MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pramukha-hero-tweet-prajala-pranaaltho-adukokandi3073fbe8-c574-48ab-a7a2-d2831667f987-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pramukha-hero-tweet-prajala-pranaaltho-adukokandi3073fbe8-c574-48ab-a7a2-d2831667f987-415x250-IndiaHerald.jpgకరోనా కష్టకాలం కొనసాగుతున్న సమయంలో ఇటువంటి ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడం సరికాదని ఖండించారు. తమిళనాడు సినిమా హాళ్లలో 100శాతం సామర్థ్యానికి వ్యతిరేకంగా అరవింద్ స్వామి తాజాగా చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.theatres occupancy issue;allu aravind;arvind swamy;vijay;cinema;kollywood;tamil;chief minister;twitter;hero;joseph vijay;dalapathiప్రముఖ హీరో ట్వీట్: ప్రజల ప్రాణాలతో ఆడుకోకండి...!ప్రముఖ హీరో ట్వీట్: ప్రజల ప్రాణాలతో ఆడుకోకండి...!theatres occupancy issue;allu aravind;arvind swamy;vijay;cinema;kollywood;tamil;chief minister;twitter;hero;joseph vijay;dalapathiWed, 06 Jan 2021 15:00:00 GMT" style="height: 254px;">
థియేటర్ల పై తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను వ్యతిరేకిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు కోలీవుడ్ ప్రముఖ నటుడు అరవింద్ స్వామి. కోలివుడ్ సినీ నటుడు విజయ్ మరియు కొందరు సినీ ప్రముఖుల కోరిక మేరకు థియేటర్లలో 100% ఆక్యుపెన్సీ కి అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం. థియేటర్లలో సీటింగ్ సామర్ధ్యాన్ని 50 శాతం నుండి వంద శాతానికి పెంచాలని... దళపతి విజయ్ తన సినిమా విడుదలకు ముందే తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామిని వ్యక్తిగతంగా కలిసిన విషయం తెలిసిందే.

 అటు నిర్మాతలు సైతం డిమాండ్ చేస్తుండడంతో... ఆ తర్వాత తమిళనాడు ప్రభుత్వం ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ నిర్ణయాన్ని కొందరు ప్రశంసిస్తుంటే.. మరికొందరు కరోనా నేపథ్యంలో ఈ ప్రయోగం ఏంటి అంటూ విమర్శిస్తున్నారు. ఇప్పుడు అదే తరహాలో వార్తల్లో నిలిచారు తమిళ టాప్ హీరో అరవిందస్వామి. కరోనా కష్టకాలం కొనసాగుతున్న సమయంలో ఇటువంటి ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడం సరికాదని ఖండించారు. తమిళనాడు సినిమా హాళ్లలో 100శాతం సామర్థ్యానికి వ్యతిరేకంగా అరవింద్ స్వామి తాజాగా చేసిన ట్వీట్  సంచలనంగా మారింది. అరవింద స్వామితో పాటు పలువురు సినీ ప్రముఖులు సైతం థియేటర్లలో 100% సీటింగ్ సినిమా ప్రదర్శనకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వ నిర్ణయానికి అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

100శాతం కంటే 50శాతం మెరుగ్గా ఉన్న సందర్భాలు ఉన్నాయని.. వాటిలో ఇది ఒకటి!! అని ఆయన తమిళ సినిమా హిస్టరీని గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు అరవింద స్వామి. కరోనా కష్ట సమయంలో... ప్రజలకు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలని.... ఇలా వంద శాతానికి సీటింగ్ సామర్థ్యం పెంచడం వల్ల ప్రమాదం మళ్లీ పెరిగే అవకాశం ఉందని  ఆయన ఉద్దేశం. కరోనా వలన ఎంత నష్టం జరిగిందో చూసాం కదా...మళ్ళీ ప్రజల ప్రాణాలతో ఆటలు సరికాదంటూ చెప్పారు. సినిమా చూసేవారి భద్రతను దృష్టిలో ఉంచుకుని చాలా మంది ట్విట్టర్ యూజర్లు ఆయన ముందుచూపును ప్రశంసిస్తున్నారు. మరి దీనిపై తమినాడు ప్రభుత్వం పునరాలోచిస్తుందా...?


ఇష్టం లేకుండానే బలవంతంగా నానితో ఆ సినిమా చేయించారట..!

శవమై ఇంటికి వచ్చిన తల్లి.. అయినా కొడుకుకు భారమైంది.. చివరికి..?

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>