేయడానికి సినీ ఇండస్ట్రీ ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. చిన్న పెద్దా తేడా లేకుండా హీరోలంతా సినిమాల్లో బిజీబిజీగా అయిపోయారు. అందులో టాలీవుడ్ అయితే ఊపుమీదుందనే చెప్పుకోవచ్చు. కరోనా కారణంగా కొన్ని నెలలుగా మూతపడ్డ థియేటర్లు కూడా ఓపెన్ అయ్యాయి. అందులోనూ థియేటర్లలోకి జనాలు వస్తారో రారోనన్న అపోహ కూడా తీరిపోయింది. అందుకే టాలీవుడ్ లో హీరోలు వరుస ప్రజెక్టులను చేసుకుంటూ వెళుతున్నారు. ఒక సినిమా ముగియకమునుపే మరో సినిమాకు గ్thrivikram;pawan;rana;kalyan;kranthi;kranti;pawan kalyan;trivikram srinivas;makar sakranti;tollywood;cinema;telugu;sankranthi;film industry;industry;blockbuster hit;remake;director;pawan-kalyanఆ డైరెక్టర్ స్క్రిప్టుకే అన్ని కోట్లు తీసుకుంటున్నాడా.. మంచి ప్లానే వేశాడుగాఆ డైరెక్టర్ స్క్రిప్టుకే అన్ని కోట్లు తీసుకుంటున్నాడా.. మంచి ప్లానే వేశాడుగాthrivikram;pawan;rana;kalyan;kranthi;kranti;pawan kalyan;trivikram srinivas;makar sakranti;tollywood;cinema;telugu;sankranthi;film industry;industry;blockbuster hit;remake;director;pawan-kalyanWed, 06 Jan 2021 13:10:00 GMTసినీ ఇండస్ట్రీ బోసిపోయింది. అందుకే ఈ ఏడాది సినిమా లతో సందడి చేయడానికి సినీ ఇండస్ట్రీ ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. చిన్న పెద్దా తేడా లేకుండా హీరోలంతా సినిమాల్లో బిజీబిజీగా అయిపోయారు. అందులో టాలీవుడ్ అయితే ఊపుమీదుందనే చెప్పుకోవచ్చు. కరోనా కారణంగా కొన్ని నెలలుగా మూతపడ్డ థియేటర్లు కూడా ఓపెన్ అయ్యాయి. అందులోనూ థియేటర్లలోకి జనాలు వస్తారో రారోనన్న అపోహ కూడా తీరిపోయింది. అందుకే టాలీవుడ్ లో హీరోలు వరుస ప్రజెక్టులను చేసుకుంటూ వెళుతున్నారు. ఒక సినిమా ముగియకమునుపే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ వెళుతున్నారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్నేండ్ల నుంచి మల్టీస్టారర్ సినిమాలకు హవా పెరిగిపోతూ వస్తోంది.


టాప్ స్టార్స్ నుంచి చిన్న చిన్న హీరోల వరకు ఈ మల్టీస్టారర్ సినిమాలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానితో పాటుగా ప్రేక్షకులు కూడా ఈ మల్టీస్టారర్ సినిమాలను ఎక్కువగా చూడటానికి ఇష్టపడుతున్నారు. అందుకే టాలీవుడ్ డైరెక్టర్లు కూడా వీటిపై ఆసక్తి కనబరుస్తున్నారు. దీనిలో భాగంగా ఇతర లాంగ్వేజ్ హిట్ మల్టీస్టారర్ సినిమాలను వదలడం లేదు టాలీవుడ్ మేకర్స్. కాగా ఇదివరకు మలయాళంలో బ్లాక్ బస్టర్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ మూవీని తెలుగులో రీమేక్ చేయడానికి సితార్ ఎంటర్ టైన్మెంట్ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ రీమేక్ మూవీలో పవర్ స్టార్  పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ  విషయాన్ని ఈ మధ్యే ఆ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

 ఈ చిత్ర షూటింగ్ సంక్రాంతి పండగ తర్వాత స్టార్ట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ మూవీకి సంబంధించిన తెలుగు డైలాగులను మాత్రం పవన్ మాటల మాంత్రికుడికి అప్పగించారు. ఈ మూవీ డైలాగ్స్ అందరినీ ఆకట్టుకునే పనిలో పడ్డారు త్రివిక్రమ్. అయితే మలయాళంలో మాత్రం డైరెక్టర్ సాచి విలువలతో కూడిన డైలాగ్స్ ను అందంగా రాసారు. అందుకే తెలుగులో కూడా అందరినీ కట్టిపడేసేలా ఉండాలని ఆ బాధ్యతను మాటల మాంత్రికుడికి అప్పగించారు. అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఈ రీమేక్ స్క్రిప్ట్ కోసం త్రివిక్రమ్ భారీగానే పుచ్చుకుంటున్నట్టు తెలుస్తోంది. సుమారుగా దీనికోసమే రూ.10 కోట్లను అడిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో పాటుగా ఈ సినిమా వసూళ్లలో కూడా త్రివిక్రమ్ కు  వాటా ఉందని సినీ ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమాలో నటించేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటిలు సంసిద్ధమవుతున్నట్టు సమాచారం.




కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్!

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి

క్లీనింగ్ చేసే మహిళను చూసి ఒక్కసారిగా పైకిలేచి సెల్యూట్.. ఆమె ఎవరో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>