PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid42ea1b0c-e6b7-4111-88a7-e53b037df84b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid42ea1b0c-e6b7-4111-88a7-e53b037df84b-415x250-IndiaHerald.jpgఏడాది కాలంపైగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. ఆ మహమ్మారి అంతమైపోతుందనుకుంటే.. ఇప్పుడు కొత్త కరోనా స్ట్రెయిన్ మొదలైంది. యూకేలో మొదలైన ఈ స్ట్రెయిన్ ఇప్పుడు 30 దేశాలకు పైగా పాకేసింది. భారత్‌లోనూ భారీ సంఖ్యలో కొత్త కరోనా స్ట్రెయిన్ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా ఒకేరోజు భారతదేశcovid;amala akkineni;delhi;central government;internationalకొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్covid;amala akkineni;delhi;central government;internationalWed, 06 Jan 2021 00:41:20 GMTకేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన కూడా చేసింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటివరకు నమోదైన మొత్తం కొత్త కరోనా కేసుల సంఖ్య 58కి చేరినట్టు ప్రకటన ద్వారా ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ లెక్కల ప్రకారం చూస్తే.. ఫూణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో 20 కొత్త కరోనా కేసులు బయటపడినట్టు తెలుస్తోంది.

కాగా.. కొత్త కరోనా సోకిన వారందరిని ప్రభుత్వం ఐసోలేషన్‌లో ఉంచింది. అంతేకాకుండా వీరు ఇప్పటివరకు ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యారో అనే దానిపై కాంటాక్ట్ ట్రేసింగ్ కూడా చేస్తున్నారు. కాగా.. కరోనాకు వ్యాక్సిన్ వచ్చిందని ఆనందపడేలోపు స్ట్రెయిన్ వెలుగులోకి వచ్చి ప్రపంచం మొత్తాన్ని మళ్లీ భయంగుప్పిట్లోకి నెట్టేసిందంటూ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా నుంచి గుణపాఠం నేర్చుకున్న ప్రపంచదేశాలన్ని ఇప్పుడు ఈ కొత్త కరోనా స్ట్రెయిన్‌ తమ దేశంలోకి ప్రవేశించకుండా కఠిన నిబంధనలు అమలు చేసుకుంటూ పోతున్నాయి. ఇందులో భాగంగా పలు దేశాలు బ్రిటన్, దక్షిణాఫ్రికాలకు అంతర్జాతీయ విమాన సర్వీసులను ఇప్పటికే నిలిపివేసిన సంగతి తెలిసిందే.

కొవిడ్ కంటే ఈ కొత్త స్ట్రెయిన్ 70 శాతం వేగంగా వ్యాప్తిచెందుతోంది. ఈ కారణంగా ప్రపంచ దేశాలు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఆయా దేశాల్లో ఇప్పటికే కొత్త స్ట్రెయిన్ కేసులు బయటపడటం మొదలయ్యాయి. ఇక ఈ స్ట్రెయిన్‌ కారణంగా యూకేలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో.. అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. అక్కడి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటివరకు బ్రిటన్‌లో సుమారు 1000 స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి.





ఏపీ పాలిటిక్స్‌లోకి రేవంత్...హస్తం టార్గెట్ మారిందా?

కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>