Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bird-fluebfc6716-2aa4-483b-b7b4-a288c3af3feb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bird-fluebfc6716-2aa4-483b-b7b4-a288c3af3feb-415x250-IndiaHerald.jpgఇన్నాళ్లూ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని భయపెట్టింది. కోట్ల మంది ప్రాణాలను బలిగొంది. అయితే ఎట్టకేలకు ఆ మహమ్మారిని నిరోధించేందుకు వ్యాక్సిన్‌లను తయారు చేసి ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాం. అయితే ఇప్పుడు మన దేశంలో మరో ఉపద్రవం ముంచుకొస్తోంది. అదే బర్డ్ ఫ్లూ. ఉన్నట్లుండి ఉత్తరాది రాష్ట్రాల్లో కాకుల్లో బయటపడి.. ..bird flu;amaravati;chicken;local language;central government;tenaliతెలుగు రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ.. కలకలం రేపుతున్న కేసులు!తెలుగు రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ.. కలకలం రేపుతున్న కేసులు!bird flu;amaravati;chicken;local language;central government;tenaliWed, 06 Jan 2021 21:56:23 GMTఅమరావతి: ఇన్నాళ్లూ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని భయపెట్టింది. కోట్ల మంది ప్రాణాలను బలిగొంది. అయితే ఎట్టకేలకు ఆ మహమ్మారిని నిరోధించేందుకు వ్యాక్సిన్‌లను తయారు చేసి ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాం. అయితే ఇప్పుడు మన దేశంలో మరో ఉపద్రవం ముంచుకొస్తోంది. అదే బర్డ్ ఫ్లూ. ఉన్నట్లుండి ఉత్తరాది రాష్ట్రాల్లో కాకుల్లో బయటపడి.. ఈ మధ్యనే దక్షిణాది రాష్ట్రాలకూ పాకింది. ఇక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ కేసులు బయటపడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమై కీలక చర్యలు తీసుకుంటున్నాయి.

అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రలకూ ఈ వైరస్ వ్యాపించింది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలి సమీపంలో వందలాది పక్షులు చనిపోవడం స్థానికంగా కలకలం రేగింది.  పక్షులు మృతి చెందడంతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. తగిన చర్యలు తీసుకుంటున్నాయి. అయితే తెలుగు రాష్ట్రల్లో కూడా కల్లింగ్ నిర్వహిస్తారా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. కానీ చికెన్ అమ్మకాలపై మాత్రం నిషేధం విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.

తొలుత రాజస్తాన్‌లో కాకులు మరణించడంతో అక్కడి ల్యాబ్‌లు వీటిపై టెస్టులు చేశాయి. బర్డ్ ఫ్లూ వల్లే ఆ పక్షులు మరణించాయని పరిశోధనల్లో తేలింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. అయితే రాజస్తాన్‌లో వెలుగుచూసిన బర్డ్ ఫ్లూ కొద్ది రోజుల్లోనే మధ్య ప్రదేశ్‌కు పాకింది. స్థానిక కళాశాలలో దాదాపు 100 కాకుల వరకు మరణించడంతో షాక్ తిన్న ప్రభుత్వం వెంటనే వాటిని పరిశోధించాల్సిందిగా ఆదేశించింది. భోపాల్‌లోని ప్రభుత్వ ల్యాబ్ దీనిపై పరిశోధించి బర్డ్ ఫ్లూగా తేల్చింది. దీంతో వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం.

ఆ మరిసటి రోజే దక్షిణాది రాష్ట్రమైన కేరళలో కూడా బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. వందలాది బాతులు ఈ వైరస్ బారిన పడినట్లు తేలింది. దీంతో దాదాపు 40 వేల బాతులను చంపేందుకు అక్కడి ప్రభుత్వం కల్లింగ్ ఆపరేషన్‌ను ప్రారంభించింది. అంతకంటే ముందే  హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఈ వైరస్ బయటపడింది. వలస పక్షులు వందల సంఖ్యలో మృత్యువాత పడ్డాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక చర్యలకు ఉపక్రమిస్తోంది.

 తాజాగా కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఈ బర్డ్ ఫ్లూపై అలెర్ట్‌గా ఉండాలని హెచ్చరించింది. పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇంతలోనే మన తెలుగు రాష్ట్రాల్లోనూ బర్డ్ ఫ్లూ కలకలం వెలుగులోకి వచ్చింది.

ఇదిలా ఉంటే ఇప్పటివరకు పక్షులకు మాత్రమే బర్డ్ ఫ్లూ సోకడంతో పౌల్ట్రీ పరిశ్రమలు భారీగా నష్టపోతున్నట్లు వాపోతున్నాయి. కోళ్లకు ఈ వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అయితే కేంద్రం చికెన్ అమ్మకాలను కొన్ని రోజుల పాటు నిషేధించడంతో తమకు తీవ్ర నష్టం తప్పదని నిర్వాహకులు ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు.


కేసీఆర్ ప్లాన్ వల్ల మళ్ళీ గ్రేటర్ ఎలక్షన్స్ వస్తాయా..?

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు

బండి సంజయ్ ది కార్పొరేటర్ స్థాయి!

డబ్బుల కోసం బ్యాంకుకు వచ్చిన డెడ్ బాడీ.. వణికిపోయిన ఉద్యోగులు..

రాయలసీమ గూండాలను ఊరుకునేది లేదు: తెలంగాణా మంత్రి సంచలన వ్యాఖ్యలు

మరో వివాదంలో సిఎం జగన్...! నిజమేనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>