EditorialMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ap-politics-janasen-pavan-kalyan-pavan-politicsf7490d7d-1034-4991-8a6d-38cadb6108d6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ap-politics-janasen-pavan-kalyan-pavan-politicsf7490d7d-1034-4991-8a6d-38cadb6108d6-415x250-IndiaHerald.jpgజన సేన అధినేత పవన్ కళ్యాణ్ పెంచిన పొలిటికల్ స్పీడ్ తో ఆ పార్టీలో ఉత్సాహం రెట్టించిన స్థాయిలో పెరిగిపోయింది. దీనికి బీజేపీ కూడా జత కలవడంతో ఇక తమకు తిరుగు లేదు అనే నమ్మకం పార్టీ శ్రేణుల్లో బాగా పెరిగిపోయింది.దీనికి తగ్గట్టుగానే పవన్ ఒక వైపు సినిమాలు చేస్తూనే , మరోవైపు రాజకీయంగా యాక్టివ్ గా ఉంటూ పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం తీసుకువచ్చే విధంగా తమ వంతు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఇవన్నీ కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. 2019 ఎన్నికల్లో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే, అధికారం సాధిస్తాననే నమ్మకం పార్pavan kalyan janasena tdp ysrcp lokesh;auto;pawan;lokesh;kalyan;tiru;bharatiya janata party;jagan;nara lokesh;janasena;2019;telugu;army;letter;tdp;ycp;lokesh kanagaraj;janasena party;yatra;dookudu;partyఎడిటోరియల్ : పవన్ మారాల్సిందే ... చాలా చాలా మారాల్సిందే ?ఎడిటోరియల్ : పవన్ మారాల్సిందే ... చాలా చాలా మారాల్సిందే ?pavan kalyan janasena tdp ysrcp lokesh;auto;pawan;lokesh;kalyan;tiru;bharatiya janata party;jagan;nara lokesh;janasena;2019;telugu;army;letter;tdp;ycp;lokesh kanagaraj;janasena party;yatra;dookudu;partyWed, 06 Jan 2021 16:00:00 GMTజన సేన అధినేత పవన్ కళ్యాణ్ పెంచిన పొలిటికల్ స్పీడ్ తో ఆ పార్టీలో ఉత్సాహం రెట్టించిన స్థాయిలో పెరిగిపోయింది.  దీనికి బీజేపీ కూడా జత కలవడంతో ఇక తమకు తిరుగు లేదు అనే నమ్మకం పార్టీ శ్రేణుల్లో బాగా పెరిగిపోయింది.దీనికి తగ్గట్టుగానే పవన్ ఒక వైపు సినిమాలు చేస్తూనే , మరోవైపు రాజకీయంగా యాక్టివ్ గా ఉంటూ పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం తీసుకువచ్చే విధంగా తమ వంతు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఇవన్నీ కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. 2019 ఎన్నికల్లో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే, అధికారం సాధిస్తాననే నమ్మకం పార్టీ నేతలను బాగా పెరిగింది. కాకపోతే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకునే విషయంలో పవన్ దృష్టి పెట్టకపోవడం,  కేవలం బిజెపి అండ ఉంటే సరిపోతుంది అన్నట్లుగా ఆయన ముందుకు వెళ్తున్నాడు. అలాగే బీజేపీ కూడా క్షేత్రస్థాయిలో  పెద్దగా బలం పెంచుకో లేక పోవడం, ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా మారాయి. అయితే ఇదే సమయంలో జనసేన రాజకీయ ప్రత్యర్థుల నుంచి వస్తున్న విమర్శలను తిప్పి కొట్టడంలో పవన్ విఫలం అవుతున్నారు. దీనికి తగ్గట్టుగానే ఆయన వ్యవహారం ఉండడంతో జనాల్లో మాత్రం నమ్మకం కలగడం లేదు. 






పవన్ కేవలం తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది ఏర్పడినప్పుడు ఆ పార్టీని రక్షించేందుకు వైసీపీ పై విమర్శలు చేస్తున్నారని,  దానికి తగ్గట్టుగానే పవన్ ప్లాన్ చేసుకుంటున్నారు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి . ఇక కొద్ది రోజుల క్రితం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రైతు యాత్ర చేపట్టారు. సరిగ్గా అదే సమయంలో పవన్ కూడా యాత్ర చేపట్టడం , లోకేష్ , తాము  రైతు సమస్యలపై  పోరాడుతున్నామని అభిప్రాయం కలిగించడానికి అనే విమర్శలు వ్యక్తమయ్యాయి. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పవన్ మద్దతు పలికారు. ప్రభుత్వాన్ని గెలిపిస్తే ప్రజల తరఫున తాను ప్రశ్నిస్తాం అని,  టీడీపీ ఇచ్చిన హామీలు అన్నిటికీ, జవాబుదారీగా ఉంటాను అంటూ చెప్పారు. టిడిపి ఐదేళ్ల కాలంలో ఆ పార్టీని విమర్శించడం గాని చేయలేదు. అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసిపి పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ,  జగన్ టార్గెట్ చేసుకుంటూ ఎన్నో రకాలుగా విమర్శలు చేశారు. అప్పుడే పవన్ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.





 ఇక వైసీపీ ప్రభుత్వం 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ పవన్ విమర్శలు చేస్తూ, యాత్రలు, ఉద్యమాలు అన్ని టిడిపికి కలిసి వచ్చే విధంగా చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ శ్రేణు ల్లో గతంతో పోలిస్తే ఇప్పుడు ఉత్సాహం పెరిగినా, జనాలు మాత్రం అనుమానాలు మాత్రం పోవడం లేదు.  జనాల్లో కూడా బలం పెంచుకుని పవన్ దూకుడుగా వ్యవహరిస్తే జనసేన కు ఎన్నో రకాలుగా కలిసి వస్తుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.




ప్చ్.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కు ఇంకా క్లారిటీ రాలేదేంటబ్బా..

మీ శక్తి ప్రజలందరికీ తెలుసు... జగన్ మీద పవన్ ఆసక్తికర కామెంట్స్

74 ఏళ్ళ చంద్రబాబు.. కొడాలి నానీ కీలక వ్యాఖ్యలు

శవమై ఇంటికి వచ్చిన తల్లి.. అయినా కొడుకుకు భారమైంది.. చివరికి..?

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>